సరిహద్దులో కాల్పుల మోత
శ్రీనగర్: భారత్- పాకిస్థాన్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం రద్దయిన తర్వాత కొద్దిరోజుల విరామం అనంతరం పాక్ రేంజర్లు మళ్లీ రెచ్చిపోయారు. కశ్మీర్ సరిహద్దులోని పూంఛ్ జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి నుంచి నిర్విరామంగా కాల్పులు జరుపుతున్నారు.
సోమవారం ఉదయం వరకు తుపాకుల మోత కోనసాగుతూనే ఉన్నది. బీఎస్ఎఫ్ జవాన్లు కూడా ఎదురుకాల్పులతో పాక్ బలగాలకు బుద్ధిచెప్పేపనిలో ఉన్నట్లు అధికారవర్గాలు తెలిపాయి.