Satyasheel Yadav
-
మరోసారి పాక్ కాల్పుల ఉల్లంఘన
పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ కాశ్మీర్ పూంఛ్ జిల్లాలోని బింబర్ గాలి సబ్ - సెక్టార్పైకి పాక్ బలగాలు విచక్షణారహితంగా కాల్పులు జరిపాయి. దాంతో భారత్ జవాన్లు అప్రమత్తమైయ్యారు. పాక్ సైన్యం కాల్పులను భారత్ జవాన్లు తిప్పికోట్టారు. ఈ ఘటన గత రాత్రి చోటు చేసుకుందని డిఫెన్స్ పీఆర్ఓ లెఫ్టినెంట్ కల్నల్ మనీష్ మెహతా తెలిపారు. పాక్ కాల్పుల్లో ఎవరికి ఎటువంటి గాయాలు కానీ ఆస్తి నష్టం కానీ వాటిల్లలేదని చెప్పారు. పాక్ ప్రభుత్వం బీఎస్ఎఫ్ జవాన్ సత్యశీల్ యాదవ్‌ను భారత్‌కు అప్పగించిన కొన్ని గంటల్లోనే ఈ కాల్సులు చోటు చేసుకున్నాయని మెహతా వెల్లడించారు. ఇటీవల బీఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న నావ చీనబ్ నదిలో తిరగబడింది. ఆ ఘటనలో సత్యశీల్ అనే జవాన్ ఆ నదిలో కొట్టుకుని పోయాడు. ఆ క్రమంలో సియాల్ కోట్ వద్ద అతడ్ని పాక్ బలగాలు పట్టుకున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి సత్యశీల్ను భారత్ అప్పగించాలని పాక్‌కు కోరింది. దాంతో సత్యశీల్ను శుక్రవారం భారత్‌కు అప్పగించారు. సత్యశీల్ను భారత్‌కు అప్పగించి కొన్ని గంటల వ్యవధిలోనే పాక్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడటం గమనార్హం. -
అనుకున్న దానికంటే పాకిస్తాన్ లో బాగా చూశారు!
ఇస్లామాబాద్: పాకిస్తాన్ నుంచి స్వదేశానికి చేరుకున్నభారత్ జవాన్ సత్యశీల్ యాదవ్ ఆ దేశం తనపై చూపిన ప్రేమకు ముగ్ధుడయ్యాడు. తనను ఆ దేశ అధికారులు చాలా బాగా చూసుకున్నారని స్పష్టం చేశాడు. ప్రమాదవశాత్తూ పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించిన భారత జవాన్ ను ఆ దేశం సురక్షితంగా అప్పగించిన అనంతరం కుటుంబ సభ్యులను కలిసిన సత్యశీల్ మీడియాతో మాట్లాడాడు. ' నన్ను పాకిస్తాన్ బాగా చూసుకుంది. నేను అనుకున్నదానికంటే ఎక్కువగా ఆ దేశం నాపట్ల అమితమైన శ్రద్ధ చూపించింది' అని తెలిపాడు. కొన్ని రోజుల క్రితం బీఎస్ఎఫ్ జవాన్ యాదవ్ చీనాబ్ నదిలో కొట్టుకుపోయి పాకిస్థాన్ రేంజర్లకు చిక్కాడు. జమ్మూలోని ఆర్ ఎస్ పురా సెక్టార్‌లోని జీరో లైన్ వద్ద పాక్ సైనికాధికారులు సత్యశీల్ను ఈ రోజు బీఎస్ఎఫ్ అధికారులకు అప్పగించారు. సత్యశీల్ ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నాడని బీఎస్ఎఫ్ అధికారి చెప్పారు. -
భారత్ జవాన్‌ను అప్పగించిన పాకిస్థాన్ సైన్యం
న్యూఢిల్లీ: ప్రమాదవ శాత్తూ తమ భూభాగంలోకి ప్రవేశించిన భారత జవాన్‌ను పాకిస్థాన్ సురక్షితంగా అప్పగించింది. సత్యశీల్ యాదవ్ అనే బీఎస్ఎఫ్ జవాన్ చీనాబ్ నదిలో కొట్టుకుపోయి పాకిస్థాన్ రేంజర్లకు చిక్కాడు. జమ్మూలోని ఆర్ ఎస్ పురా సెక్టార్‌లోని జీరో లైన్ వద్ద పాక్ సైనికాధికారులు సత్యశీల్ను బీఎస్ఎఫ్ అధికారులకు అప్పగించారు. సత్యశీల్ ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నాడని బీఎస్ఎఫ్ అధికారి చెప్పారు.