పోలీస్‌ స్టేషన్‌ పై గ్రెనేడ్‌ దాడి | Grenade attack on police post in Kulgam | Sakshi
Sakshi News home page

పోలీస్‌ స్టేషన్‌ పై గ్రెనేడ్‌ దాడి

Published Thu, Oct 26 2017 5:59 PM | Last Updated on Thu, Oct 26 2017 6:02 PM

Grenade attack on police post in Kulgam

శ్రీనగర్‌: పోలీస్‌ స్టేషన్‌ పై గ్రెనేడ్‌ దాడి జరిగిన ఘటనలో ఇద్దరు పోలీసులతో పాటు ఓ పౌరునికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన జమ్ము కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. దమ్హాల్‌ హాంజిపుర పోలీస్‌ స్టేషన్‌పై గురువారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని ఉగ్రవాదులు గ్రెనేడ్‌ విసిరారు.

ఏం జరిగిందో గుర్తించే లోపే పెద్ద శబ్ధంతో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఓ స్పెషల్‌ పోలీస్‌ ఆఫీసర్‌, ఓ కానిస్టేబుల్‌లతో పాటు తన పని నిమిత్తం పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన పౌరుడు తీవ్రంగా గాయాపడ్డారు. దీంతో వారిని ఆస్పత్రికి తరలించి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement