
దంతెవాడ(ఛత్తీస్‌గఢ్): బీఎస్‌ఎఫ్ జవాను ఒకరు గ్రెనేడ్ ప్రమాదవశాత్తూ పేలడంతో మృత్యువాతపడ్డారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. బీఎస్‌ఎఫ్ 70వ బెటాలియన్ జవాన్లు ఎన్నికల విధుల్లో భాగంగా కాటేకల్యాణ్ పోలీస్‌స్టేషన్‌లో మకాం వేశారు.
తనిఖీల కోసం బయలుదేరి వెళ్తున్న సమయంలో బల్బీర్ చంద్ అనే జవాను వద్ద పౌచ్‌లో ఉన్న గ్రెనేడ్ ప్రమాదవశాత్తూ పేలింది. తీవ్రంగా గాయపడిన బల్బీర్‌ను వెంటనే దంతెవాడ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆయన అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. బల్బీర్ చంద్ స్వరాష్ట్రం హిమాచల్ ప్రదేశ్.