న్యూఢిల్లీ : కశ్మీర్ లోయలో మరో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. కుల్గామ్ జిల్లాలోని తురిగామ్‌లో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో భద్రతా దళాలు ఆదివారం కార్డన్ సెర్చ్ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య హోరాహోరీగా ఎదురు కాల్పులు జరిగాయి. ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఉగ్రవాదుల దాడిని తిప్పికొట్టే క్రమంలో క్రమంలో ఓ పోలీస్ అధికారి, ఓ ఆర్మీ జవాన్ మరణించారు. ఓ ఆర్మీ మేజర్, ఇద్దరు జవాన్లు, ఒక హవల్దార్ తీవ్ర గాయాలపాలయ్యారు. వారిని ఆస్పత్రికి తరలించారు. అమరుడైన పోలీస్ అధికారిని డీఎస్పీ (ఆపరేషన్స్) అమన్ ఠాకూర్‌గా గుర్తించారు. ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడిలో 40 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు అసువులుబాసిన విషయం తెలిసిందే. (బాధను భరిస్తూ కూర్చోం)
Comments
Please login to add a commentAdd a comment