Jaish e Mohammad
-
‘యాత్ర’కు బ్రేక్? ఏమిటా నిఘా సమాచారం!
కేంద్ర ప్రభుత్వం శుక్రవారం అనూహ్యంగా జమ్మూకశ్మీర్‌లో కొనసాగుతున్న అమర్నాథ్ యాత్రను నిలిపేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా జమ్మూకశ్మీర్‌కు భారీగా బలగాలనూ తరలించింది. ఒక్కసారిగా లోయలో భయాందోళన రేకెత్తించిన ఈ పరిణామాల వెనుక.. నిఘా వర్గాలు అందించిన కచ్చితమైన సమాచారమే కారణమని తెలుస్తోంది. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రమూకలు ఎలాంటి అవాంఛనీయ దాడులకు పాల్పడకుండా.. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఆత్మాహుతి దాడులు జరిగే అవకాశముందని, సోపూర్ ప్రాంతంలో ఐఈడీ (ఇంప్రూవైస్డ్ పేలుడు పదార్థాల)లతో భద్రతా బలగాలను జైషే మహమ్మద్ (జేఈఎం) తదితర ఉగ్రమూకలు టార్గెట్ చేయవచ్చునన్న నిఘా వర్గాల సమాచారమే ఈ ఆకస్మిక పరిణామాలకు కారణమని ఈ వ్యవహారంతో పరిచయం కలిగిన ఇద్దరు విశ్వసనీయ వ్యక్తులు ఓ మీడియా సంస్థకు వెల్లడించారు. ఏమిటా నిఘా సమాచారం! జేఈఎం చీఫ్ మసూద్ అజార్ సోదరుడు ఇబ్రహీం అజార్ గత నెలలో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లో కనిపించాడని జాతీయ భద్రతా సంస్థలకు కచ్చితమైన నిఘా సమాచారం అందింది. 1999 నాటి భారత్ విమానం హైజాక్ ప్రధాన సూత్రధారి అయిన ఇబ్రహీం అజార్ తన కొడుకు మృతికి ప్రతీకారంగా లోయలోకి చొరబడి.. ఇక్కడ భద్రతా దళాలపై జరిపే ఉగ్రదాడులకు నేతృత్వం వహించాలని కోరుకుంటున్నాడని నిఘా వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఇబ్రహీం అజార్ నేతృత్వంలో సుశిక్షితులైన జేఈఎం ఉగ్రవాదులు బార్డర్ యాక్షన్ టీమ్స్‌ను ఏర్పాటు చేసి.. సరిహద్దు నియంత్రణ రేఖ మీదుగా ఉన్న పాక్ ఆర్మీ పోస్టుల దిశగా కదిలాయని నిఘా వర్గాలు వెల్లడించాయి. ఇబ్రహీం కొడుకు ఉస్మాన్ హైదర్ గత ఏడాది అక్టోబర్‌లో కశ్మీర్లోకి చొరబడి.. అదే నెల 30వ తేదీన పుల్వామాలోని అవంతీపురలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందాడు. మరో బంధువు, మసూద్ అజార్ బావమరిది అబ్దుల్ రషీద్ కొడుకు తహ్లా రషీద్ 2017 నవంబర్ 6న పుల్వామా కండి అల్గార్ వద్ద జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యాడు. ఈ నేపథ్యంలో ఆగ్రహంతో రగిలిపోతున్న ఇబ్రహీం.. తన కొడుకు తరహాలోనే భారత బలగాలపై పోరాడుతూ చనిపోతానని జేఈఎం కేడర్‌కు చెప్పాడని నిఘా వర్గాలు తెలిపాయి. ఇబ్రహీం అజార్ కశ్మీర్లో పెద్ద ఎత్తున దాడులకు గ్రౌండ్‌వర్క్ చేయడంపై కచ్చితమైన సమాచారం అందడంతో కేంద్రం వెంటనే అప్రమత్తమై ఈ నిర్ణయం తీసుకుందని ఓ సీనియర్ భదత్రాధికారి వెల్లడించారు. పాకిస్థాన్‌కు చెందిన జేఈఎం, లష్కరే తోయిబా తమ ఉగ్రవాద కార్యకలాపాలను ముమ్మరం చేయడాన్ని నిఘా వర్గాలు ఇప్పటికే పసిగట్టాయి. అంతేకాకుండా అమర్నాథ్ యాత్ర మార్గంలో ఎం24 స్నిపర్ రైఫిల్, భద్రతా దళాలు లక్ష్యంగా అమర్చిన మందుపాతరలు దొరకడంతో పొంచి ఉన్న ముప్పును గ్రహించిన కేంద్రం వెంటనే అమర్నాథ్ యాత్రను నిలిపివేసిందని, దీంతో యాత్రకు రక్షణగా ఉన్న బలగాలు తిరిగి ఉగ్రమూకల ఏరివేత ఆపరేషన్‌కు సన్నద్ధమవుతాయని ఆ అధికారి తెలిపారు. కశ్మీర్లో హింసాత్మక దాడులే లక్ష్యంగా పాక్ సాయుధ మూకలు లోయలోకి పెద్ద ఎత్తున చొరబడేందుకు ప్రయత్నిస్తున్నాయని, కశ్మీర్లో పలుచోట్ల ఆత్మాహుతి దాడులు నిర్వహించాలని అవి తలపోస్తున్నాయని నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. పెషావర్ నుంచి సుశిక్షితులైన జేఈఎం సాయుధ మూక కశ్మీర్లోకి చొరబడి.. భారత బలగాలపై మెరుపుదాడులు నిర్వహించాలని, ఉత్తర కశ్మీర్‌లోని సోపూర్లో ఐఈడీలతో భద్రతా దళాలను టార్గెట్ చేయాలని పథకాన్ని రచించినట్టు పేర్కొన్నాయి. పాక్ సైన్యంతోపాటు హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి ఉగ్రసంస్థలు కూడా ఈ దాడుల విషయంలో ఆ మూకలకు సహకారం, సమన్వయం అందించనున్నాయని నిఘా వర్గాలు తెలిపాయి. -
పక్కా సమాచారంతో దాడి.. ముగ్గురు జైషే ఉగ్రవాదుల హతం
న్యూఢిల్లీ : కశ్మీర్ లోయలో మరో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. కుల్గామ్ జిల్లాలోని తురిగామ్‌లో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో భద్రతా దళాలు ఆదివారం కార్డన్ సెర్చ్ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య హోరాహోరీగా ఎదురు కాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్లో ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఉగ్రవాదుల దాడిని తిప్పికొట్టే క్రమంలో క్రమంలో ఓ పోలీస్ అధికారి, ఓ ఆర్మీ జవాన్ మరణించారు. ఓ ఆర్మీ మేజర్, ఇద్దరు జవాన్లు, ఒక హవల్దార్ తీవ్ర గాయాలపాలయ్యారు. వారిని ఆస్పత్రికి తరలించారు. అమరుడైన పోలీస్ అధికారిని డీఎస్పీ (ఆపరేషన్స్) అమన్ ఠాకూర్‌గా గుర్తించారు. ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడిలో 40 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు అసువులుబాసిన విషయం తెలిసిందే. (బాధను భరిస్తూ కూర్చోం) (చదవండి : ఇమ్రాన్.. అమాయకత్వపు ముసుగు తీసేయ్: ఒవైసీ) -
ఒక్క చెంప దెబ్బతో అన్నీ కక్కేశాడు
జమ్ముకశ్మీర్‌లో 40 మంది జవాన్ల ప్రాణాలను పొట్టన పెట్టుకున్న పుల్వామా దాడి సూత్రధారి, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ అజర్పైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది.భారత్‌పై ఎన్నో భీకర దాడులకు పాల్పడిన అజర్ గతంలో ఒకే ఒక్కసారి అరెస్ట్ అయ్యాడు. 1994–99 మధ్య కాలంలో జమ్ములోని కోట్ భల్వాల్ జైలులో అయిదేళ్లు ఊచలు లెక్కపెట్టాడు. ఆ సమయంలో ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ అధికారి అవినాశ్ మోహననే అజర్‌ను ప్రతీరోజూ విచారించేవారు. ఆ విచారణలో అజర్ మనస్తత్వాన్ని బాగా పసిగట్టారు. అజర్‌ను విచారించడం అత్యంత సులభమని, ఆర్మీ అధికారి ఒక్క చెంప దెబ్బకొట్టగానే, పాక్‌లో టెర్రరిస్టు గ్రూపుల గురించి, ఐఎస్ఐ గుట్టుమట్లు గురించి పూసగుచ్చినట్టు చెప్పేశాడని అవినాశ్ వెల్లడించారు. గొప్పలు ఎక్కువ మసూద్ అజర్‌కి గొప్పలు ఎక్కువ. తన గురించే ఎప్పుడూ చెబుతూ ఉంటాడు. పాకిస్తాన్, ఐఎస్ఐ తనకెంత ప్రాధాన్యత ఇస్తుందో కథలు కథలుగా చెప్పేవాడు, తనని ఎక్కువ కాలం ఎవరూ కస్డడీలో ఉంచలేరని ధీమాగా గడిపేసేవాడు. మతోన్మాదాన్ని రెచ్చగొట్టడంలో మసూద్‌కి మించిన వాడు లేడని పేరుంది.. కశ్మీర్లో జిహాదీని ప్రోత్సహించే సామర్థ్యం ఉన్న వాడు కనుకే అతనికి ఐఎస్ఐ అండదండలు పుష్కలంగా ఉన్నాయని అవినాశ్ అభిప్రాయపడ్డారు. తీగలాగితే చాలు.. కాస్త కదిలిస్తే చాలు అజర్ అనర్గళంగా మాట్లాడేవాడు. ఒక చిన్న ప్రశ్న వేస్తే చాలు..ఎన్నో విషయాలను వివరించేవాడు.పాక్ గడ్డపై ఉగ్రవాద మూకలు ఎలా పనిచేస్తాయి ? వారి నియామకం ఎలా జరుగుతుంది ? పాక్ గూఢచర్య ఐఎస్ఐ ఎలాంటి కుట్రలు పన్నుతుంది.. ఇలాంటి విషయాలన్నీ సమగ్రంగా వివరించేవాడు. ఆప్ఘన్ టెర్రరిస్టులు కశ్మీర్ లోయలోకి ఎలా ప్రవేశిస్తారో, హర్కత్ ఉల్ ముజాహిదీన్, హర్కత్ ఉల్ జిహాదీ ఇస్లామిలను విలీనం చేసి హర్కల్ ఉల్ అన్సర్ సంస్థ ఎలా ఏర్పడిందో వంటి విషయాలన్నీ వివరించాడు. తన స్వార్థం కోసం ఎంతదూరమైనా వెళతాడు అజర్. అనూహ్యంగా అరెస్ట్ అసలు అతను అరెస్ట్ కావడమే చాలా అనూహ్యంగా జరిగింది. హర్కత్ ఉల్ అన్సర్ ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యదర్శిగా ఉండే అజర్ తమ సంస్థ కమాండర్ ఇన్ చీఫ్ సజ్జాద్ అప్ఘనీని కలుసుకోవడానికి 1994లో ఫిబ్రవరి 11న అనంతనాగ్ జిల్లాలోని కప్రాన్ అటవీ ప్రాంతానికి వెళ్లాడు. వాళ్లిద్దరూ కలిసి ఒక ఆటోలో తప్పించుకోబోయారు. గస్తీ పోలీసులు ఆటోని ఆప్పినప్పుడు ఇద్దరూ కలిసి పరుగులు తీశారు9. దగ్గరలో ఉన్న ఆర్మీ పికెట్‌కు చెందిన సైనికులు వీరిద్దరినీ అరెస్ట్ చేశారు. అటు సజ్జాద్ అప్ఘని తాను పట్టబడడానికి అజర్ కారణమని భావించాడు. జైల్లో ఉన్నన్నాళ్లూ వారిద్దరికి ఒకరి పొడ అంటే మరొకరికి గిట్టేది కాదు. సొంత సంస్థపైనే విమర్శలు అజర్ తన సొంత సంస్థపైనే విమర్శలు గుప్పించేవాడు. కశ్మీర్లో పరిస్థితులపై తన సంస్థ తప్పుదారి పట్టించడం వల్లే తాను అరెస్ట్ అయ్యానని విచారణలో వెల్లడించాడు. ‘అప్ఘనిస్తాన్ తరహా పరిస్థితుల్ని నేను కశ్మీర్లో ఊహించుకున్నాను. ముజాహిదీన్ గ్రూపులు హాయిగా స్వేచ్ఛగా ఆప్ఘన్, పాక్ మధ్య ఎలా ప్రయాణం చేస్తాయో, కశ్మీర్ నుంచి పాక్‌కు అలాగే రావచ్చునని అనుకున్నాను. కానీ వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది. భారత భద్రతా దళాల నుంచి తప్పించుకోవడానికి ముజాహిదీన్లు పరుగులంకించుకునే దృశ్యాలే కనిపించాయి. నా సొంత ఉగ్రవాద సంస్థ నన్ను తప్పుదోవ పట్టించడం వల్లే అరెస్ట్ అయ్యాను‘‘ అని అజర్ ఆ విచారణలో వివరించాడు. అహం ఎక్కువ అరెస్టయిన తనని బయటకు రప్పించడంలో జాప్యం జరగడం, అయిదేళ్లు జైలు నాలుగు గోడల మధ్య మగ్గిపోవడంతో అజర్ అహం దెబ్బ తింది. దీంతో తనను ప్రోత్సహించిన మాతృ సంస్థ హర్కత్ ఉల్పైనే కక్ష గట్టాడు. 1999లో ఖాట్మండు నుంచి న్యూఢిల్లీకి రావాల్సిన ఐసీ–814 విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేసి ఆప్ఘన్లో కాందహార్‌కు తీసుకువెళ్లారు. అందులో ప్రయాణికుల్ని సురక్షితంగా విడిపించుకోవడం కోసం అప్పట్లో అధికారంలో ఉన్న ఎన్టీయే సర్కార్ మసూర్ అజర్, ఒమర్ షేక్, ముస్తాక్ అహ్మద్ జర్గార్ వంటి వారిని జైలు నుంచి విడుదల చేయాల్సిన పరిస్థితి వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత తాను సొంతంగా జైషే మహ్మద్ అనే ఉగ్రవాద సంస్థను స్థాపించాడు. పాక్ ఐఎస్ఐ కూడా ఉగ్రవాద సంస్థలన్నింటిపైనే అతనికి అధికారాలు ఇచ్చింది. దీంతో ఇన్నాళ్లూ తనకు అన్నం పెట్టిన హర్కత్ ఉల్‌పై ఎలాంటి కృతజ్ఞతాభావం లేకుండా ఎక్కువ మంది కేడర్‌ను తనవైపు లాగేశాడు. భారత్‌పై విజేతగా నిలిచించి తానక్కొడినేనని విర్రవీగేవాడు. ప్రస్తుతం ఐఎస్ఐ రక్షణలో మసూద్ అజర్ భారత్‌పై ఎన్నో దాడులకు తెగబడ్డాడు. పార్లమెంటు, పథాన్‌కోట్ ఎయిర్‌బేస్, జమ్ము, ఉరీలో సైనిక శిబిరాలపై దాడుల వెనుక అతని హస్తం ఉంది. కరాచి నుంచి వెలువడే టాబ్లాయిడ్ సజాదే ముజాహిద్ జర్నలిస్టుగా 1993లోనే అతను ఇతర విలేకరుల బృందంతో కలిసి ఎన్నో దేశాలు తిరిగి కశ్మీర్ అంశంలో మద్దతు ఇవ్వాల్సిందిగా కూడా కోరాడు. ప్రస్తుతం పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో బహవాయిపూర్లోని ఒక కలుగులోఎలుకలా దాక్కున్న అజర్‌ని అనుక్షణం పాక్ ఐఎస్ఐ కంటికి రెప్పలా కాపలా కాస్తూ ఉంటుంది. ఏదో విధంగా అజర్‌ను పట్టుకొని భారత్‌కు తీసుకువచ్చి విచారణ జరపాలన్న కృతనిశ్చయంతో భారత్ ఉంది. -సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఉగ్రదాడి తెస్తున్న పెను ప్రమాదం
జమ్మూ–కశ్మీర్‌లోని పుల్వామాలో సైనిక కాన్వాయ్‌పై జరిగిన ఆత్మాహుతి దాడి స్థానిక ఘర్షణల ఫలితం కాదు. ఐఎస్ఐ ప్రేరేపిత జైషే అహ్మద్ వ్యూహంలో భాగంగా ఆ దాడి జరిగింది. ఉగ్రదాడులు జరిగిన ప్రతి సందర్భంలోనూ పాక్ ప్రమాదకరమైన వ్యూహాన్ని అమలు చేస్తూంటుంది. నేను కోరిందల్లా ఇవ్వు. లేకపోతే నా తలను నేనే పేల్చుకుంటాను అంటూ తనతలపై తానే ట్రిగ్గర్ గురిపెట్టుకునే తరహాలో పాకిస్తాన్ వ్యవహరిస్తోంది. పైగా ఇరు దేశాల మధ్య తీవ్ర ఘర్షణలు జరిగినప్పుడు చల్చార్చడానికి అమెరికాతో సహా ప్రపంచ దేశాలు ముందుకొచ్చే పరిస్థితి ఇప్పుడు లేదు. ఈ క్రమంలో యుద్ధ ప్రకటన ఎవరు చేసినా దాని ఫలితం ప్రమాదకరంగానే ముగుస్తుంది. పాకిస్తాన్ వ్యూహచింతనపై దక్షిణాసియా వ్యవహారాల్లో అమెరికన్ నిపుణుడు స్టీఫెన్ పి. కోహెన్ తెలివిగా వర్ణించారు. పాకిస్తాన్ తన తలపై తుపాకీ గురిపెట్టుకుని ఇతర ప్రపంచంతో చర్చలు సాగిస్తూం టుందని వ్యాఖ్యానించారు. దాని సారాంశం ఏమిటంటే, నేను కోరిం దల్లా ఇవ్వు. లేకపోతే నా తలను నేనే పేల్చుకుంటాను. ఆ తర్వాత ఏర్పడే గందరగోళంతో మీరు తలపట్టుకోవలసి వస్తుంది. సరిగ్గా అలాంటి ట్రిగ్గర్నే పాకిస్తాన్ ఇప్పుడు పుల్వామాలో లాగిందా? (ఉగ్ర మారణహోమం) మొదటగా పుల్వామాలో సైనిక కాన్వాయ్‌పై జరిగిన దాడి పూర్తిగా దేశీయంగా జరిగిన ఉగ్రదాడి అని చెప్పడానికి చాలా తక్కువ అవకాశాలున్నాయి. ఆత్మాహుతికి పాల్పడిన ఉగ్రవాది తిరుగుబాటుతత్వం జీర్ణించుకుపోయిన భారతీయ కశ్మీర్ వాసి. కానీ అతడు పూర్తిగా భారతీయ వ్యూహరచనతో అమలుచేసిన ఉగ్రచర్యలో భాగం కాదని చెప్పడానికి తగిన కారణాలున్నాయి.1. జైషే మహమ్మద్ ఈ దాడికి తానే కారణమని ప్రకటించింది. ఇది పూర్తిగా పాకిస్తాన్ కేంద్రంగా ఉంటూ ఐఎస్ఐ నియంత్రణలో ఉండే సంస్థ. 2. ఈ ఉగ్రచర్యకు దారితీసిన తిరుగుబాటుతత్వం, ప్రేరణ స్థానికపరమైనదే కావచ్చు, కానీ ఔత్సాహిక స్థానిక బృందాల వద్ద ఇంతటి అధునాతనమైన పేలుడు పదార్థాలు (చాలావరకు ఆర్డీఎక్స్ లేక ఆర్డీక్స్ కలిపినవి) లభ్యమవుతాయని, గురిచూసి కొట్టే యంత్రాంగంతో కూడిన నైపుణ్యాలు వీరికి ఉంటాయని చెప్పడానికి కనీస సాక్ష్యాధారాలు కూడా లేవు. 3. ఆత్మాహుతి బాంబర్ రికార్డు చేసిన చివరి వీడియోను చూడండి. అతడు వాడిన భాష కశ్మీరీల బాధలకు ప్రతీకారం కోరుతున్నట్లు లేదు. పైగా భారత్‌లో ఇతర ప్రాంతాల్లోని ముస్లింలను రెచ్చగొడుతున్నట్లుగా కూడా ఆ ప్రకటనలో లేదు. పైగా బాబ్రీ మసీదు, గుజరాత్ ఘటనలు ప్రస్తావించాడు. ‘ఆవు మూత్రం తాగే వారికి’ వ్యతిరేకంగా తిరుగుబాటుకు ‘మన ముస్లింలు అందరూ’ సిద్ధపడాలని పిలుపునిచ్చాడు. ఇలాంటి భాష లష్కరే తోయిబా కంటే మించి జైషే ఉగ్రసంస్థ నుంచి పుట్టుకొచ్చిందే తప్ప స్థానికులది కాదు. (ప్రతీకారం తీర్చుకునేందుకు ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ: ప్రధాని) పుల్వామాలో జరిగిన దాడి గతంలో జైషే నిర్వహించిన దాడులకు అచ్చుగుద్దినట్లుంది. 2001లో శ్రీనగర్‌లో రాష్ట్ర అసెంబ్లీపై ఆత్మాహుతి దాడి, అదే సంవత్సరం పార్లమెంటుపై జరిగిన దాడి, ఇటీవల పఠాన్ కోట్, గుర్దాస్పూర్లపై దాడులు మొత్తంగా ఒకే లక్ష్యాన్ని ప్రకటించాయి. కశ్మీర్ వెలుపల ఏదో ఒక స్థాయిలో బీభత్సం సృష్టించాలి. ముంబైలో 2008లో లష్కర్ ఇలాగే చేసింది. కానీ దాని శక్తియుక్తులను చాలావరకు కశ్మీర్లో జరుగుతున్న పోరాటంలోనే ఇప్పటికీ ఉపయోగిస్తోంది. అయితే జైషే దానికంటే చిన్న సంస్థ అయినప్పటికీ, మరింత దుష్టత్వంతో, అపార వనరులతో ఐఎస్ఐ మద్ధతుతో ఇలాంటి ప్రభావశీలమైన దాడులను ఎంచుకుని మరీ సాగిస్తోంది. జైషే ఎంత శక్తిసంపన్నంగా తయారైందో మనకు ఐసీ–814 విమానం హైజాక్ కాలం నుంచే తెలుసు. అది 90ల చివర్లోనే భారతీయ విమానాన్ని కఠ్మాండులో హైజాక్ చేసి సురక్షితంగా కాందహార్‌లో దించి, ప్రయాణికులను వదిలిపెట్టాలంటే భారత్ జైళ్లలో ఉండే దాని కీలక నేతలను విడుదల చేయాల్సిందేనని పట్టుబట్టి మరీ సాధించుకుంది. జైషే చీఫ్ మసూద్ అజర్ విడుదల ప్రక్రియ వరకు పూర్తిగా అది ఐఎస్ఐ కనుసన్నల్లో నడిచిందని పదే పదే రుజువవుతూ వస్తోంది. పాకిస్తాన్ ప్రభుత్వ యంత్రాంగం, ఐఎస్ఐ అయితే.. లష్కర్, హఫీజ్ సయీద్‌ల కంటే జైషేనే తమ అతిపెద్ద ఆస్తిగా భావిస్తున్నాయి. జైషే వీరి అతి ప్రధాన శక్తిగా తయారైంది. చైనా ప్రభుత్వం కూడా దాన్ని గుర్తించింది కాబట్టే మసూద్ అజర్‌ని కాపాడే విషయంలో సిగ్గులేకుండా పాక్‌తో పోటీపడుతోంది. అందుకే ఉగ్రవాది స్థానిక కశ్మీరీ కావడంలో ఆశ్చర్యపడాల్సింది లేదు. విమాన హైజాక్, పార్లమెంట్ తదితర చోట్ల జరిపిన దాడులతో సహా జైషే సాగించిన ప్రతి ఉగ్రచర్యలోనూ భారతీయ కశ్మీరీలను కీలక భాగస్వాములుగా చేస్తూ వస్తోంది. కాబట్టే ఉగ్రవాదానికి స్థానిక మూలాలను వెదుకుతూ ఉగ్రచర్చల్లో పాకిస్తాన్‌కు నేరుగా పాత్ర లేదనిపించేలా జరుగుతున్న సూత్రబద్ధ చర్చల్లో సమయం వృ«థా చేయడం మానడం చాలా మంచిది. ఇప్పుడు మనం ఈ ప్రశ్నను ఎందుకు లేవనెత్తుతున్నాం. పాకిస్తాన్ చివరికి తన తలపైకే ట్రిగ్గర్ గురిపెట్టుకుందా? జైషే, లష్కరే గతంలో ఎలాంటి ప్రతీకార ప్రకటనలకు దిగకుండానే దాడులకు పాల్పడేవి. అటల్ బిహారీ వాజ్‌పేయి నుంచి మన్మోహన్ సింగ్ హయాం మధ్య కాలంలో భారత్ ఆగ్రహావేశాల ప్రదర్శననుంచి బయటపడి పాక్‌పై అంతర్జాతీయ ఒత్తిడిని తీసుకొచ్చే విధానాలవైపునకు మళ్లింది. రెచ్చగొట్టే చర్యలకు పాల్పడటం కంటే మౌలికంగా యుద్ధ వ్యతిరేక వ్యూహతత్వం వైపు మొగ్గుచూపింది. మోదీ ప్రభుత్వం ఇలాంటి నటనను సాగించడం లేదు. మన్మో హన్, వాజ్‌పేయి తదితర ప్రభుత్వాలు గతంలో వ్యవహరించిన తీరుని మోదీ ప్రభుత్వం పిరికి చేష్టగా భావిస్తోంది. ప్రత్యేకించి ఉడీ సర్జికల్ దాడుల అనంతరం ఉగ్రదాడులకు వ్యతిరేకంగా దాడిని నిలి పివేయడం, లేక చాలా కాలం తనకు తాను నిబ్బరంగా ఉండటం మోదీ ప్రభుత్వానికి సాధ్యం కాదు. అలాగే పాక్ కూడా యుద్ధానికి సమీపంలోకి వచ్చింది. అది ఎప్పుడు జరుగుతుంది, ఎలా ఎక్కడ అనేది ఎవరికీ తెలీదు కానీ ఆ తరుణం సంభవించడానికి ఎక్కువ కాలం పట్టేట్టు లేదు. ప్రతీకారాత్మక ప్రతిస్పందన త్వరలో సంభవించవచ్చు. ప్రత్యర్థిపై తాము వీరోచిత విజయం అందుకున్నామంటూ పెద్దగా ప్రకటించుకునే రూపంలో అది ఉండవచ్చు. అదేసమయంలో భారత్ ఇంతవరకు కనీ వినీ ఎరుగని ఎన్నికల ప్రచారం ప్రారంభ దినాల్లోకి అడుగిడుతోంది. పుల్వామా కళంకాన్ని భరిస్తూ నరేంద్రమోదీ రెండో టర్మ్ అధికారంకోసం ప్రయత్నం చేయకపోవచ్చు. ఇక ఈ దాడుల వ్యూహాన్ని ఇంతటితో వదిలిపెట్టాలని నిర్ణయించుకోవడం పాకిస్తాన్ వంతు కావచ్చు. లేదా భారత్ ప్రతిచర్యకు ప్రతీకారం తీసుకోవలసిందేనంటూ తన సొంత ప్రజల ఒత్తిళ్లకు అనుగుణంగా అది స్పందించవచ్చు. సైనికపరంగా ఏం జరిగినప్పటికీ అది ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ పాలనకు ముగింపు పలుకుతుంది. భారత్‌తో ఎంత చిన్న లేక పెద్ద యుద్ధానికి దిగిన పాక్ పాలకుడు పదవిని కాపాడుకున్న ఘటన లేదని చరిత్ర మనకు తెలుపుతోంది. అయూబ్ ఖాన్(1965), యాహ్యా ఖాన్ (1971), నవాజ్ షరీఫ్(1999)ల పతనం ఇదే చెబుతోంది. తర్వాతేం జరుగుతుందో చెప్పే నిర్ణాయక శక్తి ఇమ్రాన్‌కు ఉండకపోవచ్చు. కార్గిల్ ఉదంతం తర్వాత నవాజ్‌లాగే తను కూడా ఆర్మీ లేక ఐఎస్ఐ తలబిరుసుతనానికి ఇమ్రాన్ కూడా ఫలితం అనుభవించవచ్చు. ఆరకంగా బలిపశువు కాకూడదంటే ఇమ్రాన్‌కు అపార నైపుణ్యంతోపాటు కాస్త అదృష్టం కూడా తోడు రావాల్సి ఉంది. ఇలాంటి అంశాల్లో ఎన్నికైన ఏ పాక్ ప్రధాని మాట కూడా ఇంతవరకు చెల్లుబాటు కాలేదు. పైగా ఇమ్రాన్ అందరికంటే బలహీనుడు. ఎలా స్పందించాలి అనేది ఆర్మీ చేతుల్లోనే ఉంది. ప్రతీకార చర్యకు పాల్పడొద్దని సైన్యానికి సలహా ఇచ్చే శక్తి ఇమ్రాన్‌కు ఉంటుందనీ చెప్పలేం. తమ తలలను పేల్చుకోవాలా వద్దా అనేది సైన్యమే నిర్ణయించుకోగలదు. వీటిలో ఏది జరిగినా నష్టపోయేది మాత్రం ఇమ్రానే మరి. మోదీకి ఆయన వారసులకు మధ్య తేఢాను పక్కనబెట్టి చూస్తే, రెండు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. 2008లో ముంబైలో లేక 2001–02లో జమ్మూ–కశ్మీర్, భారత పార్లమెంటుపై ఉగ్రదాడులు జరిగినప్పుడు అమెరికన్, యూరోపియన్ నేతలు పరుగున వచ్చి భారత్‌ను బుజ్జగించారు. రష్యా, చైనా కూడా తమ వంతు పాత్ర పోషించాయి. పాక్‌ను ఖండిస్తూ భారత్‌కు సంఘీభావం ప్రకటించడం ద్వారా వారు భారతీయుల ఆగ్రహాన్ని చల్లార్చారు. కానీ అలాంటి ప్రపంచం ఇప్పుడు లేదు. అమెరికాలో ట్రంప్ గెలిచి అమెరికాను ఉన్నత స్థితిలో నిలుపుతానంటూ చేసిన బాసను నెరవేర్చుకునే దిశగా ప్రయాణిస్తూ ప్రపంచాన్ని పట్టించుకోవడం మానేశాడు. పుల్వామాలో జరిగిన ఉగ్రదాడికి వ్యతిరేకంగా తక్షణం ట్వీట్ చేయడానికి కూడా ట్రంప్ పూనుకోకపోవచ్చు. ఆధునిక ప్రపంచపు చిరకాల ప్రత్యర్థులు తమ ప్రాంతంలో ఘర్షణల పరిష్కారంలోనే కొట్టుమిట్టులాడుతున్నారు. మనగురించి పట్టించుకునే తీరిక, శక్తి వారికి ఉండకపోవచ్చు. భారతీయ ఉపఖండం ప్రపంచానికి గతంనుంచి హెచ్చరిక చేస్తూ వచ్చేది. ‘మా మధ్యకు వచ్చి ఘర్షణలను నిలిపివేయడానికి ప్రయత్నించండి లేకుంటే మేం పరస్పరం అణ్వాయుధాలు ప్రయోగించుకుంటాం.’ తమవద్ద అణ్వాయుధాలు ఉన్నాయని ప్రకటించుకుంటూ ఉపఖండం ప్రపంచాన్ని ఒకరకంగా బ్లాక్మెయిల్ చేసేది. ఇప్పుడు ఇలా బెదిరించినా ప్రపంచం పట్టించుకునే స్థితి కనిపించడం లేదు. పైగా అణ్వాయుధాలు బలహీనమైన ఓటమికి దగ్గరగా ఉన్న దేశాలకు ప్రాధాన్యతా ఆయుధాలుగా మారాయి. 1990లో వీపీ సింగ్ అసమర్థత కారణంగా పాకిస్తాన్ తన అణ్వాయుధ బూచిని పూర్తిగా తనకు ప్రయోజనం కలిగేలా ఉపయోగించుకుంది. ఆ క్రమంలో భారత్‌నుంచి ఎలాంటి చిన్న ప్రతిఘటన కూడా జరగకుండా పాక్ జాగ్రత్తపడింది. ఇక వ్యూహాత్మక అణ్వాయుధాల విషయానికి వస్తే పాకిస్తాన్ ఇంతవరకు వాటిని పరీ క్షించలేదు. ఇప్పుడు వారు విధ్వంసకరమైన దిగ్భ్రాంతిని కలిగించవచ్చు. పైగా భారత ప్రభుత్వ యంత్రాంగం ఇప్పుడు అణ్వాయుధాలు ఏక పక్షంగా ప్రభావం చూపుతాయని ఎంతమాత్రం భావించడం లేదు. ఒకవేళ ఈ ఎన్నికల వారాల్లో అలాంటి అవకాశాన్ని చేజిక్కించుకోవాలని భారత్ చూస్తున్నట్లయితే ముందుగా ట్రిగ్గర్ మనమే నొక్కవచ్చు కూడా. వ్యాసకర్త : శేఖర్ గుప్తా, ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
మాటలకందని విషాదం
మూడు దశాబ్దాలుగా నెత్తురోడని రోజంటూలేని జమ్మూ–కశ్మీర్లో గురువారం సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్‌పై జరిగిన ఆత్మాహుతి దాడి దేశ ప్రజానీకాన్ని మాత్రమే కాదు... ప్రపంచాన్నే నిశ్చేష్టుల్ని చేసింది. జవాన్ల వాహనశ్రేణిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాది ఒకడు ఆత్మాహుతి దాడికి పూనుకొని 43 మందిని పొట్టనబెట్టుకున్న ఈ ఉదంతం ఆ రాష్ట్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగనిది. భద్రతా బలగాలు ఒక దాడిలో ఇంతమంది సహచరులను కోల్పోవడం కశ్మీర్లో ఇదే తొలిసారి. ఈ ఆత్మాహుతి దాడి జరిగిన కాసేపటికే పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ దానికి తామే కారణమని ప్రకటించడంతోపాటు ఆ ఉగ్రవాది పేరు ఆదిల్ అహమ్మద్ దార్ అని వెల్లడించింది. (ప్రతీకారం తీర్చుకునేందుకు ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ: ప్రధాని) దాడికి ముందు ఉగ్రవాది ఆదిల్ మాట్లాడిన వీడియోను కూడా సామాజిక మాధ్యమాల్లో ఉంచింది. ‘కశ్మీర్ కోసం వెయ్యేళ్ల యుద్ధానికైనా సిద్ధమ’ని గతంలో పాకిస్తాన్ పాలకులు చెప్పడాన్ని గుర్తుం చుకుంటే ఈ ఉగ్రవాద విషసర్పానికి అక్కడ ఏ స్థాయిలో అండదండలున్నాయో అర్ధమవుతుంది. అలాంటి మద్దతే లేకపోతే దాడికి తామే బాధ్యులమని ప్రకటించిన జైషే మొహమ్మద్ సంస్థపై పాకి స్తాన్ చర్యలకు ఉపక్రమించేది. 24 గంటలు గడిచినా ఆ విషయంలో మౌనంగానే ఉండిపోయింది. కనుకనే ప్రధాని నరేంద్రమోదీ పాకిస్తాన్‌ను తీవ్రంగా హెచ్చరించవలసి వచ్చింది. (ఉగ్ర మారణహోమం) సైనికంగా తనకంటే అనేక రెట్లు శక్తిమంతమైన భారత్ వంటి పొరుగుదేశాన్ని ఇలాంటి ఉన్మాద దాడులతో పాదాక్రాంతం చేసుకోగలమని, కనీసం అస్థిరత్వంలోకి నెట్టగలమని పాకిస్తాన్ భ్రమిం చడం దాని తెలివితక్కువ నైజాన్ని, మూర్ఖత్వాన్ని బయటపెడుతోంది. గతంలో అది తన మను షుల్ని సమీకరించి, వారికి అవసరమైన శిక్షణనిచ్చి, దాడి చేయాల్సిన ప్రాంతాల వివరాలను అంద జేసి సరిహద్దులు దాటించేది. కానీ అక్కడ భద్రత పటిష్టపడటం వల్ల కావొచ్చు... అంతర్జాతీ యంగా చీవాట్లు పడుతుండటంవల్ల కావొచ్చు దానికి స్వస్తి పలికి కశ్మీరీ పౌరులపై దృష్టి పెట్టినట్టు కనబడుతోంది. చదువుసంధ్యల్లేని యువతను ఎంచుకుని వారికి ఉగ్రవాదం నూరిపోసి, ఆయుధా లిచ్చి పంపి తన ప్రయోజనాన్ని నెరవేర్చుకునే పన్నాగానికి పూనుకుంది. తాజా ఉదంతానికి కారకు డైన ఆదిల్ నేపథ్యం ఈ సంగతిని వెల్లడిస్తోంది. నిజానికి ఈ యువతలో ఎందరు ఇష్టప్రకారం ఆ ముఠాలోకి వెళ్తున్నారో చెప్పలేం. చావడానికి పోతూ ఉగ్రవాది ఆదిల్ ఇచ్చిన ‘సందేశం’ స్వచ్ఛం దంగా ఇచ్చిందో, చుట్టూ తుపాకులతో నిలబడి చెప్పించిందో ఎవరూ నిర్ధారించలేరు. ఇరాక్, సిరి యాల్లో ఉగ్రవాద సంస్థ ఐఎస్ నడిపిన శిబిరాల్లో ఆత్మాహుతి బాంబర్లుగా శిక్షణ పొంది మధ్యలోనే దొరికిపోయిన కొందరు పిల్లలు వెల్లడించిన కథనాలు గతంలో వెలువడ్డాయి. జైషే మొహమ్మద్ స్వతంత్ర ఉగ్రవాద సంస్థ కాదు. దానికి పాకిస్తాన్ సైన్యం కనుసన్నల్లో పనిచేసే గూఢచార సంస్థ ఐఎస్ఐతో ఉన్న సాన్నిహిత్యంలో దాపరికమేమీ లేదు. ఉగ్రవాదంపై పోరాటం బహుముఖంగా ఉండాలి. దాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్తాన్‌ను అంతర్జాతీయంగా ఏకాకిని చేయడం కోసం నిరంతరాయంగా ప్రయత్నించడంతోపాటు చుట్టూ జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ భద్రతాపరంగా పటిష్టమైన చర్యలు తీసుకోవడం ముఖ్యం. ఆ విషయంలో మనం విఫలమయ్యామని తాజా ఉదంతం తేట తెల్లం చేస్తోంది. ఫలితంగా ఆత్మాహుతి దాడుల సంస్కృతి కశ్మీర్ లోయకు సైతం జొప్పించడంలో జైషే సంస్థ విజయం సాధించినట్టు కనబడుతోంది. ఆత్మాహుతి దాడి 2000 సంవత్సరంలోనూ జరిగింది. కానీ 29మంది ప్రాణాలు తీసిన ఆ ఉదంతంతో పోలిస్తే తాజా ఉదంతం తీవ్రత అన్ని విధాలా అధికం. అప్పట్లో ఉగ్రవాది ప్రభుత్వ వాహనాన్ని హైజాక్ చేసి ఆ పని చేశాడు. ఇప్పుడు ఆ అవసరం లేకుండా ఒక పల్లెలో పేలుడు పదార్థాలతో నిండిన వాహనాన్ని ఉగ్రవాది సిద్ధం చేసుకున్నాడు. జమ్మూ–కశ్మీర్ భద్రతా విషయాల్లో తలమునకలై ఉండే యంత్రాంగానికి సహ జంగానే ఇటీవల అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలేమిటో తెలియకపోవు. ఆ స్థాయిలోనే నిఘా ఉన్నదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఏడాది కాలంగా ఆత్మాహుతి దాడులు జరగొచ్చునన్న సమాచారం ఇంటెలిజెన్స్ సంస్థలకు అందుతూనే ఉన్నదని ఆ వర్గాల కథనం. అటువంటప్పుడు అందుకనువైన విధానాలను రూపొందించుకోవడం భద్రతా బలగాల బాధ్యత. జవాన్ల వాహనశ్రేణి వెళ్లే దారిలో ముందుగా ప్రత్యేక బృందం వెళ్లి ఆ మార్గం సురక్షితంగా ఉన్నదో లేదో మదింపు వేయడం రివాజు. అది సక్రమంగానే జరిగిందా? ఆత్మాహుతి దాడికి గురైన వాహనశ్రేణిలో 78 వాహనాలుంటే, అందులో 2,547మంది జవాన్లు ప్రయాణిస్తున్నారు. అసా« దారణమైన, అత్యవసరమైన పరిస్థితుల్లో మాత్రమే భారీ కాన్వాయ్‌లు తరలిస్తారు. మామూలు పరిస్థితుల్లో వేయిమందికి మించని జవాన్లతో ఉండే వాహనశ్రేణిని అనుమతిస్తారని చెబుతారు. అలాంటి పద్ధతులను ఎందుకు పాటించలేదు? జమ్మూ నుంచి తెల్లారుజామున 3.30కు బయ ల్దేరిన జవాన్ల వాహనశ్రేణి గురించిన సమాచారం అక్కడికి 241 కిలోమీటర్ల దూరంలోని అవం తిపొరా పట్టణం సమీపంలో పొంచివున్న ఉగ్రవాదులకు ఎలా చేరింది? అలాగే అడుగడుగునా రాత్రింబగళ్లు తనిఖీలు సాగుతుండే రాష్ట్రంలో ఒక పల్లెకు 350 కిలోల అత్యాధునిక పేలుడు పదార్థం(ఐఈడీ) ఎలా చేరిందనుకోవాలి? వీటన్నిటిపైనా లోతైన సమీక్ష జరగాలి. ఏళ్ల తరబడి అనుసరించే మూస విధానాలు కూడా లొసుగులకు తావిస్తాయి. ఆ విషయంలోనూ జాగ్రత్తలు అవసరం. పాక్‌పై తక్షణ చర్య అవసరమని కొందరంటున్నారు. కానీ ఆచితూచి అడుగేయడం శ్రేయస్కరం. ఇప్పటికే పాక్‌పై దౌత్యపరమైన దాడిని మన దేశం ప్రారంభించింది. దాన్ని పక డ్బందీగా కొనసాగించి, అంతర్జాతీయంగా పాక్‌ను ఏకాకి చేయడానికి గల అన్ని అవకాశాలనూ వినియోగించుకోవాలి. ఇప్పుడు సైతం జైషే చీఫ్ మసూద్ అజర్‌ను ఉగ్రవాదిగా గుర్తించ నిరా కరిస్తున్న చైనా నైతికతను కూడా ఎండగట్టాలి. -
పాకిస్తాన్ మూల్యం చెల్లించక తప్పదు
జమ్మూ/శ్రీనగర్: ఐదుగురు జవాన్లు, ఒక పౌరుడి మృతికి కారణమైన సంజువాన్ ఉగ్రదాడికి పాకిస్తాన్ తగిన మూల్యం చెల్లించక తప్పదని రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఆర్మీ శిబిరంపై దాడికి పాల్పడ్డ వారంతా పాకిస్తానీయులేనని, ఆ ఆధారాల్ని పాకిస్తాన్‌కు అందచేస్తామని ఆమె తెలిపారు. సంజువాన్ ఆర్మీ శిబిరంపై దాడి అనంతరం అక్కడి పరిస్థితిని సమీక్షించేందుకు సోమవా రం సీతారామన్ జమ్మూలో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ దుస్సాహసానికి పాకిస్తాన్ తగిన మూల్యం చెల్లిస్తుంది. మన సైనికుల మరణాల్ని వృథాగా పోనివ్వం. ఆర్మీకి ప్రభు త్వం అండగా ఉంటుంది’ అని చెప్పారు. సంజువాన్ ఉగ్రదాడి వివరాలు వెల్లడిస్తూ.. ‘మొత్తం ముగ్గురు ఉగ్రవాదులు హతమవడంతో సోమవారం ఉదయం ఆపరేషన్ ముగిసింది. అయితే తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ దాడిలో ఒక పౌరుడు సహా ఆరుగురు మరణించారు. నలుగురు ఉగ్రవాదు లు పాల్గొన్నట్లు వార్తలొచ్చాయి. అయితే నాలుగో ఉగ్రవాది ఆర్మీ శిబిరంలోకి ప్రవేశించలేదు. లోపలికి వెళ్లేందుకు మిగతా వారికి సాయపడివుండవచ్చు’ అని చెప్పారు. దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులు పాకిస్తానీయులేనని.. జైషే మహమ్మద్ నేతృత్వంలో వారు పనిచేస్తున్నారని సీతారామన్ తెలిపారు. ఉగ్రవాదులకు స్థానికంగా సాయం అందినట్లు ఆధారాలున్నాయని చెప్పారు. ‘ఈ ఉగ్రదాడికి సంబంధించి జైషే ఉగ్రసంస్థ ప్రమేయంపై అన్ని ఆధారాల్ని సేకరించాం. ఎన్ఐఏ వాటిని పరిశీలిస్తోంది. తప్పకుండా వాటిని పాకిస్తాన్‌కు అందచేస్తాం. ఎన్నిసార్లు ఆధారాలు సమర్పించినా.. పాకిస్తాన్ మాత్రం ఎలాంటి చర్య తీసుకోవడం లేదు. అయినా ఆధారాలు అందచేయడం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది’ అని పేర్కొన్నారు. అంతకుముందు ఏరియల్ సర్వే ద్వారా సంజువాన్ ఆర్మీ శిబిరాన్ని ఆమె పరిశీలించారు. ఉగ్రదాడిలో గాయపడి జమ్మూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. చర్చలే పరిష్కారం: మెహబూబా ముఫ్తీ రాష్ట్రంలో కొనసాగుతున్న హింసకు ముగింపు పలికేందుకు భారత్, పాకిస్తాన్ తాజాగా చర్చలు జరపాలని జమ్మూ కశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ కోరారు. పాక్‌తో చర్చలు జరపాలని ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలు కోరితే వారిని దేశ వ్యతిరేకులుగా ముద్ర వేస్తున్నారని, ఈ సమస్య పరిష్కారానికి చర్చలే పరిష్కారమన్నారు. ఇంట్లో నక్కిన ఉగ్రవాదులు సంజువాన్ ఉగ్రదాడి ఘటన మరువక ముందే.. శ్రీనగర్‌లో సీఆర్పీఎఫ్ శిబిరంపై ఉగ్రవాదులు దాడికి యత్నించారు. సోమవారం తెల్లవారుజామున శిబిరం వైపు చొచ్చుకొచ్చిన ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు తిప్పికొట్టాయి. అనంతరం సమీపంలోని ఇంట్లో నక్కిన ఉగ్రవాదుల్ని మట్టుబెట్టేందుకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక సీఆర్పీఎఫ్ జవాను మృతిచెందారు. సీఆర్పీఎఫ్ 49వ బెటాలియన్‌కు చెందిన ఆ జవాను తీవ్రంగా గాయపడగా.. కొద్దిసేపటి అనంతరం మరణించాడు. ఇంట్లో దాగిన ఉగ్రవాదుల్ని మట్టుబెట్టడం లేదా సజీవంగా పట్టుకునేందుకు భద్రతా బలగాలు ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. మరోవైపు ఎన్కౌంటర్ జరుగుతున్న ప్రాంతానికి సమీపంలో భద్రతా సిబ్బందిపైకి కొందరు స్థానిక యువకులు రాళ్లు రువ్వడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే అల్లరిమూకలను ఆర్మీ చెదరగొట్టింది. ‘తెల్లవారుజామున 4.30 గంటలకు ఇద్దరు అనుమానిత వ్యక్తులు బ్యాగులు ధరించి ఆయుధాలతో రావడం కాపలాగా ఉన్న సెంట్రీ గమనించాడు. వెంటనే వారిపైకి కాల్పులు జరిపాడు’ అని సీఆర్పీఎఫ్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. -
భారత్‌కు పాకిస్తాన్ వార్నింగ్
శ్రీనగర్, జమ్మూకశ్మీర్ : మరోసారి సర్జికల్ స్ట్రైక్స్‌కు పాల్పడొద్దని, అలా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని భారత్‌కు పాకిస్తాన్ వార్నింగ్ ఇచ్చింది. శనివారం కశ్మీర్లో గల సుంజువాన్ ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన భారతీయ ఆర్మీ.. పాకిస్తాన్‌కు చెందిన జైషే ఈ మొహమ్మద్(జేఈఎమ్) అనే ఉగ్ర సంస్థకు ఈ దాడితో సంబంధం ఉన్నట్లు పేర్కొంది. ఈ ప్రకటనపై ఆందోళన చెందుతున్న పాకిస్తాన్ మరోసారి భారత్ నిర్దేశిత దాడులకు(సర్జికల్ స్ట్రైక్స్) దిగుతుందేమోనని భయపడుతోంది. జేఈఎమ్‌కు సుంజువాన్ క్యాంపుపై దాడికి సంబంధం ఉందన్న భారత మిలటరీ ప్రకటనపై పాకిస్థాన్ విదేశాంగ శాఖ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. భారత అధికారులు కావాలనే జేఈఎమ్‌ను ఈ దాడిలోకి లాగుతున్నారని ఆరోపించింది. సరైన విచారణ జరపకుండా బాధ్యతారాహిత్యంతో ప్రకటనలు చేయడం సరికాదని పేర్కొంది. పాకిస్తాన్ భూభాగంలోకి అక్రమంగా చొచ్చుకొస్తున్న భారత్‌ను అడ్డుకోవాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరింది. కాగా, సుంజువాన్ ఆర్మీ క్యాంపుపై జరిగిన ముష్కరుల దాడిలో ఐదుగురు జవాన్లు అమరవీరులు అయ్యారు. మరో జవాను తండ్రి కూడా ప్రాణాలు విడిచారు. పది మంది జవానుల కుటుంబీకులు కూడా ఈ దాడిలో గాయపడ్డారు. సోమవారం శ్రీనగర్‌లోని ఆర్మీ క్యాంపుపై ఉగ్రదాడికి జరిగిన యత్నాన్ని భద్రతా దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. -
అగ్రనాయకుల హత్యకు కుట్ర
శ్రీనగర్ : భద్రతా దళాల చేతిలో హతమైన జైషే ఈ మొహమ్మద్(జేఈఎమ్) టాప్ కమాండర్ నూర్ మహమ్మద్ తాంత్రే అలియాస్ చోటా నూరా(47) భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో చేరేందుకు ప్రయత్నించినట్లు ఓ జాతీయ మీడియా సంస్ధ పేర్కొంది. బీజేపీలో చేరడం ద్వారా పార్టీకి చెందిన సీనియర్ నాయకులను హతమార్చాలని చోటా నూరా భావించినట్లు తెలిపింది. 2003లో చోటా నూరా ఈ ప్రయత్నాలు చేశాడని వెల్లడించింది. ఇందుకోసం న్యూఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని కూడా నూరా సందర్శించినట్లు వివరించింది. కార్యకర్తగా నమోదు చేసుకునేందుకు దరఖాస్తు పత్రాన్ని నూరా తెచ్చుకున్నాడని తెలిపింది. అయితే, ఈ ప్లాన్ అమలు కాకముందే పోలీసుల నూరాను అరెస్టు చేశారని చెప్పింది. భారీగా ఆయుధాలు, ఆయుధ సామగ్రితో చోటా నూరా, అతని అనుచరులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారని పేర్కొంది. కేవలం మూడు అడుగులు మాత్రమే ఎత్తుండే నూరా జైషే కమాండర్‌గా కశ్మీర్‌లోని భద్రతా దళాలకు నిద్ర లేకుండా చేశాడు. నూర్ స్వస్ధలం కశ్మీర్ లోయలోని త్రాల్ ప్రాంతం. శ్రీనగర్ అంతర్జాతీయ విమానశ్రయం వద్ద గల బీఎస్ఎఫ్ క్యాంప్‌పై దాడి, ఉడి ఉగ్రదాడి వెనుక నూర్ హస్తం ఉన్నట్లు రిపోర్టులు ఉన్నాయి. గత ఇరవై ఏళ్లలో భద్రతా బలగాలపై జరిగిన అత్యంత శక్తిమంతమైన దాడిగా ఉడి ఉగ్రదాడి గుర్తింపు పొందింది. 2015లో జైషేలో చేరిన నూర్‌కు ఆ తర్వాత కశ్మీర్ పరిసరాల్లో జరిగిన ప్రతి ఉగ్ర చర్యకు సంబంధాలు ఉన్నాయి. -
భద్రతా దళాలకు నిద్ర లేకుండా చేశాడు
శ్రీనగర్ : జైషే ఈ మొహమ్మద్(జేఈఎమ్) ఉగ్రవాద సంస్థలో టాప్ కమాండర్‌గా ఉన్న నూర్ మహమ్మద్ తాంత్రే అలియాస్ చోటా నూరా(47)ను మంగళవారం తెల్లవారుజామున భద్రతా దళాలు మట్టుబెట్టాయి. కేవలం మూడు అడుగులు మాత్రమే ఎత్తుండే నూర్ జైషే కమాండర్‌గా కశ్మీర్‌లోని భద్రతా దళాలకు నిద్ర లేకుండా చేశాడు. నూర్ స్వస్ధలం కశ్మీర్ లోయలోని త్రాల్ ప్రాంతం. శ్రీనగర్ అంతర్జాతీయ విమానశ్రయం వద్ద గల బీఎస్ఎఫ్ క్యాంప్‌పై దాడి, ఉడి ఉగ్రదాడి వెనుక నూర్ హస్తం ఉన్నట్లు రిపోర్టులు ఉన్నాయి. గత ఇరవై ఏళ్లలో భద్రతా బలగాలపై జరిగిన అత్యంత శక్తిమంతమైన దాడిగా ఉడి ఉగ్రదాడి గుర్తింపు పొందింది. 2015లో జైషేలో చేరిన నూర్‌కు ఆ తర్వాత కశ్మీర్ పరిసరాల్లో జరిగిన ప్రతి ఉగ్ర చర్యకు సంబంధాలు ఉన్నాయి. మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో నూర్ హతమార్చడంపై భద్రతా బలగాలు ఆనందం వ్యక్తం చేశాయి. కశ్మీర్లో లోయలో ఆర్మీకి పెద్ద తలనొప్పి వదిలిందని పేరు తెలపడానికి ఇష్టపడిన ఓ సీనియర్ అధికారి చెప్పారు. శ్రీనగర్ - జమ్మూ హైవేపై వెళ్తున్న భద్రతా బలగాల కాన్వాయ్‌పై ఉగ్రదాడికి నూర్ వచ్చిన సమయంలో హతమార్చినట్లు జమ్మూ కశ్మీర్ డీజీపీ తెలిపారు. ఇంటిలిజెన్స్ సమాచారం ద్వారానే నూర్‌ను హతమార్చగలిగామని వెల్లడించారు. నూర్‌ను 2003లో ఉగ్రవాద నిరోధిత చట్టం(పీఓటీఏ) కింద అరెస్టు చేసినట్లు చెప్పారు. కోర్టు అతనికి జీవిత ఖైదును విధించిందని వివరించారు. అయితే, 2015లో పేరోల్‌పై బయటకు వచ్చిన అతను జైషేతో చేతులు కలిపాడని వెల్లడించారు. గత మూడు నెలల్లో 15 మంది జైషే ముఖ్యనేతలను మట్టుబెట్టామని చెప్పారు. డిసెంబర్, జనవరి నెలల్లో జైషే సంస్థ ఎక్కువగా దాడులకు పాల్పడుతూ వస్తోందని తెలిపారు. కీలకమైన ఈ రెండు నెలల్లో భద్రతను కట్టుదిట్టం చేశామని వివరించారు. -
పాక్ హైకమిషనర్‌కు భారత్ సమన్లు
సాక్షి, న్యూఢిల్లీ : సరిహద్దు ఉగ్రవాదం విషయంలో దాయాది పాకిస్తాన్‌పై భారత్ చాలా సీరియస్‌గా ఉంది. గత ఆగస్ట్ 26న జమ్ముకశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడి విషయంపై పాకిస్తాన్‌కు భారత విదేశాంగమంత్రిత్వశాఖ సమన్లు జారీ చేసింది. జైషే మహమ్మద్ ఉగ్రవాదులు చేసిన దాడిలో 8మంది భారత భద్రతా సిబ్బంది మృత్యువాతపడ్డ విషయం తెలిసిందే. పాక్ హైకమిషనర్ హైదర్ షా మంగళవారం నోటీసులు అందుకున్నారు. ఈ విషయాన్ని విదేశాంగశాఖ ప్రతినిధి బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. పాక్‌కు చెందిన వ్యక్తులే ఉగ్రసంస్థ జైషే మహమ్మద్‌లో పనిచేస్తున్నారని, ఇందువల్ల ముఖ్యంగా భారత్ సరిహద్దుల్లో ఉగ్రదాడులు జరుగుతున్నాయని సమన్లలో విదేశాంగశాఖ పేర్కొంది. అదే విధంగా గత ఆగస్ట్‌లో 16, 17 తేదీలలో రాత్రివేళ జమ్ములోకి ప్రవేశించి దాడులకు పథకం రూపొందించిన కొందరు జేషే ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు హైదర్ షాకు వివరించింది. పాక్ భూభాగంలో ఎలాంటి ఉగ్రసంస్థలకు గానీ, ఉగ్రవాదులకుగానీ చోటివ్వరాదని హెచ్చరించింది. ఉగ్రశక్తులకు చోటు కల్పించినందువల్లే సరిహద్దులోని జమ్ముకశ్మీర్‌లోకి పాక్ ఉగ్రవాదులు చొరబడి దాడులకు పాల్పడుతున్నారని ఇకనైనా చర్యలు తీసుకోవాలని భారత్ గట్టిగా సూచించింది. పుల్వామాలోని జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌పై జైషే ఉగ్రవాదులు చేసిన దాడిలో ఓ సీఆర్పీఎఫ్ జవాను సహా 8 మంది సిబ్బంది చనిపోయారని.. ఈ ఉగ్రదాడిపై సత్వరం విచారణ చేపట్టాలని కోరింది. ఇటీవల జరిగిన బ్రిక్స్ సదస్సులో తాలిబాన్, ఐసిస్, అల్‌కాయిదాతోపాటుగా హక్కానీ నెట్వర్క్, లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రసంస్థలపై కలిసి పోరాడాలని బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా దేశాలు జియామెన్ డిక్లరేషన్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన పాక్.. తాము ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం లేదని బుసలుకొట్టింది. అయితే పుల్వామాలో జరిగిన ఉగ్రదాడికి ఏం సమాధానం చెబుతారంటూ పాక్ హైకమిషనర్‌ను భారత్ ప్రశ్నించింది. పాక్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. -
ఐక్యరాజ్యసమితిపై ఇండియా ఫైర్
జైషే మహ్మద్ అధినేత, అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్ అజహర్‌పై నిషేధం విధించడంలో ఐక్యరాజ్యసమితి ఇంకా మీనమేషాలు లెక్కిస్తోందని, లేనిపోని రాజకీయాలు చేస్తోందని భారతదేశం తీవ్రస్థాయిలో మండిపడింది. జైషే మహ్మద్ సంస్థను ఐక్యరాజ్యసమితి భద్రతామండలి బ్లాక్‌లిస్టులో పెట్టినా, దాని అధినేత మసూద్ అజహర్ (48)ని మాత్రం ఇంకా నిషేధించలేదు. అజహర్‌ను నిషేధించాలంటూ భారతదేశం చేసిన ప్రతిపాదనను భద్రదతామండలిలో శాశ్వత సభ్యత్వం ఉన్న చైనా రెండుసార్లు అడ్డుకుంది. తమ దేశంలో ఈ ఏడాదే రెండుసార్లు జైషే మహ్మద్ సంస్థ దారుణమైన ఉగ్రదాడులకు పాల్పడిందని భారత్ ఆరోపించింది. జనవరిలో పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపైన, తర్వాత సెప్టెంబర్‌లో ఉడీలోని సైనిక స్థావరంపైన ఉగ్రవాద దాడులు జరిగాయి. రెండు ఘటనల్లో కలిపి 26 మంది సైనిక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాద సంస్థల అధినేతలపై ఆంక్షలు విధించడంలో భద్రతామండలి ఘోరంగా విఫలం అవుతోందని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ మండిపడ్డారు. భారతదేశంలోని ఏదో ఒక ప్రాంతంలో దాదాపు ప్రతిరోజూ ఉగ్రవాదులు రెచ్చిపోతూనే ఉన్నారని.. అలాంటి సంస్థల అధినేతలుగా తమను తాము ప్రకటించుకున్నవాళ్లపై నిషేధం విధించడానికి భద్రతామండలి ఇప్పటికే 9 నెలల సమయం తీసుకుందని ఆయన అన్నారు. మసూద్ అజహర్‌పై నిషేధం విధించకుండా తొలిసారి ఏప్రిల్ నెలలో వీటో చేసిన చైనా.. తర్వాత సెప్టెంబర్ నెలలో దాన్ని మరో మూడు నెలలు పొడిగించింది. దాంతో భారత్ తీవ్రస్థాయిలో తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. -
ఢిల్లీపై ఉగ్రవాదుల గురి?
దేశ రాజధాని ఢిల్లీ నగరంపై ఉగ్రవాదులు గురిపెట్టారా? అక్కడ భారీ ఎత్తున పేలుళ్లకు కుట్రలు పన్నారా? బుధవారం ఉదయం జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందినవారిగా భావిస్తున్న దాదాపు 12 మంది ఉగ్రవాదులను ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్, ఇంటెలిజెన్స్ బ్యూరో సంయుక్తంగా చేసిన దాడుల్లో పట్టుకోవడంతో ఈ విషయం దాదాపు రుజువవుతోంది. ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం, యూపీలోని దేవ్‌బంద్ ప్రాంతాలకు చెందినవారిని పోలీసులు అరెస్టుచేశారు. అరెస్టయిన వారిలో 8 మంది ఢిల్లీ చుట్టుపక్కల వారు కాగా, మరో నలుగురు దేవ్‌బంద్‌కు చెందినవారు. వాళ్ల దగ్గర నుంచి బాంబులు తయారుచేయడానికి ఉపయోగపడే సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. ఉగ్రవాద వ్యతిరేక దళానికి చెందిన పోలీసులు ఇద్దరు యువకులను తూర్పు ఢిల్లీలోని గోకుల్‌పురి ప్రాంతంలో పట్టుకున్నప్పుడు వారి వద్ద ఐఈడీలు తయారుచేసే సామగ్రి దొరికింది. వారిని విచారించగా మిగిలినవాళ్ల విషయం కూడా తెలిసింది. వీళ్లంతా స్లీపర్ సెల్ సభ్యులని, దేశ రాజధాని సహా పలు నగరాల్లో బాంబు దాడులకు కుట్ర పన్నుతున్నారని ఓ అధికారి చెప్పారు. వీళ్లంతా జైషే మహ్మద్ నాయకుడు యూసుఫ్ అల్ హిందీతో టచ్‌లో ఉన్నారని, తమను తాము ఉగ్రవాద బృంద సభ్యులుగా చెప్పుకొంటున్నారని తెలిపారు. -
ఇదేంటి చైనా ఇలా చేశావు.. భారత్ ఆగ్రహం!
వాషింగ్టన్: పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడి సూత్రధారి, జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్‌ను నిషేధించాలంటూ ఐక్యరాజ్యసమితిలో ప్రతిపాదించిన తీర్మానాన్ని చైనా వీటో అధికారంతో తిరస్కరించడంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉగ్రవాది అయిన అజార్‌ను కాపాడేందుకు చైనా, పాకిస్థాన్ ప్రయత్నిస్తున్నాయని పరోక్షంగా ఆరోపించింది. సాంకేతిక కారణాలు చూపుతూ చైనా అసమగ్రంగా వ్యవహరించిందని పేర్కొంది. ఉగ్రవాదం అణచివేతపై ఇలాంటి సంకుచిత దృక్పథాన్ని కనబర్చడం ఏమాత్రం సరికాదని, ఉగ్రవాదాన్ని ఓడించేందుకు అంతర్జాతీయ సమాజం చూపాల్సిన సంకల్పాన్ని ఇది చూపడం లేదని తేల్చిచెప్పింది. ఐక్యరాజ్యసమితిలో చైనాతో సహా ఐదు అగ్రరాజ్యాలకు మాత్రమే వీటో అధికారం ఉంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌తో చర్చలు జరిపిన తర్వాతే భారత్‌కు వ్యతిరేకంగా చైనా ఈ దుందుడుకు చర్యకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. జనవరి 2న పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడి ఘటనకు సూత్రధారి అయిన మసూద్ అజార్ ప్రమాదకరమైన ఉగ్రవాది అని, అతన్ని నిషేధించకపోవడం వల్ల భారత్ ఇప్పటికీ ఉగ్రవాద ముప్పు ఎదుర్కొంటున్నదని కేంద్ర విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే చైనా మాత్రం అజార్ ఉగ్రవాది కాదని, అందుకే తాము వీటో ద్వారా ఈ తీర్మానాన్ని వ్యతిరేకించామని సమర్థించుకుంటోంది.