సాక్షి, న్యూఢిల్లీ/శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లో మరోమారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శనివారం కుల్గామ్ జిల్లాలోని హవూరా గ్రామంలో అల్లరిమూక రాళ్లదాడితో రెచ్చిపోగా.. వారిని అదుపుచేసే క్రమంలో భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఓ బాలికతోపాటు ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మరో పది మందికి గాయాలైనట్లు తెలుస్తోంది.
శనివారం ఉదయం కార్డన్ సెర్చ్ చేపట్టిన భద్రతా బలగాలను అడ్డుకునే క్రమంలో అల్లరిమూక రాళ్లదాడికి పాల్పడింది. దీంతో బలగాలు కాల్పులు ప్రారంభించాయి. మృతులను షకీర్ అహ్మద్(22), ఇర్షద్ మాజిద్(20), అంద్లీబ్(16)గా గుర్తించారు. ఇక ఘటన అనంతరం పుకార్లు చెలరేగకుండా ఉండేందుకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఖుల్గాం, అనంతనాగ్, సోఫియాన్, పుల్వామా జిల్లాల్లో బలగాలను భారీ ఎత్తున్న మోహరించి పరిస్థితిని అధికారులు సమీక్షిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment