stone pelters
-
‘ఆ పిల్లలే ఉగ్రవాదులుగా మారుతున్నారు’
శ్రీనగర్: కశ్మీర్ యువత ఉగ్రవాదులుగా మారకుండా వారి తల్లిదండ్రులే బాధ్యత తీసుకోవాలని భారత ఆర్మీ అధికారులు సూచించారు. కశ్మీర్ లోయలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో జనరల్ దిలాన్ శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. పిల్లల్ని ఉద్రవాదం వైపు అడుగులు వేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారు. సమావేశంలో దిలాన్ మాట్లాడుతూ.. ‘‘భద్రతా సిబ్బందిపై అవేశంతో ఇక్కడి యువత ఉగ్రవాదుల మాటలు విని నేడు రూ. 500కు రాళ్లు విసురుతున్నారు. కానీ రేపు వారే తిరిగి ఉద్రవాదులుగా మారుతున్నారు. ఈరోజు కశ్మీర్లో ఉన్న 80శాతం ఉగ్రవాదులు ఒకప్పుడు డబ్బులకు ఆశపడి రాళ్లు రువ్వినవారే. వారిలో చాలామంది భద్రతాదళాల కాల్పుల్లో మరణించారు. తల్లిదండ్రుల పిల్లల రక్షణ బాధ్యత, పెంపకం కూడా చూసుకోవాలి. ఇక్కడి యువతను తప్పుదోవ పట్టించే విధంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రముఠా కుట్రలు చేస్తోంది’ అని అన్నారు. కాగా పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులు అమర్నాథ్ యాత్ర లక్ష్యంగా దాడి చేసేందుకు ఆ దేశ ఆర్మీ సహాయంతో కుట్రలు పన్నుతున్నారని నిఘా వర్గాలు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో లోయలో పరిస్థితిని ఆర్మీ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. భారీ ఎత్తున బలగాలను తరలించి.. కశ్మీర్ లోయను పూర్తిగా అదుపులోకి తీసుకున్నారు. అలాగే రాజకీయ నాయకుల నుంచి కూడా పూర్తి సహకారం కోసం కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ అక్కడి నేతలతో భేటీ అయ్యారు. పరిస్థితిని వారికి వివరించి.. బలగాలకు సహరించాలని ఆయన కోరారు. -
కశ్మీర్లో హైటెన్షన్
సాక్షి, న్యూఢిల్లీ/శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో మరోమారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శనివారం కుల్గామ్ జిల్లాలోని హవూరా గ్రామంలో అల్లరిమూక రాళ్లదాడితో రెచ్చిపోగా.. వారిని అదుపుచేసే క్రమంలో భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఓ బాలికతోపాటు ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మరో పది మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. శనివారం ఉదయం కార్డన్ సెర్చ్ చేపట్టిన భద్రతా బలగాలను అడ్డుకునే క్రమంలో అల్లరిమూక రాళ్లదాడికి పాల్పడింది. దీంతో బలగాలు కాల్పులు ప్రారంభించాయి. మృతులను షకీర్ అహ్మద్(22), ఇర్షద్ మాజిద్(20), అంద్లీబ్(16)గా గుర్తించారు. ఇక ఘటన అనంతరం పుకార్లు చెలరేగకుండా ఉండేందుకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఖుల్గాం, అనంతనాగ్, సోఫియాన్, పుల్వామా జిల్లాల్లో బలగాలను భారీ ఎత్తున్న మోహరించి పరిస్థితిని అధికారులు సమీక్షిస్తున్నారు. -
రాళ్లు విసిరేవాళ్లని కాల్చిపారేయాలి..
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ రాజ్యసభ ఎంపీ డీపీ వాట్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కశ్మీర్లో రాళ్లు విసిరేవారిని కాల్చిచంపాలని వ్యాఖ్యానించారు. రాళ్ల దాడులకు పాల్పడిన వారిపై కేసుల ఉపసంహరించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై స్పందిస్తూ హర్యానాకు చెందిన రాజ్యసభ ఎంపీ వాట్స్ ఈ వ్యాఖ్యలు చేశారు.రాళ్ల దాడికి పాల్పడిన వారిపై కేసుల ఉపసంహరణకు సంబంధించిన వార్తలను తాను చదవానని..అయితే రాళ్లు విసిరే వారిని కాల్చి చంపాలన్నదే తన ఆలోచనని ఎంపీ వివరించారు. గతవారం జమ్మూ కశ్మీర్లో పర్యటించిన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కశ్మీర్ యువతపై నమోదైన రాళ్ల దాడి కేసులను ఉపసంహరిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఉగ్రవాదం, హింసకు దూరంగా సానుకూల వాతావరణంలో కశ్మీర్ యువత జీవించే పరిస్థితి నెలకొనాలని జమ్మూ కశ్మీర్ సీఎం మెహబూబ్ ముఫ్తీ కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తూ వ్యాఖ్యానించారు. దేశంలోని ఇతర ప్రాంతాల తరహాలోనే జమ్మూ కశ్మీర్ యువతకు సైతం అన్ని అవకాశాలు అందివచ్చే వాతావరణం నెలకొనాలని ఆమె ఆకాంక్షించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించేందుకు రాజ్‌నాథ్ సింగ్ కశ్మీర్లో రెండు రోజుల పాటు పర్యటించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా, సీఎం మెహబూబా ముఫ్తీ ఇతర సీనియర్ అధికారులతో ఆయన సంప్రదింపులు జరిపారు. -
తట్టుకోలేకపోతున్నా: గంభీర్
సాక్షి, న్యూఢిల్లీ: కశ్మీర్లో జరుగుతున్న పరిణామాలపై టీమిండియా క్రికెటర్ గౌతమ్ గంభీర్ మరోసారి తనదైన శైలిలో స్పందించారు. కశ్మీర్ సమస్యకు తన దగ్గర పరిష్కారం ఉందని, అది అమలు చేస్తే తప్పకుండా ఫలితం ఉంటుందని చెబుతున్నాడు. రాజకీయ నేతలను ఎలాంటి సెక్యూరిటీ లేకుండా కశ్మీర్లో వదిలేయాలని, అప్పుడే వారికి సైనికుల సమస్యలు ఏంటో తెలుస్తాయని అంటున్నాడు. ‘తట్టుకోలేకపోతున్నా... రాళ్ల దాడి చేసేవారితో ఇంకా కూర్చుని చర్చలు జరిపే అవకాశముందని భారత్ భావిస్తోందా?. ఒక్కసారి వాస్తవ పరిస్థితిని గ్రహించాలి. రాజకీయ మద్ధతు లభిస్తే మన సైనిక దళాలు, సీఆర్పీఎఫ్ సత్తా ఏంటో, ఫలితాలు ఎలా ఉంటాయో చూడొచ్చు’ అంటూ ఓ ట్వీట్ చేశాడు. ఇక తన దగ్గర కశ్మీర్ సమస్యకు పరిష్కారం ఉందంటూ చెబుతూ... ‘సమస్యాత్మక ప్రాంతాల్లోకి రాజకీయ నాయకులను వారి కుటుంబాలతో సహా ఎలాంటి రక్షణ లేకుండా వదిలేయాలి. అలా నివసించిన వారినే 2019 ఎన్నికల్లో పోటీకి అనుమతించాలి. అప్పుడే వారికి కశ్మీర్ అంటే ఏంటో?.. సైనికుల బాధలు ఏంటో తెలుస్తాయి’ అంటూ మరో ట్వీట్ చేశాడు. కాగా, ఇటీవల కశ్మీర్లో సీఆర్పీఎఫ్ వాహనంపై స్థానికులు రాళ్ల దాడి చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోను ప్రముఖ జర్నలిస్ట్ ఆదిత్య రాజ్ కౌల్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘నౌహట్టాలో సీఆర్పీఎఫ్ వాహనాన్ని లక్ష్యంగా ఎంచుకొని రాళ్ల దాడి చేశారు. ఒకవేళ ఆ వాహనం తలుపులు తెరిస్తే పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. కశ్మీర్‌లోని ఏ మీడియా ఈ ఘటనను బయటకు చూపించదు’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. Am devastated. Wonder if India still thinks there is room for talks with stone-pelters! Come on, let’s get real. Show me the political will and my armed forces, my @crpfindia will show you the results. https://t.co/PdtCNVbOqr — Gautam Gambhir (@GautamGambhir) 2 June 2018 I have a solution:Make it mandatory for politicians to spend a week in troubled parts of Kashmir along with their families&without security. Only then they b allowed to contest 2019 elections. No other way to make them understand d plight of armed forces & a well-meaning Kashmiri https://t.co/PdtCNVbOqr — Gautam Gambhir (@GautamGambhir) 2 June 2018 -
చిన్నారుల కోసం ప్రాణాలు సైతం లెక్క చేయక...
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లో అల్లరి మూకలు మానవత్వాన్ని మరిచి ఎంతగా రెచ్చిపోతున్నాయో బుధవారం చిన్నారుల స్కూలు వ్యాన్ మీద జరిపిన రాళ్లదాడి చూస్తేనే అర్థం అవుతుంది. ఈ దాడిలో ఇద్దరు చిన్నారులు గాయపడగా అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. అయితే అల్లరిమూకలు దాడి చేసిన సమయంలో ఎటువంటి ప్రాణహాని జరగకూడదనే ఉద్దేశంతో బస్సు డ్రైవరు తన ప్రాణాలొడ్డి తీవ్రంగా శ్రమించాడు. ఈ సంఘటనకు ప్రత్యక్ష సాక్షి బస్సు డ్రైవరు. ఈ సంఘటన గురించి అతడు చెబుతూ.. ‘అల్లరిమూక బస్సుపై రాళ్ల దాడి ప్రారంభించగానే నేను బస్సు వేగాన్ని పెంచాను. ఒక్క చిన్నారికి కూడా హాని కలగకూడదని నా శాయశక్తుల శ్రమించాను. కానీ ఒక దురదృష్టవశాత్తు ఒక చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి’ అని తెలిపాడు. బుధవారం షోపియాన్ జిల్లా, కానిపొర గ్రామంలో రెయిన్బో ఇంటర్నేషనల్ స్కూల్ బస్సుపై అల్లరి మూకలు దాడి చేసిన సంగతి విధితమే. ఈ దాడిలో ఇద్దరు విద్యార్థులకు గాయలయ్యాయి. గాయపడిన ఇద్దరిలో రెండో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి పరిస్థితి విషమంగా ఉందని, మరో విద్యార్థికి పెద్దగా ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పారు. ఈ ఘటన గురించి ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ స్పందించారు. ‘పసిపిల్లలపై ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని, బాధితులకు న్యాయం చేస్తామని’ హామీ ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత ఒమర్ అబ్దుల్లా ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ, పిరికిపంద చర్యగా వర్ణించారు. -
జమ్మూకశ్మీర్ లో స్కూల్ బస్సుపై రాళ్ల దాడి..
శ్రీనగర్: జమ్మూ-కశ్మీరులో అల్లరి మూకలు రోజురోజూకి రెచ్చిపోతున్నారు. ఏదో ఒక నెపంతో దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. మానవత్వం లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. అభం శుభం తెలియని స్కూలు చిన్నారులు ప్రయాణిస్తున్న బస్సుపై బుధవారం ఉదయం అల్లరి మూకలు రాళ్లు రువ్వారు. షోపియాన్ జిల్లా, కానిపొర గ్రామంలో జరిగిన ఈ దాడిలో ఇద్దరు విద్యార్థులకు గాయలయ్యాయి. కాగా ఒక్కసారిగా రాళ్లదాడి జరగడంతో విద్యార్థులంతా దిక్కుతోచని స్థితిలో పరుగులు పెట్టారు. గాయపడిన విద్యార్థులను వెంటనే ఆసుపత్రికి తరలించి, చికిత్స చేయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన ఇద్దరిలో రెండో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి పరిస్థితి విషమంగా ఉందని, మరో విద్యార్థికి పెద్దగా ప్రమాదం ఏమి లేదని డాక్టర్లు చెప్పారు. ఈ ఘటనపై పోలీసు అధికారులు మాట్లాడుతూ..రెయిన్బో ఇంటర్నేషనల్ స్కూల్ బస్సుపై దాడి జరిగిన సమయంలో 50 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారని తెలిపారు. వీరంతా దాదాపు నాలుగేళ్ళ నుంచి తొమ్మిదేళ్ళ వయసువారేనని చెప్పారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా రాళ్ల దాడిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థి తండ్రి మాట్లాడుతూ తన కుమారుడిపై జరిగిన దాడి మానవత్వానికే వ్యతిరేకమని అన్నారు. ఎవరి బిడ్డకైనా ఇలా జరగవచ్చునన్నారు. మరోవైపు ఈ ఘటనను ముఖ్యమంత్రి మహబూబ ముఫ్తీ, ప్రతిపక్షనేత ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా ఖండిస్తూ, పిరికిపంద చర్యగా వర్ణించారు. పసిపిల్లలపై ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని, బాధితులకు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి మహబూబ ముఫ్తీ హామీ ఇచ్చారు. రాళ్ల దాడిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థి -
భీమవరంవైపు వెళుతున్న బస్సుపై దాడి
సాక్షి, ఏలూరు(పశ్చిమ గోదావరి) : గుర్తుతెలియని వ్యక్తులు రోడ్డుపై వెళుతున్న బస్సును ఆపి రాళ్లతో దాడికి పాల్పడ్డ ఘటన కలకం రేపింది. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలో చోటుచేసుకుంది. బీఎస్ఆర్ ట్రావెల్స్ కు చెందిన ఏసీ స్లీపర్ బస్సు భీమవరంవైపు వెళ్తుండగా కైకలూరు బైపాస్‌లో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బస్సుపై రాళ్లు విసిరారు. ఊహించని ఈ దాడితో భయభ్రాంతులైన ప్రయాణికులు ఒక్కసారిగా కేకలు వేయడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం డ్రైవర్ బస్సును దగ్గరలోని వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌కు తరలించాడు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా వారిని వేరే బస్సులో ఎక్కించి పంపించేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. -
ఆ అమ్మాయి, ఆ రాయి ఎందుకు విసిరిందీ?
శ్రీనగర్: అది ఏప్రిల్ 24వ తేదీ. మంగళవారం మధ్యాహ్నం. 21 ఏళ్ల ఫుట్‌బాల్ కోచ్ అఫ్షాన్ ఆసిక్ తాను శిక్షణ ఇచ్చే దాదాపు 15 మంది విద్యార్థినులను తీసుకొని కోఠి బాగ్ నుంచి టూరిస్ట్ రిసెప్షన్ సెంటర్లో ఉన్న ఫుట్‌బాల్ మైదానానికి బయల్దేరారు. వారు రోజూ వెళ్లేది అదే దారిలోనే. ఫుట్‌బాల్ మైదానికి చేరుకోవడానికి దాదాపు 15 నిమిషాలు పడుతుంది. ఇంతలో ఆ వీధిలో ఓ పక్క నుంచి అల్లరి మూక రాళ్లను రువ్వడం ప్రారంభించింది. అలా రాళ్లు రువ్వే అల్లరి మూకలను ఆసిక్ అనేక సార్లు చూశారు. వారెందుకు రాళ్లు రువ్వుతారో, వారి వెనక ఎవరున్నారో కూడా ఆమె ఎన్నడూ పట్టించుకోలేదు. విద్యార్థినులకు ఫుట్‌బాల్‌లో శిక్షణ ఇవ్వడమే ఆమె ఏకైక లక్ష్యం. ఆ రోజు కూడా శిక్షణ ఇవ్వడం కోసమే విద్యార్థినులను తీసుకొని వెళుతున్నారు. దారిలో అల్లరి మూక రాళ్లు రువ్వుతూ కనిపించింది. ప్రతాప్ పార్క్ నుంచి చుట్టూ తిరిగి వెళ్దామని చెప్పి తన టీమ్‌ను ఆసిక్ అటు మళ్లించింది. ఇంతలో కశ్మీర్ పోలీసులు అల్లరి మూకపైకి భాష్పవాయువు గోళాలను ప్రయోగించారు. వాటి నుంచి తప్పించుకుంటూ ఆసిక్ టీమ్ మైదానం వైపు వెళ్లింది. అక్కడ ఓ పోలీసు అధికారి ఆసిక్ టీమ్‌లోని అమ్మాయిలను పిలిచి అసభ్యంగా మాట్లాడారు. ఓ అమ్మాయి మీద చేయి కూడా చేసుకున్నారు. ఆసిక్ వెళ్లి తాము ఎవరమో, ఎక్కడికి వెళుతున్నామో నచ్చ చెప్పేందుకు ప్రయత్నించింది. ఆ పోలీసు అధికారి వినిపించుకోకుండా తక్షణం అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా బూతులు తిట్టారు. ‘మీరు యూనిఫారమ్‌లో ఉన్నారు కనుక మేము మీపై చేయిచేసుకోలేం. కాస్త ఇటువైపు వీధిలోకి రండీ, మీ సంగతి చెబుతాం’ అని ఆసిక్ ఓ పోలీసు అధికారిని హెచ్చరించి తన మానాన తన టీమ్‌ను తీసుకొని ముందుకెళ్లింది. అయినప్పటికీ పోలీసు అధికారి దూషిస్తుండడంతో అనుకోకుండానే క్షణికావేశంలో ఆసిక్ రోడ్డుపైనున్న ఓ రాయిని అందుకొని బలంగా పోలీసులపైకి రువ్వింది. స్కూల్ యూనిఫామ్‌లో ఉన్న ఆసిక్ శిక్షకులు కూడా రాళ్లందుకొని పోలీసులపైకి రువ్వారు. ఈ ఫొటోలు దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. మొదటిసారి విద్యార్థినులు రాళ్లు రువ్వుతూ కనిపించారన్న శీర్షికలతోని వాటికి విస్తత ప్రచారం లభించింది. ఆసిక్ రాయి విసురుతున్న ఫొటోను రాయ్‌టర్ సంస్థ ప్రముఖంగా ప్రచురించడంతో అంతర్జాతీయంగా ఆమె ఫొటోకు ప్రాచుర్యం లభించింది. ఈ నేపథ్యంలో ఆసిక్ నాటి సంఘటన గురించి మీడియాతో మాట్లాడుతూ ‘నాకు రాళ్లు రువ్వాలనే ఆలోచన అప్పటి వరకు ఎప్పుడూ రాలేదు. పైగా రాళ్లు రువ్వేవారిని తీవ్రంగా వ్యతిరేకించేదాన్ని. 21 ఏళ్లుగా రాళ్లు రువ్వుతున్నా రాని స్వాతంత్య్రం ఎప్పటికీ రాకపోగా, కశ్మీర్ పరిస్థితి మరింత దిగజారుతుందని నచ్చచెప్పేదాన్ని. పాకిస్తాన్ కూడా మా స్వాతంత్య్రాన్ని కోరుకోవడం లేదని, మా భూభాగాన్ని కోరుకుంటోందని మాకు తెలుసు. ఇంటి నుంచి బయటకు రావాలంటే కుటుంబ సభ్యుల ఫోన్లతో విసిగిపోతున్నాం. గంటగంటకు ఫోన్‌చేసి ఎక్కడున్నావు. ఏం చేస్తున్నావు, ఎప్పుడొస్తావు? లాంటి ప్రశ్నలతో విసిగిస్తుంటారు. అభద్రతా భావంతోని బతుకుతున్న ఇలాంటి సందర్భాల్లో మహిళలం, అందులో విద్యార్థినులమని చెప్పినా పట్టించుకోకుండా పోలీసులు అనుచితంగా వ్యవహరిస్తే మాకు కోపం రాదా? కానీ రాళ్లు రువ్వడం విద్యార్థులకు కూడా అలవాటు కాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రాళ్లురువ్వే అల్లరి మూకలను మళ్లీంచేందుకు రాష్ట్రంలో విస్తతంగా క్రీడలను ప్రోత్సహించాలని నరేంద్ర మోదీ సర్కార్‌ను కోరుతున్నాను’ అని చెప్పారు. డిగ్రీ చదివిన ఆసిక్ పాటియాలాలోని ప్రతిష్టాత్మక జాతీయ క్రీడా సంస్థలో ఫుట్‌బాల్ శిక్షణ పొందారు. -
రాళ్లు రువ్వడంలో జనసేన శిక్షణ!
నగరంలోని జనసేనకు చెందిన దాదాపు వెయ్యి మంది కార్యకర్తలు ఆదివారం బయల్దేరి కశ్మీర్‌కు వెళ్లేందుకు చేసిన ప్రయత్నాన్ని అధికారులు అడ్డుకున్నారు. వారంతా కశ్మీర్ అందాలను తిలకించేందుకు బయల్దేరిన పర్యాటకులని అనుకుంటే పొరపాటే. కశ్మీర్లో భారత సైనికుల మీదకు రాళ్లు రువ్వే అల్లరిమూకలకు రాళ్లతోనే బుద్ధి చెప్పాలనుకుంటున్న కార్యకర్తలు. వారికి గత కొంతకాలంగా రాళ్లు రువ్వడంలో జనసేన శిక్షణ ఇస్తోంది. గంగా నది కాలువ పక్కన రెండు గడ్డి బొమ్మలను ఏర్పాటు చేసి, వాటికి తగిలేలా రాళ్లు రువ్వడంలో యువతీ యువకులకు శిక్షణ ఇచ్చినట్లు జనసేన వ్యవస్థాపకుడు అరుణ్ పూరి చైతనాయ్ తెలిపారు. శిక్షణకు సంబంధించిన వీడియో కూడా మీడియాలో కనిపిస్తోంది. అందులో ‘పాకిస్తాన్ చావాలి’ అనే నినాదాలతో జనసేన కార్యకర్తలు గడ్డిబొమ్మలపైకి రాళ్లు రువ్వుతూ కనిపించారు. అయితే ఆ వీడియోను చూస్తే అందులో ఆవేశంతో, అక్రోశంతో రాళ్లు రువ్వుతున్న సుశిక్షితుల్లా ఎవరూ లేరు. కేవలం నిరసనగా రాళ్లు బొమ్మలకు తగిలేలా విసురుతున్నట్లు కనిపిస్తోంది. కశ్మీర్లో రాళ్లురువ్వే అల్లరి మూకలను ఎదుర్కొనేందుకు తమ కార్యకర్తలు వెయ్యిమంది సిద్ధమయ్యారని, అందుకు అనుమతించాలని అటు ప్రధాన మంత్రి నరేంద్రమోదీతోపాటు స్థానిక అధికారులను కూడా కోరామని, ఆదివారం సాయంత్రానికి కూడా వారినుంచి అనుమతి రాకపోవడంతో స్థానిక పోలీసులు తమను అడ్డుకున్నారని అరుణ్ పూరి తెలిపారు. తమకు అనుమతి రాకపోయినా సరే, వ్యక్తిగత స్థాయిలోనైనా సరే కశ్మీర్ వెళ్తామని, తమవెంట ట్రక్కుల్లో రాళ్లు కూడా వస్తాయని ఆయన చెప్పారు. -
రాళ్లు విసిరేందుకు 300 వాట్సాప్ గ్రూపులు
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో చోటు చేసుకుంటున్న అల్లర్లు ఉద్దేశ పూర్వకంగా చేస్తున్నవేనని మరోసారి స్పష్టమైంది. పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చి శాంతిభద్రతలను నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్న బలగాలపైకి రాళ్లు విసురుతున్న ఆందోళనకారులు ఎప్పటికప్పుడు ముందుగా అనుకోనే దాడులకు దిగుతున్నట్లు తాజాగా తెలిసింది. దాదాపు 300 వాట్సాప్ గ్రూపుల ద్వారా తమను తాము నియంత్రించుకుంటూ ఆందోళన కారులు బలగాలపై రాళ్లదాడికి దిగుతున్నట్లు సెక్యూరిటీ ఫోర్సెస్ నుంచి సమాచారం అందుతోంది. ఇందులో 90శాతం వరకు వాట్సాప్ గ్రూపులు ఇప్పటికే మూసివేశారని కూడా సమాచారం. ప్రతి ఒక వాట్సాప్ గ్రూపులో 250 మంది ఉన్నట్లు కూడా తెలిసింది. బలగాలు అడుగు వేస్తే వెంటనే ఆ సమాచారాన్ని చేరవేసేలా వాట్సాప్ గ్రూపులను కొనసాగిస్తున్నారు. ‘వాట్సాప్ గ్రూపుల్లో ఎవరున్నారో, వాటిని నడిపేదెవరో మా దగ్గర సమాచారం ఉంది. అందులో ఇప్పటికే చాలామందిని పోలీస్ స్టేషన్‌కు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తున్నాం. దీనికి మంచి స్పందన కూడా వస్తోంది’ అని చెప్పారు. సోమవారం జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యి ప్రస్తుతం కశ్మీర్ పరిస్థితులపై చర్చించనున్నారు.