
అమరవీరుల స్థూపం వద్ద జేసీ, పోలీసు అధికారులు
సాక్షి, నెల్లూరు : దేశ, సమాజ రక్షణలో తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన అమరవీరుల త్యాగాలు మరువలేనివని జాయింట్ కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ అన్నారు. నెల్లూరులోని జిల్లా పోలీసు కవాతు మైదానంలో సోమవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ దేశ సరిహద్దుల్లో ఉన్న జవాన్లు యుద్ధం వచ్చినప్పుడే పోరాడుతారని, పోలీసులు సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు నిత్యం కృషి చేస్తుంటారని అన్నారు. ఉగ్రవాదం, తీవ్రవాదం, మతతత్వం, ఫ్యాక్షనిజం వంటి విచ్ఛిన్నకర శక్తులు, అసాంఘిక శక్తులతో పోరాడే క్రమంలో ఎందరో తమ ప్రాణాలను అరి్పస్తున్నారన్నారు. వారు భౌతికంగా మృతిచెందినా అందరి హృదయాల్లో చిరస్మరణీయులుగా నిలుస్తారన్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది విధి నిర్వహణలో 292 మంది మృతిచెందగా జిల్లాలో 19 మంది అమరులయ్యారని తెలిపారు.
నేటి మన నిశి్చంత జీవనం వారి అవిశ్రాంత త్యాగఫలమన్నారు. వారి ఆశయ సాధనకు అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఏఎస్పీ క్రైమ్స్ పి.మనోహర్‌రావు మాట్లాడుతూ అవినీతి, అక్రమాలకు దూరంగా ఉంటూ ప్రజలకు మెరుగైన శాంతిభద్రతలను అందించడమే అమరవీరులకిచ్చే నిజమైన నివాళి అని అన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలను అరి్పంచిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి ఒక్క పోలీసు విధులు నిర్వహించాలన్నారు. అనంతరం అమరవీరుల వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, పెయింటింగ్, కార్టూన్ పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
ఘన నివాళి
పోలీసు కవాతు మైదానంలోని అమరవీరుల స్థూపం వద్ద జాయింట్ కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్, ట్రైనీ కలెక్టర్ కల్పనకుమారి, ఏఎస్పీ క్రైమ్స్ పి.మోహన్‌రావు, మాజీ డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, వైఎస్‌ఆర్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పి.రూప్‌కుమార్‌యాదవ్, డీఎస్పీలు ఎన్.కోటారెడ్డి, బి.లక్ష్మీనారాయణ, జె.శ్రీనివాసులురెడ్డి, కె.వి.రాఘవరెడ్డి, బి.భవానీహర్ష, మల్లికార్జునరావు, వై.రవీంద్రరెడ్డి, నగర ఇన్‌స్పెక్టర్లు ఎన్.మధుబాబు, కె.వేమారెడ్డి, కె.రాములునాయక్, మిద్దె నాగేశ్వరమ్మ, టి.వి.సుబ్బారావు, వైవీ సోమయ్య, పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు మద్దిపాటి ప్రసాదరావు, ఆర్‌ఐలు చంద్రమోహన్, మౌలాలుద్దీన్, రమే‹Ùకృష్ణన్, ఎస్‌ఐలు, సిబ్బంది పుష్పగుచ్చాలుంచి నివాళులరి్పంచారు. అనంతరం అమరవీరుల స్మృత్యర్థం పోలీసు సిబ్బంది స్మృతి పరేడ్ నిర్వహించారు. జోరువానలోనూ అక్కడ నుంచి నగరంలో ర్యాలీ నిర్వహించారు.
వెంకటగిరిరూరల్: శాంతిభద్రల పరిరక్షణ కోసం ప్రాణాలను సైతం తృణప్రాయంగా విడిచిన పోలీసు అమరవీరుల త్యాగం వెలకట్టలేనిదని 9వ బెటాలియన్ కమాండెంట్ ఎల్‌ఎస్ పాత్రుడు అన్నారు. పోలీసు అమరవీరుల దినం సందర్భంగా వెంకటగిరి మండలంలోని వల్లివేడు సమీపంలో ఉన్న 9వ బెటాలియన్‌లో సోమవారం బెటాలియన్ సిబ్బంది అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులరి్పంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొసైటీలో పోలీసుల పాత్ర చాలా కీలకమైందని అన్నారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ 9వ బెటాలియన్‌లో ప్రతి ఏటా స్మరించుకోవడం జరుగుతుందన్నారు. అనంతరం అమరవీరుల కుటుంబసభ్యులకు స్మారక జ్ఞాపికలను అందజేశారు. గత వారం రోజులుగా నిర్వహించిన వారోత్సవాల్లో విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో విజేతలైన వారికి బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ మోహన్‌ప్రసాద్, అసిస్టెంట్ కమాండెంట్ శ్రీనివాసులు, శివరామప్రసాద్, బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment