భార్యభర్తల విభేదాల ముందు ఎంతటివారైనా ఒక్కటే! | Professor Guruprasad suicide | Sakshi
Sakshi News home page

భార్యభర్తల విభేదాల ముందు ఎంతటివారైనా ఒక్కటే!

Published Sun, Oct 5 2014 1:47 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

గురుప్రసాద్ - Sakshi

గురుప్రసాద్

హైదరాబాద్: భార్యాభర్తల మధ్య విభేదాలు, కుటుంబ కలహాలు వంటివి ఎంతటివారినైనా కుదిపేస్తాయి. బలి తీసుకుంటాయి. వాటి  ముందు ప్రొఫెసరైనా, సామాన్యుడైనా ఒక్కటే. సికింద్రాబాద్లో గురుప్రసాద్ అనే ప్రొఫెసర్ ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం ప్రొఫెసర్ గురుప్రసాద్, సుహాసిని భార్యాభర్తలు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నాయి. వారు విడిపోయారు. వారి విడాకుల కేసు కోర్టులో ఉంది. 

పిల్లలు తల్లి వద్దే ఉంటారని, వారానికి ఒకసారి తండ్రి పిల్లలతో గడపవచ్చని కోర్టు తెలిపింది. ఆ ప్రకారం  శనివారం ఉదయం గురుప్రసాద్ ఇద్దరు పిల్లలను తీసుకుని బయటకు వెళ్లారు. ఈ రోజు జేమ్స్ స్ట్రీట్లో  రైలుపట్టాలపై ఆయన శవమై కనిపించారు. పిల్లలు ఎక్కడ ఉన్నారో తెలియదు.సూసైడ్ నోట్లో కూడా  పిల్లల వివరాలు తెలియజేయలేదు.   వారి ఆచూకీ తెలియక సుహాసిని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆమె మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు.

**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement