హోలీ పండగలోపు కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రకటన: సీఎం రేవంత్‌ | Revanth Reddy Meeting With Malkajgiri Parliament Leaders, Details Inside - Sakshi
Sakshi News home page

హోలీ పండగలోపు కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రకటన: సీఎం రేవంత్‌

Published Thu, Mar 21 2024 9:36 PM | Last Updated on Fri, Mar 22 2024 12:38 PM

Revanth Reddy Meeting With Of Malkajgiri Parliament Leaders - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తాను సీఎంగా ఉన్నానంటే.. ఆ గొప్పతనం మల్కాజిగిరి కార్యకర్తలదేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్‌ పరిధిలోని నేతలతో రేవంత్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆనాడు కొందరు నాయకులు అమ్ముడుపోయినా.. కార్యకర్తలు భుజాలపై మోసి గెలిపించి తనను ఢిల్లీకి పంపించారని గుర్తు చేశారు.

దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ స్థానం మల్కాజిగిరి. నాటి మల్కాజిగిరి గెలుపు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగేలా చేసింది. కేసీఆర్ పతనం 2019 మల్కాజిగిరి పార్లమెంట్ నుంచే మొదలైంది. వందరోజులు పూర్తిగా పాలనపైనే దృష్టి పెట్టాం. మహిళలకు ఉచిత  బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ 10లక్షలకు పెంపు, రూ.500 లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను అమలు చేసుకుంటున్నాం. మూడు నెలల్లోనే 30వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానిది’’ అని రేవంత్‌ పేర్కొన్నారు.

మల్కాజిగిరి పార్లమెంట్ స్థానంలో  కాంగ్రెస్ జెండా ఎగరాలి. అప్పుడే మన ప్రాంతం అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. హొలీ పండగలోగా అధిష్టానం అభ్యర్థులను ప్రకటిస్తుందన్నారు. కష్టపడిన వారిని ప్రభుత్వంలో భాగస్వాములను చేసే బాధ్యత నాది. మనకుబలమైన నాయకత్వం ఉంది.. సమన్వయంతో ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేసిన అభ్యర్థులు ఒక ఐదుగురు సభ్యులతో కమిటీ వేసుకోవాలి. వారికి పోలింగ్ బూత్‌ల వారీగా పని విభజన చేసుకుని సమీక్ష చేసుకోవాలి’’ అని సీఎం రేవంత్‌ సూచించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement