
నిరంజన్ రావు మృతదేహం
న్యాయవాది ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.
మల్కాజిగిరి: న్యాయవాది ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.ఎస్‌ఐ రమణ్‌గౌడ్ కథనం ప్రకారం..శనివారం మౌలాలి రైల్వేస్టేషన్ కు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు. సంఘటనా స్ధలానికి వెళ్లి పరిశీలించారు.
మృతుడి జేబులో ఉన్న గుర్తింపుకార్డు ఆధారంగా అతను ఉప్పరిబస్తీకి చెందిన నిరంజన్ రావు(28) గా గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. సికింద్రాబాద్ పారడైజ్ సమీపంలోని ఇండస్‌ఇంద్ బ్యాంక్‌లో లీగల్ అడ్వైజర్‌గా పనిచేస్తున్న నిరంజన్ రావు శుక్రవారం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని కుటుంబసభ్యులు తెలిపారు.మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.