
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 11న జరగనున్న సాధారణ ఎన్నికల్లో 2,96,97,279 మంది ఓటర్లు ఓటేయనున్నారు. అందులో 1,49,19,751 మంది పురుషులు, 1,47,76,024 మంది మహిళలు, 1,504 మంది ఇతరులున్నారు. మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానంలో అత్యధికంగా 31,49,710 మంది ఓటర్లుండగా, మహబూబాబాద్ స్థానంలో అత్యల్పంగా 14,23,351 మంది ఓటర్లున్నారు.