గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి చివరిరోజు కావడంతో ఆదివారం అన్ని పార్టీలు పోటాపోటీగా ర్యాలీలను నిర్వహిస్తున్నాయి.
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి చివరిరోజు కావడంతో ఆదివారం అన్ని పార్టీలు పోటాపోటీగా ర్యాలీలను నిర్వహిస్తున్నాయి. మల్కాజ్గిరిలో తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రేవంత్ నిర్వహిస్తున్న ర్యాలీకి ముందస్తు అనుమతి లేదన్న కారణంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. అధికార పార్టీ ఆదేశాల మేరకే పోలీసులు తమ ప్రచారాన్ని అడ్డుకుంటున్నారని టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.