తెలంగాణలో ఇప్పుడు ముందస్తు ఎన్నికల సీజన్ నడుస్తోంది. ఎన్నికల వేళ ఎన్ని కళలు, మరెన్ని విచిత్రాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ప్రజలను ఆకట్టుకోవడానికి నాయకులు చిత్రవిచిత్రమైన ఫీట్లు చేస్తుంటారు. మరోవైపు అభిమానులు కూడా తమకు ఇష్టమైన నాయకులపై తమ ప్రేమను అమాంతం చాటుకుంటారు. ఇదేవిధంగా విద్యాసంస్థల అధిపతి, మల్కాజిగిరి టీఆర్‌ఎస్ ఎంపీ మల్లారెడ్డిపై ఆయన అభిమానులు బోలెడంతా ప్రేమను చాటారు. పట్టుపంచె, కండువా కప్పుకొని కూర్చీ మీద కూర్చున్న మల్లారెడ్డికి ఏకంగా పాలాభిషేకం చేశారు.