మల్కాజిగిరి (హైదరాబాద్) : వివాహిత అదృశ్యమైన సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ రమణ్‌గౌడ్ కథనం ప్రకారం.. మల్కాజిగిరి విష్ణుపురికాలనీకి చెందిన వెంకటసుబ్బారావు, సత్యవాణి(25) ఇద్దరూ భార్యాభర్తలు. శుక్రవారం ఉదయం సత్యవాణి తన కొడుకును పాఠశాలలో వదిలి ఇంటికి తిరిగిరాలేదు. ఆమె సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో సత్యవాణి అత్త కాత్యాయిని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.