
ఏటీఎం చోరీకి విఫలయత్నం
హైదరాబాద్: నగరంలోని మల్కాజ్గిరి దయానందనగర్ ఏటీఎంలో గుర్తుతెలియని దుండగులు చోరీకి ప్రయత్నించారు. గురువారం రాత్రి రాళ్లు, ఇనుప రాడ్లతో ఏటీఎమ్ మిషన్‌ను ధ్వంసం చేసి డబ్బు ఎత్తుకెళ్లడానికి యత్నించారు.
అది సాధ్యం కాకపోవడంతో అక్కడి నుంచి పరారయ్యారు. శుక్రవారం ఉదయం ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఏటీఎంలోని సీసీ ఫూటేజీ ఆధారంగా నిందితులను పట్టుకోవడానికి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.