
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అరెస్ట్
మల్కాజిగిరి(హైదరాబాద్‌సిటీ): పెళ్లి చేసుకుంటానని దళిత యువతిని మోసం చేసిన సాఫ్ట్‌వేర్ ఇంజినీరును మల్కాజిగిరి పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఇందిరా నెహ్రూనగర్‌లో నివసించే సాఫ్ట్‌వేర్ ఇంజినీరు జోగు శ్రీనివాస్(29)కు మరో సాఫ్ట్‌వేర్ ఇంజినీరైన యువతి (27)తో పరిచయమైంది. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి ముఖం చాటేశాడు.
ఈ విషయమై ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. దళిత మహిళను మోసం చేసినందుకు అతనిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.