దాడి కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసిన సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది.
మల్కాజిగిరి: దాడి కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసిన సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. ఎస్‌ఐ సైదులు కథనం ప్రకారం... కర్నాటకకు చెందిన కె.చింటూ(19), చిన్నా(19), బీజెఆర్ నగర్‌కు చెందిన జి.నరేష్(21)లు ముగ్గురూ పీవీఎన్ కాలనీలోని వర్షిణి వాటర్ సర్వీసింగ్ సెంటర్‌లో పనిచేస్తున్నారు.
బుధవారం రాత్రి బీజెఆర్ నగర్ గుట్ట మీదకు వెళ్లే పైపులైన్‌ను బండరాయితో పగులగొట్టడానికి ప్రయత్నించడంతో స్ధానికంగా ఉన్న ఖలీల్ ప్రశ్నించడంతో అతని మీద దాడి చేశారు. ఈ సంఘటనలో ఖలీల్‌కు గాయాలయ్యాయి. ఖలీల్ ఫిర్యాదు మేరకు ముగ్గురిని అరెస్ట్ చేశామని మరొకరు పరారీలో ఉన్నారని ఎస్‌ఐ తెలిపారు.