
సాక్షి, హైదరాబాద్ : ఆనంద్‌బాగ్‌లోని ఓ మండిలో బిర్యాని తిన్న ఒకే కుటుంబానికి చెందిన పదిమంది అస్వస్థతకు గురైన సంఘటన మల్కాజిగిరిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చాణక్యపురి కాలనీకి చెందిన ఓ కుటుంబం గత నెల 31 వ తేదీ మధ్యాహ్నం ఆనంద్‌బాగ్‌లోని మండిలో చికెన్ బిర్యానీ తిని ఇంట్లో ఉన్న వారికి తీసుకు వచ్చారు. రాత్రి మిగిలిన వారు కూడా తిన్నారు. మరుసటి రోజు నుంచి వాంతులు, జ్వరం, విరేచనాలు కావడంతో వివిధ ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన పై కుటుంబసభ్యుల్లో ఒకరైన రజనీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ చిన్నారులు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని, సంఘటనకు బాధ్యులైన హోటల్ నిర్వాహకులపై జీహెచ్‌ఎంసీ అధికారులతో పాటు మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment