వాట్సాప్‌లో పోస్ట్‌.. గ్రూప్‌ అడ్మిన్‌తోపాటూ ఒకరు అరెస్ట్‌ | Whats app admin other person arrested over a post in Malkajgiri  | Sakshi
Sakshi News home page

వాట్సాప్‌లో పోస్ట్‌.. గ్రూప్‌ అడ్మిన్‌తోపాటూ ఒకరు అరెస్ట్‌

Published Sat, Mar 2 2019 2:28 PM | Last Updated on Sat, Mar 2 2019 2:43 PM

Whats app admin other person arrested over a post in Malkajgiri  - Sakshi

జాతీయ జెండా తగలబెడుతున్న ఫోటోను పోస్ట్ చేయడంతో..

సాక్షి, హైదరాబాద్‌(మల్కాజ్‌గిరీ): వాట్సాప్‌ గ్రూప్‌లో అభ్యంతరకరమైన పోస్ట్ పెట్టినందుకు గ్రూప్ అడ్మిన్‌తోపాటూ, పోస్ట్ చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జొమాటోలో డెలివరీ బోయ్‌గా పని చేస్తున్న వెంకటేష్ అనే వ్యక్తి లాయల్ పార్ట్‌నర్స్‌ ఎమర్జెన్సీ అనే వాట్సాప్‌ గ్రూప్ క్రియేట్ చేశాడు. గత నెల26న గ్రూప్ సభ్యుడైన మొహమ్మద్‌ మునీర్ జాతీయ జెండా తగలబెడుతున్న ఫోటోను పోస్ట్ చేయడంతో అదే గ్రుప్ సభ్యుడైన వెంకట రామ రెడ్డి అనే వ్యక్తి మల్కాజ్‌గిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

గ్రూపు అడ్మిన్ వెంకటేష్, మెసేజ్ పోస్ట్ చేసిన వ్యక్తి మొహమ్మద్‌ మునీర్‌పై మల్కాజిగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు వర్గాల ప్రజలను రెచ్చగొట్టే విధంగా అభ్యంతరకరమైన పోస్ట్ పెట్టినందుకు సెక్షన్ 153ఏ కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement