
సాక్షి, హైదరాబాద్ : ప్రొఫెసర్ కంచ ఐలయ్యపై కేసు నమోదు చేయాలని మల్కాజిగిరి కోర్టు మంగళవారం ఆదేశించింది. ఓ ఛానల్ చర్చా కార్యక్రమంలో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఆయన మాట్లాడినందుకు నిరసనగా నాగరాజు అనే దళిత యువకుడు మల్కాజిగిరి కోర్టును ఆశ్రయించాడు. వాదనలు విన్న కోర్టు కంచ ఐలయ్యపై సెక్షన్ 153ఏ, 153బీ, 295ఏ, ఐపీసీ 509, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేసి వచ్చే నెల 10వ తేదీలోపు నివేదిక ఇవ్వాలని మల్కాజిగిరి పోలీసులను ఆదేశించింది. కాగా కంచ ఐలయ్య వ్యాఖ్యలపై రెండు తెలుగు రాష్ట్రాలలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తతున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment