హైదరాబాద్‌లో ఫేక్‌నోట్ల కలకలం | fake currency notes seized near Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ఫేక్‌నోట్ల కలకలం

Published Tue, Mar 14 2017 12:26 PM | Last Updated on Tue, Sep 5 2017 6:04 AM

హైదరాబాద్‌లో ఫేక్‌నోట్ల కలకలం

హైదరాబాద్‌లో ఫేక్‌నోట్ల కలకలం

మల్కాజిగిరి(హైదరాబాద్‌): మల్కాజిగిరి అలహాబాద్ బ్యాంకులో నకిలీ కరెన్సీ చలామణి చేసేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో ముద్రితమైన రూ.2,000, రూ.500 కరెన్సీ నోట్లు రూ.9.19 లక్షలను డిపాజిట్ చేసేందుకు యూసుఫ్‌ షేక్‌ అనే వ్యక్తి యత్నించగా బ్యాంకు మేనేజర్, అకౌంటెంట్ గుర్తించారు. సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కుషాయిగూడ పోలీసులు వచ్చి అతడిని అరెస్టు చేశారు. మల్కాజిగిరి ఏసీపీ రంగంలోకి నిందితుడిని విచారిస్తున్నారు. స్పెషల్ ఆపరేషన్ టీం దర్యాప్తు చేస్తోంది. కాగా, అసలు నోటుకు, చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటుకు ఏ మాత్రం తేడా లేదని, గుర్తించడం అసాధ్యమని బ్యాంకు సిబ్బంది చెబుతున్నారు.

నోట్ల మార్పిడి చేస్తున్న 15మంది ముఠా అరెస్ట్‌
మరో ఘటనలో పాత నోట్లును మార్పిడి చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. సికింద్రాబాద్‌ బేగంపేటలోని వెంకట్ రెసిడెన్సీలో బిల్డర్ యాదగిరి ఇంటిపై బేగంపేట పోలీసులు దాగా చేశారు. పాత నోట్లను మార్పిడి చేస్తున్న 15మంది సభ్యులున్న ముఠాను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారి నుంచి లక్ష రూపాయలకు పైగా పాతనోట్లను స్వాధీనం చేసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement