
సాక్షి, హైదరాబాద్ : మల్కాజిగిరి నియోజక వర్గం అసెంబ్లీ టికెట్‌ను కాంగ్రెస్ అభ్యర్థి నందికంటి శ్రీధర్‌కే కేటాయించాలంటూ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మల్కాజిగిరి చౌరస్తాలో గురువారం ధర్నా నిర్వహించారు. అనంతరం ఇందిరా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ మహాకూటమి పొత్తులో భాగంగా మల్కాజిగిరి అసెబ్లీ టికెట్‌ను స్థానికులకే కేటాయించాలని డిమాండ్ చేశారు. అలా కాదని ఈ టికెట్‌ని టీజేఎస్‌కు ఇస్తే అందరం కలిసి మల్కాజిగిరిలో టీజేఎస్‌ను చిత్తుగా ఒడిస్తామని హెచ్చరించారు.
కొన్ని సంవత్సరాలుగా పార్టీని కాపాడుకుంటూ వస్తోన్న కార్యకర్తలు ఎవరు టీజేఎస్‌కు ఓటు వేయరని తెలిపారు. అసలు క్యాడరే లేని టీజేఎస్‌కు టికెట్ ఎలా కేటాయిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి నందికంటి శ్రీధర్‌కు టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ను కలిసి తమ డిమాండ్‌ను తెలుపుతామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment