Ticket allocation
-
టికెట్ల కేటాయింపుపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: టీడీపీతో సయోధ్యగా ఉన్న వారికే టికెట్లు కేటాయించడంలో ప్రాధాన్యత ఇస్తామని జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ తమ పార్టీ నేతలకు స్పష్టం చేశారు. గురువారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నేతలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పుడు టికెట్ ఆశించేవారు వ్యక్తిగతంగా 10 వేల నుంచి 15 వేల ఓట్ల వరకు తెచ్చుకోవాల్సి ఉంటుందన్నారు. తాను జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తానన్నది వాస్తవం కాదని, ఎన్నికల కమిషనే రూ.40 లక్షలు ఖర్చు చేయవచ్చని చెబుతుంటే.. తాను జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తానని ఎలా చెబుతానని ప్రశ్నించారు. ‘2019 ఎన్నికల్లో ఉదారతతో కొంత మందికి పార్టీ టికెట్ ఇచ్చాం. టీడీపీతో పొత్తుకు అభ్యంతరం తెలపని వారికి మాత్రమే టికెట్లు ఇస్తామని తెలిపారు. ప్రాంతీయ పార్టీలు.. కేంద్రంలో అధికారంలో ఉండే ఏదో ఒక జాతీయ పార్టీతో కలిసి ఉండక తప్పదని చెప్పారు. తాను బీజేపీతో కలిశానని తనను ముస్లింలు నమ్మడం లేదన్నారు. ‘నేను బీజేపీతో ఉన్నా, మీ వైపు మాత్రమే పవన్‌కళ్యాణ్ ఉంటాడు’ అని గుర్తు పెట్టుకోండన్నారు. -
తనకు టికెట్ కన్ఫామ్ అయిందో లేదో చెబితే భవిష్యత్ కార్యాచరణ చేపడతాడట!
తనకు టికెట్ కన్ఫామ్ అయిందో లేదో చెబితే భవిష్యత్ కార్యాచరణ చేపడతాడట! -
కాంగ్రెస్ టికెట్ కావాలా? దరఖాస్తు ఫీ రూ.2 లక్షలే.. వారికి 50% డిస్కౌంట్!
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. ఈ క్రమంలో ఇప్పటి నుంచే అందుకు సన్నద్ధమవుతోంది కర్ణాటక కాంగ్రెస్. ఎన్నికల పట్ల అభ్యర్థులు సీరియస్‌గా ఉండేందుకోసమంటూ దరఖాస్తు ప్రక్రియను బుధవారం ప్రకటించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ కావాలనుకునే వారు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించారు కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్. ఈ ప్రక్రియ 10 రోజుల పాటు సాగనుందన్నారు. ‘కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేయాలనుకుంటున్న వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం. దరఖాస్తు విండో నవంబర్ 5 నుంచి 15వ తేదీ వరకు 10 రోజుల పాటు తెరిచి ఉంటుంది. మా ఆఫీసులో దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉన్నాయి. అప్లికేషన్ ఫీజు రూ.5,000. జనరల్ కేటగిరీ దరఖాస్తుదారులు రూ.2 లక్షల డిమాండ్ డ్రాఫ్ట్(డీడీ) ఇవ్వాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలకు 50శాతం డిస్కౌంట్‌తో రూ.1 లక్ష కట్టాలి. సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. అందులో నేను సైతం ఉంటాను. నేను పోటీ చేయాలనుకుంటే, తప్పకుండా దరఖాస్తు చేసుకోవాల్సిందే.’అని తెలిపారు కేపీసీసీ ప్రెసిడెంట్ డీకే శివకుమార్. ఈ ఫండ్స్‌ను పార్టీ నూతన భవనం నిర్మాణం సహా వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రకటనలు ఇచ్చేందుకు ఉపయోగిస్తామని తెలిపారు. మరోవైపు.. ఎన్నికలకు చాలా సమయం ఉన్నప్పటికీ ఈసారి దరఖాస్తులను ముందస్తుగానే ఆహ్వానిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల పట్ల అశ్రద్ధగా ఉన్నవారిని ఫిల్టర్ చేసేందుకే ఫీజును పెంచినట్లు చెప్పాయి. ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మార్గదర్శకత్వం, కాంగ్రెస్ భావజాలాన్ని నమ్మే వారు ఎవరైనా పార్టీలో చేరొచ్చని తెలిపారు డీకే శివకుమార్. ఆన్లైన్ సభ్యత్వ నమోదు కొనసాగుతోందని చెప్పారు. అలాగే.. ఏఐసీసీ అధ్యక్షుడిగా రాష్ట్ర నేత మల్లికార్జున ఖర్గే బాధ్యతలు చేపట్టిన క్రమంలో ఆయనకు నవంబర్ 6న సర్వోదయ సమవేశం ద్వారా ఘన స్వాగతం పలకాలని ఏర్పాట్లు చేస్తోంది. ఇదీ చదవండి: ‘ఈ విచారణలేందుకు.. వీలైతే నేరుగా అరెస్ట్ చేయండి’.. జార్ఖండ్ సీఎం సవాల్ -
టీఆర్ఎస్లో 16, ఎంఐఎంలో 13 మంది నేరచరితులు
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నేరచరిత్ర కలిగిన అభ్యర్థులకు టికెట్లు ఇవ్వవద్దని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్‌జీజీ) రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేసింది. గతంలో అన్ని పార్టీల నుంచి కలిపి 72 మంది నేరచరిత్ర ఉన్నవాళ్లు టికెట్లు దక్కించుకుని పోటీ చేశారని తెలిపింది. అందులో 30 మంది అభ్యర్థులు గెలిచారని, ఈ లెక్కన పాలకమండలిలో 20 శాతం మంది కార్పొరేటర్లు నేరచరిత్ర కలిగి ఉన్నారని వివరించింది. పార్టీలవారీగా చూసుకుంటే టీఆర్ఎస్లో 16 మంది, ఎంఐఎంలో 13 మంది, బీజేపీలో ఒక్కరి చొప్పున ఉన్నారని వెల్లడించింది. నేరచరితులు బరిలో నిల్చుంటే విద్యావంతులు ఓటింగ్‌పై విముఖత చూపుతారని, ఫలితంగా ఓటింగ్ శాతం పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది. వచ్చే ఎన్నికల్లోనైనా నేరచరిత్ర కలిగిన అభ్యర్థులకు టికెట్లు ఇవ్వకూడదని అన్ని పార్టీలను ఎఫ్‌జీజీ కార్యదర్శి పద్మనాభరెడ్డి సోమవారం ఓ ప్రకటనలో కోరారు. (చదవండి: ఎన్నికలపై స్టే కోరుతూ వ్యాజ్యం.. హైకోర్టు ఆగ్రహం) -
అనంతలో టీడీపీ నేతలు,కార్యకర్తల ఆందోళన
-
రాయచోటి టీడీపీలో టికెట్ల రగడ
-
టీజేఎస్‌ని ఓడిస్తాం : కాంగ్రెస్ నాయకులు
సాక్షి, హైదరాబాద్ : మల్కాజిగిరి నియోజక వర్గం అసెంబ్లీ టికెట్‌ను కాంగ్రెస్ అభ్యర్థి నందికంటి శ్రీధర్‌కే కేటాయించాలంటూ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మల్కాజిగిరి చౌరస్తాలో గురువారం ధర్నా నిర్వహించారు. అనంతరం ఇందిరా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ మహాకూటమి పొత్తులో భాగంగా మల్కాజిగిరి అసెబ్లీ టికెట్‌ను స్థానికులకే కేటాయించాలని డిమాండ్ చేశారు. అలా కాదని ఈ టికెట్‌ని టీజేఎస్‌కు ఇస్తే అందరం కలిసి మల్కాజిగిరిలో టీజేఎస్‌ను చిత్తుగా ఒడిస్తామని హెచ్చరించారు. కొన్ని సంవత్సరాలుగా పార్టీని కాపాడుకుంటూ వస్తోన్న కార్యకర్తలు ఎవరు టీజేఎస్‌కు ఓటు వేయరని తెలిపారు. అసలు క్యాడరే లేని టీజేఎస్‌కు టికెట్ ఎలా కేటాయిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి నందికంటి శ్రీధర్‌కు టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ను కలిసి తమ డిమాండ్‌ను తెలుపుతామని చెప్పారు. -
కూటమిలో కొట్లాట
-
నేడు టీపీసీసీ ఎన్నికల కమిటీ భేటీ
సాక్షి, హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసే అభ్యర్థుల పేర్లను అధిష్టానానికి పంపాల్సిన టీపీసీసీ ఎన్నికల కమిటీ సమావేశం శనివారం జరగనుంది. నగర శివార్లలోని ఓ గెస్ట్‌హౌస్‌లో మధ్యాహ్నం 3 నుంచి ఈ సమావేశం జరగనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా, కీలక నేతలు జానారెడ్డి, భట్టి విక్రమార్కలతోపాటు 55 మంది కమిటీ సభ్యులు హాజరుకానున్నారు. సమావేశంలో టికెట్ల కేటాయింపుపై కీలక చర్చ జరగనుంది. ప్రతి నియోజకవర్గానికి టికెట్ల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ముఖ్యమైన పేర్లను అధిష్టానం ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ కమిటీ పరిశీలనకు పంపే అంశంపై నేతలు నియోజకవర్గాల వారీగా చర్చించనున్నారు. ఈ నెల 10న స్క్రీనింగ్ కమిటీ హైదరాబాద్‌కు వస్తుందన్న వార్తల నేపథ్యంలో ఈలోపే అభ్యర్థుల పేర్లు, ఇతర పార్టీలకు ఇవ్వాల్సిన సీట్ల విషయంలో స్పష్టత కోసమే టీపీసీసీ ఎన్నికల కమిటీ తొలిసారి భేటీ కాబోతుండటం గమనార్హం. కోడ్ ఉన్నప్పుడు చీరలు ఎలా ఇస్తారు?: గూడూరు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు పంపిణీ ఎలా చేస్తారు? పంపిణీ కుదరదని తెలియదా? అని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి టీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించారు. తాను ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసి బతుకమ్మ చీరలు రాకుండా అడ్డుకున్నానని కేసీఆర్ పేర్కొనడం సరికాదని వ్యాఖ్యానించారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరుగుతోందని గత నెలలో ఆయన ఈసీకి లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. బతుకమ్మ చీరల పంపిణీలో కేసీఆర్ బొమ్మ లేకుండా.. రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయాలని ఈసీని కోరడంలో తప్పేముందని ప్రశ్నించారు. నోటికాడి అన్నం గుంజుకున్నట్లు బతుకమ్మ చీరలు రాకుండా అడ్డుకున్నానని ‘విజయశాంతి గురించి మాట్లాడే అర్హత లేదు’ సాక్షి, హైదరాబాద్: విజయశాంతి..అసలు సిసలైన తెలంగాణ ఉద్యమకారిణి అని, ఆమె గురించి మాట్లాడే అర్హత టీఆర్ఎస్ మహిళా నేతలకు లేదని టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ సభ్యురాలు ఇందిరాశోభన్ మండిపడ్డారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో గుహలో దాక్కున్న టీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు గుండుసుధారాణి ఇప్పుడు విజయశాంతి, కొండా సురేఖ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. దేశ చరిత్రలోనే కేబినెట్లో మహిళా మంత్రి లేకుండా కేసీఆర్ పాలన సాగిస్తున్నప్పుడు మీ చావు తెలివితేటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రజా గాయని విమలక్క ఆఫీసుకి తాళం వేసి అర్ధరాత్రి నడిరోడ్డు మీద నిలబెట్టినప్పుడు చప్పుడు చేయని వీళ్లు.. ఎన్నికల ముందు తమ పదవుల కోసం మహిళల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి దొరకు భజన చేస్తున్నారని వ్యాఖ్యానించారు. -
గాంధీభవన్ లో జీహెచ్ఎంసీ టికెట్ల లొల్లి
భట్టిని నిలదీసిన ఆశావహులు సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపుపై ఆశావహులు కాంగ్రెస్ సీనియర్ నాయకులపై నిరసన గళం వినిపిస్తున్నారు. గాంధీభవన్‌లో గురువారం టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్కను పలువురు నిలదీశారు. పార్టీని నమ్ముకుని పనిచేసిన తమకు టికెట్లు ఇవ్వకుండా అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబ సభ్యులకు కుర్మగూడ డివిజన్ టికెట్ ఆశించిన కిశోర్‌గౌడ్ అనే నాయకుడు ఆత్మహత్యాయత్నం చేశారు. అయితే అక్కడున్న పార్టీ నాయకులు అడ్డుకున్నారు. ముందు టికెట్‌ను తనకు ప్రకటించి, ఎలా మారుస్తారని ఫలక్‌నుమా డివిజన్‌కు చెందిన కమలానాయక్ భట్టిని నిలదీశారు. -
నామా..గోబ్యాక్
సాక్షి, ఖమ్మం: తెలుగుదేశం పార్టీలో వర్గపోరు రోడ్డెక్కింది. టికెట్ కేటాయింపు విషయంలో తమ నేతకు అన్యాయం చేశారని ఆరోపిస్తూ ఎంపీ నామానాగేశ్వరరావును ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ వర్గీయులు అడ్డుకుని దూషణకు దిగారు. బాలసాని ఇంటికి వచ్చిన నామాను లోపలికి వెళ్లకుండా అటకాయించగా....ఎట్టకేలకు నామా లోపలికి వెళ్లి గంటసేపు ఇంట్లో కూర్చున్నా బాలసాని కలవకపోవడంతో తీవ్రపరాభవంతో వెనుదిరిగారు. బుధవారం జరిగిన ఈ సంఘటనలకు సంబంధించి వివరాలు... కొత్తగూడెం అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తనకు టికెట్ ఇచ్చినట్లే ఇచ్చి.. కొత్తగూడెం నియోకజవర్గ ఇన్చార్జి కోనేరు సత్యనారాయణ(చిన్ని)కి బీ-ఫాం ఇవ్వడంతో బాలసాని లక్ష్మీనారాయణ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఈ విషయమై బుధవారం ఉదయం 10 గంటలకు తన ఇంట్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అప్పటికే వందలాది మంది బాలసానిఅనుచరులు తమ నాయకునికి అన్యాయం జరిగిందంటూ అక్కడికి చేరుకొని నినాదాలు చేశారు. విలేకరుల సమావేశం ముగుస్తున్న సమయంలో....నామా తన నామినేషన్ కార్యక్రమానికి ఆహ్వానించేందుకు బాలసాని ఇంటికి వచ్చారు. ఆయన వెంట ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, మద్దినేని స్వర్ణకమారి కూడా ఉన్నారు. వీరు బాలసాని ఇంటిముందు వాహనం నిలపగానే బాలసాని వర్గీయులు ఆగ్రహంతో ఊగిపోయారు. నామా డౌన్‌డౌన్ అంటూ తీవ్ర స్థాయిలో నినాదాలు చేశారు. అప్పటికే బాలసాని విలేకరుల సమావేశంలో నామాపై ఆగ్రహంతో మాట్లాడడంతో ఆయన అనుచరులు ఆవేశంతో ఉన్నారు. ఇదే సమయంలో నామా ఆయన ఇంటికి రావడంతో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. నామాను ఇంట్లోకి రానివ్వకుండా బాలసాని అనుచరులు గేట్లు వేశారు. దీంతో నామా వెంట వచ్చిన నేతలు.. బాలసాని అనుచర నేతలు గేటు తీసే విషయంలో ఘర్షణకు దిగారు. ‘ఎంపీ డౌన్‌డౌన్.. నిన్ను గెలవనివ్వం, నామా గ్యోబాక్, బీసీలు లేకుండా ఎలా గెలుస్తారో చూస్తాం.. వెన్ను పోటు పొడుస్తావా..?’ అంటూ నామాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాయడానికి వీలు లేని పదజాలంతో దూషించారు. చివరకు గేటు తీయాలని కార్యకర్తలను బాలసాని వారించడంతో నామా ఆయన ఇంట్లోకి వచ్చి కూర్చున్నారు. అయితే తన ఇంట్లో విలేకరుల సమావేశం వద్ద ఏర్పాటు చేసిన ప్రాంగణం నుంచి నామాను కలిసేందుకు బాలసాని వెళ్లడానికి ప్రయత్నించినా.. ‘మీరు ఆయనను కలవడానికి వెళ్లొద్దు.. బీసీల పరువు తీయొద్దు’ అంటూ బాలసానిని అతని అనుచరులు అడుగు కదలనివ్వలేదు. అవమానంతో వెనుదిరిగిన నామా.. గంటపాటు ఇంట్లో కూర్చున్నా బాలసాని తన దగ్గరకు రాకపోవడంతో నామా వెనుదిరిగి పోయారు. మధ్యవర్తులుగా ఉన్న నేతలు బాలసానిని మీదగ్గరకు కార్యకర్తలు రానివ్వడం లేదని చెప్పడంతో ఆయన అవమానంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. నామా వెళ్తుతున్న సమయంలోనూ బాలసాని అనుచరులు ‘నామా గోబ్యాక్, నిన్ను గెలవనివ్వవం’ అంటూ నినాదాలను మిన్నంటించారు. బాలసాని ఇంటికి నామా వచ్చారని, అక్కడ ఇరువురు నేతల అనుచరుల మధ్య వాగ్వాదం జరుగుతోందని తెలుసుకొని పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు అక్కడి చేరుకున్నారు. అయితే పలువురు ‘టికెట్ బాలసానికి ఇచ్చారు కదా...గొడవెందుకని అసలు విషయం తెలియక మాట్లాడారు. రాత్రికి రాత్రే సీన్ మారిన విషయం కార్యకర్తలకు తెలియక తికమక పడ్డారు. బాలసానికి టికెట్ ఇచ్చినట్లే ఇచ్చి.. బీ-ఫాం కోనేరు సత్యనారాయణకు ఇచ్చారన్న విషయం తెలుసుకొని అక్కడికి వచ్చిన వారంతా కూడా నామాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీసీలను అణగదొక్కుతున్నారు.... టీడీపీ బీసీల పార్టీ అని, బీసీని సీఎం చేస్తానని, వంద సీట్లు బీసీలకు ఇస్తామని పార్టీ నేత ప్రకటిస్తే జిల్లాలో మాత్రం నాయకులు బీసీలను అణగదొక్కుతున్నారని ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ విమర్శించారు. ‘ఖమ్మం జిల్లాలో 12 లక్షల మంది బీసీలున్నారు.. బీసీలకు ఒక్క సీటు ఇవ్వకుండా, మైకు పట్టుకొని వారి ఓట్లను నేను ఎలా అడగాలి.. వారికి ఏం సమాధానం చెబుతారు. నాకు కాకపోతే బీసీలైన నాగప్రసాద్, పంతంగి వెంకటేశ్వర్లు, వల్లంకొండ వెంకట్రామయ్య ఎవరికైనా టికెట్లు ఇవ్వవచ్చు కాదా.. నీ వెంట ఉండి, నిన్ను నమ్మిన వారికి కూడా టికెట్ ఇవ్వకుండా బీసీలను అవమానించారు. ఇప్పుడు బీసీలకు ఏం సమాధానం చెబుతారు’ అని ఆయన నామాపై ధ్వజమెత్తారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...చంద్రబాబు తనకు టికెట్ ఇస్తే రాత్రికిరాత్రే నామా నాగేశ్వరారావు కోనేరు చిన్నికి బీ-ఫాం తీసుకొచ్చి జిల్లాలో బీసీలను అవమానించారని మండిపడ్డారు. ‘పార్టీపై నీ పెత్తనం ఏంటీ, నీ జేబు సంస్థ అనుకున్నావా’అంటూ ఘాటుగా విమర్శించారు. ఎంపీగా నామినేషన్ వేస్తూ బీసీకి వచ్చిన సీటు ఆపడం ఎంతవరకు న్యాయమని బాలసాని ప్రశ్నించారు. బీసీలకు టికెట్ ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్తే మీకే నష్టం అన్నారు. పాలేరులో నాలుగు మండలాలు ఒకే సామాజిక వర్గం వారికి బాధ్యతలు ఇచ్చారని కార్యకర్తలు మొత్తుకున్నా పరిస్థితి మారలేదన్నారు. ఆర్థిక బలంతో వచ్చి పార్టీని నాశనం చేస్తున్నారని.. మీ వైఖరి మార్చుకోవాలని నామాను ఆయన హెచ్చరించారు. బీసీలకు అన్యాయం జరగడంతో ఈ ఎన్నికల్లో 30వ తేదీ వరకు తాను ఎక్కడికి ప్రచారానికి వెళ్లనన్నారు. చంద్రబాబు వచ్చినా ఆయనను మర్యాదపూర్వకంగా కలుస్తానే తప్ప.. ప్రచారానికి వెళ్లనని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఆయన వెంట బీరెడ్డి నాగచంద్రారెడ్డి, శెట్టి రంగారావు, చింతనిప్పు కృష్ణచైతన్య, బుడిగం శ్రీను ఉన్నారు.