సాక్షి, హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసే అభ్యర్థుల పేర్లను అధిష్టానానికి పంపాల్సిన టీపీసీసీ ఎన్నికల కమిటీ సమావేశం శనివారం జరగనుంది. నగర శివార్లలోని ఓ గెస్ట్‌హౌస్‌లో మధ్యాహ్నం 3 నుంచి ఈ సమావేశం జరగనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్సీ కుంతియా, కీలక నేతలు జానారెడ్డి, భట్టి విక్రమార్కలతోపాటు 55 మంది కమిటీ సభ్యులు హాజరుకానున్నారు.
సమావేశంలో టికెట్ల కేటాయింపుపై కీలక చర్చ జరగనుంది. ప్రతి నియోజకవర్గానికి టికెట్ల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ముఖ్యమైన పేర్లను అధిష్టానం ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ కమిటీ పరిశీలనకు పంపే అంశంపై నేతలు నియోజకవర్గాల వారీగా చర్చించనున్నారు. ఈ నెల 10న స్క్రీనింగ్ కమిటీ హైదరాబాద్‌కు వస్తుందన్న వార్తల నేపథ్యంలో ఈలోపే అభ్యర్థుల పేర్లు, ఇతర పార్టీలకు ఇవ్వాల్సిన సీట్ల విషయంలో స్పష్టత కోసమే టీపీసీసీ ఎన్నికల కమిటీ తొలిసారి భేటీ కాబోతుండటం గమనార్హం.
కోడ్ ఉన్నప్పుడు చీరలు ఎలా ఇస్తారు?: గూడూరు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు పంపిణీ ఎలా చేస్తారు? పంపిణీ కుదరదని తెలియదా? అని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి టీఆర్‌ఎస్ పార్టీని ప్రశ్నించారు. తాను ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసి బతుకమ్మ చీరలు రాకుండా అడ్డుకున్నానని కేసీఆర్ పేర్కొనడం సరికాదని వ్యాఖ్యానించారు.
శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరుగుతోందని గత నెలలో ఆయన ఈసీకి లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. బతుకమ్మ చీరల పంపిణీలో కేసీఆర్ బొమ్మ లేకుండా.. రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయాలని ఈసీని కోరడంలో తప్పేముందని ప్రశ్నించారు. నోటికాడి అన్నం గుంజుకున్నట్లు బతుకమ్మ చీరలు రాకుండా అడ్డుకున్నానని
‘విజయశాంతి గురించి మాట్లాడే అర్హత లేదు’
సాక్షి, హైదరాబాద్: విజయశాంతి..అసలు సిసలైన తెలంగాణ ఉద్యమకారిణి అని, ఆమె గురించి మాట్లాడే అర్హత టీఆర్‌ఎస్ మహిళా నేతలకు లేదని టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ సభ్యురాలు ఇందిరాశోభన్ మండిపడ్డారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో గుహలో దాక్కున్న టీఆర్‌ఎస్ మహిళా అధ్యక్షురాలు గుండుసుధారాణి ఇప్పుడు విజయశాంతి, కొండా సురేఖ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
దేశ చరిత్రలోనే కేబినెట్‌లో మహిళా మంత్రి లేకుండా కేసీఆర్ పాలన సాగిస్తున్నప్పుడు మీ చావు తెలివితేటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రజా గాయని విమలక్క ఆఫీసుకి తాళం వేసి అర్ధరాత్రి నడిరోడ్డు మీద నిలబెట్టినప్పుడు చప్పుడు చేయని వీళ్లు.. ఎన్నికల ముందు తమ పదవుల కోసం మహిళల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి దొరకు భజన చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment