మానవత్వం మంటగలిసింది! | hain driven by the elderly snaching | Sakshi
Sakshi News home page

మానవత్వం మంటగలిసింది!

Published Wed, Feb 24 2016 11:51 PM | Last Updated on Mon, Oct 8 2018 8:52 PM

మానవత్వం  మంటగలిసింది! - Sakshi

మానవత్వం మంటగలిసింది!

నడవలేని వృద్ధురాలి గొలుసు స్నాచింగ్

మల్కాజిగిరి: మానవత్వానికే మచ్చతెచ్చే సంఘటన ఇది... డబ్బు ముందు మనిషిలోని జాలి, దయ కనుమరుగయ్యాయి. నడవలేని అవ్వ మెడలో గొలుసును ఓ ప్రబుద్ధుడు లాక్కెళ్లాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయలేదు.  వివరాలు... మీర్జాలగూడకు చెందిన లక్ష్మమ్మ అలియాస్ అన్నమ్మ (75) భర్త చనిపోవడంతో ఆటో డ్రైవర్‌గా పని చేసే కుమారుడు శ్రీను వద్ద ఉంటోంది. వినికిడి లోపంతో పాటు నడవలేని స్థితిలో ఉండే అన్నమ్మ బయటకు రావాలంటే నేల మీద పాకుతూ రావాల్సిందే. ప్రతి రోజూ ఇంటికి సమీపంలో అరుగు మీద కాసేపు కూర్చొని తిరిగి ఇంటికి వెళ్లేది.

ఇదే క్రమంలో మంగళవారం సాయంత్రం ఇంటికి పాకుతూ వెళ్తుండగా.. గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలోని తులంపావు బంగారు గొలుసు తెంపుకెళ్లాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు. కేసు నమోదు చేయిలేదని తెలిసింది. ఫిర్యాదు చేస్తే కోర్టుకు రావాల్సి ఉంటుందని, ఖాళీ కాగితంపై సంతకం పెట్టమని పోలీసులు చెప్పగా పెట్టలేదని బాధితురాలి బంధువులు ‘సాక్షి’కి తెలిపారు.  కష్టపడి కూడబెట్టుకున్న గొలుసు పోయిందని బెంగతో అన్నమ్మ భోజనం తినడం లేదని ఆమె మనుమరాలు తెలిపింది. గొలుసు గురించి అడిగితే అన్నమ్మ చేతులు జోడించి కన్నీళ్లు పెట్టుకోవడం కలిచివేసింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement