తిరుమల: తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్ అభ్యర్ధుల ప్రకటన ముహూర్తానికి ముందే ఆ పార్టీ మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు మంత్రి హరీశ్ రావుకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
సీఎం మరికొద్ది సేపట్లో అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నారనగా మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మంత్రి హరీశ్ రావుపై ఫైర్ అయ్యారు. నేను, నా కుమారుడు ఎక్కడ నుండి పోటీ చెయ్యాలో చెప్పడానికి హరీష్రావు ఎవరు? ఇందులో ఆయన పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. నేను మల్కాజ్ గిరి నుంచి నా కుమారుడు మెదక్ నుంచి పోటీ చేస్తాము. ఎవ్వరు అడ్డుకుంటారో చూస్తామని సవాల్ చేశారు.
ఇంతకాలం మెదక్ అభివృద్ధిని అడ్డుకుంది హరీష్ రావేనని అవసరమైతే సిద్దిపేటలో నా తడాఖా ఏంటో చూప్పించి హరీశ్ రావు అడ్రస్ గల్లంతు చేస్తానని వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేశారు. కేసీఆర్ కుటుంబంలో చాలామందికి టికెట్ ఇచ్చారని మా ఇద్దరికి టికెట్ ఇస్తేనే పోటీ చేస్తామని స్పష్టం చేశారు.
‘నా కుమారుడు మైనంపల్లి రోహిత్ రెండు గోల్డ్ మెడల్స్ సాధించారు. కరోన సమయంలో ప్రణాలకు తగించి చాలా మందికి వైద్య సేవలు అందించారు. తండ్రి గా నా కుమారుడికి నా సపోర్ట్ ఉంటుంది. నా కొడుకుని మెదక్ ఎమ్మెల్యే చేస్తాను. హరీష్‌రావు మెదక్ లో పెత్తనం చలాయిస్తున్నాడు. ఓ డిక్టేటర్లా హారీష్‌రావు ప్రవర్తిస్తా ఉన్నారు. హారీష్రావు గతం గుర్తు పెట్టుకో. ఓ టంకు డబ్బాతో, రబ్బరు చొప్పులతో వచ్చిన రోజు చూసాను. నేను హిరోగా ఉన్నా, హరీష్ రావు చాలా చిన్న వాడు....సిద్దిపేట్ అభివృద్ధి అయింది, మెదక్ ఎందుకు అభివృద్ధి కాలేదు అని అడిగినా.
హరీష్‌రావు బట్టలు ఇప్పే వరకు నేను వదలను.. ఈసారి నా కొడుకును ఎమ్మెల్యేగా గెలిపించుకొని హరీష్‌రావు అడ్రస్ లేకుండా చేస్తా. వచ్చే ఎన్నికల్లో సిద్ధిపేటలో పోటి చేస్తా బిడ్డా. హరీష్‌రావుని నిద్రపోనివ్వను. లక్ష కోట్లు హరీష్‌రావు సంపాదించాడు. టంకు డబ్బా,రబ్బరు చెప్పులతో వచ్చిన హారీష్‌రావ్‌కి లక్ష కోట్లు ఎక్కడి నుండి వచ్చాయి.
మెదక్ లో హారీష్‌రావ్ పెత్తనం ఏంటి. మల్కాజ్‌గిరిలో నేను పోటీ చేస్తా, మెదక్ లో నా కొడుకు పోటీ చేస్తాడు. అవసరమైతే రాజకీయాలు పక్కనపెట్టి నా కొడుకుని గెలిపించుకొంటాను. నేను టీఆర్ఎస్ పార్టీ, వారు నన్ను వద్దు అనుకొంటే నేను ఏం చేసేను. నాకు ఎమ్‌ఎల్‌ఏ టికెట్ ఇచ్చారు. ఇస్తే ఇద్దరికి టికెట్ ఇవ్వమని అడిగా. లేకుంటే ఎవ్వరికి వద్దు అని తేల్చి చెప్పాను’అని మంత్రి హరీష్‌రావుపై మండిపడ్డారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి.
ఇది కూడా చదవండి: హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్‌కు మంత్రి హరీష్ క్లాస్
Comments
Please login to add a commentAdd a comment