
అయ్యప్ప శ్రీనిధి (ఫైల్)
మల్కాజిగిరి: మనోవేదనతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిసిన మేరకు.. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన హరిబాబు, జగదీశ్వరిలు మల్కాజిగిరి దయానంద్‌నగర్‌లో నివాసముంటున్నారు. వారి రెండో కుమారుడు అయ్యప్ప శ్రీనిధి(21) డిగ్రీ తప్పడంతో తిరిగి పరీక్షలు రాశాడు. కాల్ సెంటర్‌లో కూడా పనిచేస్తున్నాడు. తను చేస్తున్న ఉద్యోగం నైట్‌డ్యూటీకావడం, మళ్లీ పాస్ అవుతానోలేదో బెంగతో కొన్ని రోజులుగా ఇంట్లో ముభావంగా ఉంటున్నాడు. ఈ నెల 3వ తేదీ మధ్యాహ్నం అయ్యప్ప శ్రీనిధి అన్న వాచస్పతి ఉద్యోగానికి వెళ్లి రాత్రి తిరిగి వచ్చాడు. ఇంటి తలుపు తట్టినా తీయకపోవడంతో కిటికీలో నుంచి చూడగా ఫ్యాన్ కొక్కికి ఉరివేసుకొని ఉన్న అయ్యప్ప శ్రీనీధి కనిపించాడు. గమనించగా అప్పటికే మృతి చెందాడు.మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment