చంద్రబాబు ఓటు చెల్లదు: భన్వర్లాల్ | chandra babu naidu vote will be invalid, says bhanwar lal | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ఓటు చెల్లదు: భన్వర్లాల్

Published Wed, Apr 30 2014 3:51 PM | Last Updated on Tue, Aug 14 2018 4:24 PM

చంద్రబాబు ఓటు చెల్లదు: భన్వర్లాల్ - Sakshi

చంద్రబాబు ఓటు చెల్లదు: భన్వర్లాల్

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వేసిన ఓటును చెల్లని ఓటుగా పరిగణిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్లాల్ స్పష్టం చేశారు. తాను బీజేపీకి ఓటేశానంటూ బహిరంగంగా చెప్పి, చంద్రబాబు నాయుడు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో తన కుటుంబ సభ్యులతో కలసి ఓటేసిన చంద్రబాబు, ఆ తర్వాత  మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీకి ఓటేశానని చెప్పారు.

ఎన్నికల నియమావళి ప్రకారం బహిరంగం ఫలానా గుర్తుకు ఓటేశానని చెప్పకూడదు. అలాగే మీడియా సహా ఎవరూ కూడా ఎవరినీ ఓటు గురించి అడగకూడదు. ఓటు ఎవరికి వేశామన్న విషయాన్ని ఎవరూ చెప్పకూడదని, ఎవరూ వనికూడదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్ స్పష్టం చేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు, తన సొంత పార్టీకి ఎటూ ఓటు వేసుకోలేకపోగా.. ఇప్పుడు తాము పొత్తు పెట్టుకున్న బీజేపీకి వేసిన ఓటు కూడా చెల్లకుండా పోయినట్లయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement