ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక బ్యాలెట్ పేపర్‌లో తప్పులు దొర్లాయి.
వికారాబాద్: వికారాబాద్ జిల్లాలో గురువారం ఉదయం ప్రారంభమైన ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక బ్యాలెట్ పేపర్‌లో తప్పులు దొర్లాయి. అభ్యర్థి లక్ష్మయ్య ఫొటో పక్కన మాణిక్ రెడ్డి పేరు ముద్రించడంతోపాటు మాణిక్‌రెడ్డి ఫొటో పక్కనే మరో అభ్యర్థి లక్ష్మయ్య పేరు ముద్రించారు.
దీంతో టీఎస్‌యూటీఎఫ్ అభ్యర్థి మాణిక్ రెడ్డి బ్యాలెట్ పేపర్‌ను తిరిగి ముద్రించాలని డిమాండ్ చేశారు. పోలింగ్ రద్దు చేయాలని రిటర్నింగ్ అధికారిని కోరారు.ఇరువురు అభ్యర్థులు ఈ విషయమై ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ బ్యాలెట్‌లో అభ్యర్థుల ఫొటోలు మారాయన్నారు. పోలింగ్ కొనసాగిస్తామని, దీనిపై ఎన్నికల కమిషనకు నివేదికలు పంపుతున్నామని భన్వర్‌లాల్ తెలిపారు.