'భన్వర్ లాల్ ఎవరి మాట వినరు' | Bhanwar lal not endorsing any particular political party | Sakshi
Sakshi News home page

'భన్వర్ లాల్ ఎవరి మాట వినరు'

Published Fri, May 9 2014 3:18 PM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM

'భన్వర్ లాల్ ఎవరి మాట వినరు' - Sakshi

'భన్వర్ లాల్ ఎవరి మాట వినరు'

హైదరాబాద్ : ఎన్నికల కమిషన్ రాజ్యాంగబద్ధ సంస్థ అని ఎన్నికల కమిషన్పై విమర్శలు చేయటం తగదని ఎన్నికల నిఘా వేదిక సభ్యులు అన్నారు. ఎన్నికల నిఘా వేదిక సభ్యులు శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ను కలిశారు. అనంతరం  నిఘా వేదిక సభ్యులు మాట్లాడుతూ భన్వర్ లాల్ ఎవరి మాట వినే వ్యక్తి కాదని, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గరన్నారు. తమ మాట చెల్లుబాటు కాలేదనే కొందరు వ్యక్తులు భన్వర్ లాల్పై విమర్శలు చేస్తున్నారన్నారు.

ఓటమికి కారణాలు వెతుక్కునే పనిలో భాగంగానే ఎన్నికల కమిషన్ను విమర్శిస్తున్నారని ఎన్నికల నిఘా వేదిక సభ్యులు వ్యాఖ్యానించారు. గతంలో పోలిస్తే ఈసారి ఎన్నికలు చాలా ప్రశాంత వాతావరణంలో జరిగాయని, అందుకు భన్వర్ లాల్, ఎన్నికల కమిషన్ను అభినందిస్తున్నామని తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement