'కౌంటింగ్ అయ్యేవరకూ కామ్గా ఉండండి' | election watch organization members meets bhanwar lal | Sakshi

'కౌంటింగ్ అయ్యేవరకూ కామ్గా ఉండండి'

May 9 2014 2:58 PM | Updated on Sep 17 2018 6:08 PM

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్తో ఎన్నికల నిఘా వేదిక సభ్యులు శుక్రవారం భేటీ అయ్యారు.

హైదరాబాద్ : రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్తో ఎన్నికల నిఘా వేదిక సభ్యులు శుక్రవారం భేటీ అయ్యారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై ఉన్న కేసులు పరిష్కరించేందుకు ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు విజ్ఞప్తి చేశారు. క్షేత్రస్థాయిలో మరిన్ని తనిఖీ బృందాలు ఏర్పాటు చేసి నగదు, మద్యం ప్రభావాన్ని నివారించాలని వారు కోరారు.

ఓటర్ల జాబితాలో కనిపించిన లోపాలను సంపూర్ణంగా ప్రక్షాళన చేయాలన్నారు. ఓటర్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యేవరకు పార్టీ నేతలందరూ సంయమనం పాటించాలని సూచించారు. చట్ట వ్యతిరేకంగా నడుస్తున్న బెల్టు షాపులను ఎన్నికల సందర్భంగా మూసివేశారని, వాటిని శాశ్వతంగా మూసివేసేలా చర్యలు చేపట్టాలని భన్వర్ లాల్ను కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement