మాది డేగకన్ను | Bhanwar Lal gives special interview with sakshi on Elections process | Sakshi
Sakshi News home page

మాది డేగకన్ను

Published Sun, Mar 23 2014 2:08 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM

మాది డేగకన్ను - Sakshi

మాది డేగకన్ను

భన్వర్ లాల్.. ఇప్పుడు రాష్ట్రంలో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. పట్టి పట్టి, పట్టుదలగా తెలుగు మాట్లాడే ఈ సీనియర్ ఐఏఎస్ అధికారి రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల క్రతువుకు సారథి. 2010 నవంబర్‌లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా బాధ్యతలు చేపట్టి నప్పటి నుంచి పలు ఉప ఎన్నికలను సమర్థంగా నిర్వహించి తానేమిటో నిరూపించుకున్నారు. ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో వాటికి సంబంధించి పలు అంశాలపై ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ...  
 
 బోగస్‌పై వేటు
 ఇప్పటిదాకా 33 లక్షల బోగస్, డూప్లికేట్ ఓట్లను తొలగించాం. ఒకరికి రెండు, మూడు ఓట్లుంటే వాటిని ఏరేసే సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేశాం. పోలింగ్ సమయానికి ఆయా పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఆచూకీ లభించని, చనిపోయిన, డూప్లికేట్ ఓటుగా అనుమానవుున్న జాబితాను ప్రత్యేకంగా ఆయా ఎన్నికల అధికా రులకు అందజేస్తాం.
 
 2014 సార్వత్రిక ఎన్నికల్లో మునుపెన్నడూ లేనంతగా యువత భాగస్వామ్యం కానుంది. ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రవూలు నిర్వహించి వురీ 18 ఏళ్లు నిండిన వారంతా ఓటర్లుగా నమోదు చేరుుంచుకునేలా శ్రద్ధ తీసుకుంది. రాష్ట్రంలో కూడా ఇఅందుకు ఎంతో కృషి చేశాం. ఓటర్లుగా నమోదై, ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య నిర్మాణంలో భాగస్వాములు కావాలంటూ విసృ్తతంగా ప్రచారం చేశాం. విద్యా సంస్థల యాజమాన్యాలు, యూనివర్సిటీలు ఇందుకు పూర్తి సహకారం అందించాయి. స్వచ్ఛంద సంస్థలతో పాటు మీడియా కూడా లక్ష్య సాధనలో తోడ్పడింది. ‘ఆన్‌లైన్’ సదుపాయుం ఓటర్ల నమోదు ప్రక్రియను వురింత సులభతరం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 70 లక్షల మంది కొత్త ఓటర్లు నమోదైతే, వారిలో ఏకంగా 42 లక్షల మంది 18-21 ఏళ్ల వారే!
 
 ఎన్నికల అక్రమాలు, హింసపై డేగ కన్ను
 రిగ్గింగ్, ఈవీఎంల ధ్వంసం వంటివి జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నాం. రాష్ట్రంలో మొత్తం 7 వేల పోలింగ్ బూత్‌లుంటే వాటిలో 95 శాతం ఇప్పటికే బీబిఎస్‌ఎన్‌ఎల్ మొబైల్ నెట్‌వర్క్ పరిధిలో ఉన్నాయి. మార్చి నెలాఖరు లోపు మరో 275 టవర్లను ఏర్పాటు చేస్తావుని బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులు తెలిపారు. అప్పుడు దాదాపు 100 శాతం పోలింగ్ స్టేషన్లు బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్ పరిధిలోకి వస్తాయి. ఒకటీ అరా బూత్‌లు రాకపోతే అక్కడ తాత్కాలిక టవర్ల ఏర్పాటుకు బీఎస్‌ఎన్‌ఎల్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇక పోలింగ్ జరిగే అన్ని కేంద్రాల్లోనూ పోలింగ్ ప్రక్రియ ముగిసేదాకా ‘లైవ్ వెబ్ టెలికాస్టింగ్’ ఉంటుంది. ఒక ‘ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్‌వో) కార్యాలయం పరిధిలో ఉన్న అన్ని బూత్‌లలోనూ పోలింగ్ ప్రక్రియ తీరుతెన్నులను ఈఆర్‌వో కార్యాలయంలోని కంప్యూటర్‌లో లైవ్ వెబ్ టెలికాస్టింగ్ ద్వారా చూసుకోవచ్చు. ఎవరు నిబంధనలు అతిక్రమించినా ఇట్టే తెలిసిపోతుంది. పోలింగ్ అక్రమాలకు పాల్పడే అభ్యర్థులపై అనర్హత వేటు లాంటి తీవ్రమైన చర్యలుంటాయి.
 
 డబ్బు, మందుపై ఉక్కుపాదం
 విచ్చలవిడి డబ్బు, మద్యం పంపిణీకి అడ్డుకట్ట వేసేందుకు కూడా విసృ్తత ఏర్పాట్లు చేస్తున్నాం. నియంత్రణ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు ఓటర్లను చైతన్య పరిచే ద్విముఖ వ్యూహం అమలు చేస్తున్నాం. వాటి రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి నియోజకవర్గ పరిధిలో పూర్తి భద్రతతో కూడిన 3, 4 చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నాం. ఇక డబ్బు ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు బ్యాంకుల సహకారవుూ తీసుకుంటున్నాం. అనుమానాస్పద ఆన్‌లైన్ లావాదేవీలపై కన్నేసి ఉంచాం. పోలింగ్‌కు 48 గంటల ముందు అన్ని వుద్యం దుకాణాలనూ మూసేయిస్తాం. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఎక్కడా బెల్టు షాపులు లేకుండా చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాం. ప్రతి దుకాణానికీ గతేడాది ఈ నెలలో అది ఎంత వుద్యం విక్రరుుంచిందో ఈసారి కూడా అంతే సరఫరా చేయూలని, ఒక్క బాటిల్ కూడా అదనంగా ఇవ్వరాదని అధికారులను ఆదేశించాం. పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు సరిహద్దుల్లో ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నాం.
 
 తొలిసారిగా తిరస్కరణ ఓటు
 ఇప్పటిదాకా ఓటర్లు ఎవరో ఒక అభ్యర్థికి విధిగా ఓటేయూల్సి వచ్చేది. కానీ తన ఓటుకు వారిలో ఎవరూ అర్హులు కారని భావిస్తే తిరస్కరణ ఓటు వేసే అవకాశాన్ని తొలిసారిగా ఈ ఎన్నికల్లో కల్పించాం. అందుకోసం ‘నన్ ఆఫ్ ద అబౌ’ (పై వారెవరూ కాదు-నోటా) అన్న బటన్ నొక్కితే చాలు. ఈ బటన్ ఓటింగ్ యుంత్రం (ఈవీఎం)లో చివరన ఉంటుంది. వుంచి అభ్యర్థిని పెట్టకపోతే ఓటర్లు తిరస్కరించే ప్రవూదవుుంది గనుక వారి ఎంపికలో పార్టీలు మరింత జాగ్రత్తగా ఉంటాయని భావిస్తున్నాం.
 
 వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు
 సుప్రీంకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో వికలాంగులు చక్రాల కుర్చీలో వచ్చేందుకు వీలుగా ప్రతి పోలింగ్ స్టేషన్‌లోనూ విధిగా ‘ర్యాంప్’ ఉండాలి. కేవలం నాలుగైదు ఓట్లున్న చోట కూడా ఇది తప్పనిసరి. ఆ మేరకు ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నాం. అలాగే అంధ ఓటర్ల కోసం ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ బ్రెయిలీ ఈవీఎంలను ఏర్పాటు చేస్తున్నాం. దీనివల్ల ఇతరుల సాయం లేకుండా వారే స్వయుంగా ఓటేసుకునే వీలుంటుంది. వికలాంగులు, వృద్ధులు, గర్భిణులు, పసిపిల్లల తల్లులు క్యూలో నిల్చునే పని లేకుండా నేరుగా వెళ్లి ఓటేసేందుకు అనువుతించాల్సిందిగా సిబ్బందిని ఆదేశించాం. ఈసారి పోలింగ్ తేదీకి వారం ముందే ప్రతి ఓటరుకూ ఫొటోతో కూడిన ఓటర్ స్లిప్పులను ఇంటింటికీ వెళ్లి అందజేస్తాం.
 
 కనీస సౌకర్యాలు
 పోలింగ్ బూత్‌లలో ఓటర్లకు, పోలింగ్ సిబ్బందికి కనీస సౌకర్యాల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. ఈసీ అదేశాల మేరకు ఈ దిశగా కలెక్టర్లకు నిర్దిష్ట సూచనలు చేశాం. తాగునీరు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, క్యూలో నిలుచునే ఓటర్లకు నీడ కల్పించడం తప్పనిసరి చేశాం. కరెంటు లేకపోతే జనరేటర్ వంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించాం.
 
 సిబ్బందికి కాస్త అసౌకార్యం అనివార్యం
 పోలింగ్ సిబ్బందికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. వారు పోలింగ్‌కు ముందు రోజు సాయంత్రానికే పోలింగ్ స్టేషన్‌కు చేరుకుని ఒక రాత్రి అక్కడ నిద్రించాల్సి ఉంటుంది. ఎన్ని ఏర్పాట్లు చేసినా, ఇంత పెద్ద క్రతువులో అక్కడక్కడా ఉద్యోగులకు, ముఖ్యంగా మహిళా సిబ్బందికి ఒకటీ అరా ఇబ్బందులు ఎదురవవచ్చు. పైగా అవసరమైనప్పుడు మహిళా ఓటర్లతో తగిన రీతిలో వ్యవహరించేందుకు అనువుగా ఈసీ నిబంధన మేరకు ప్రతి బూత్‌లోనూ తప్పనిసరిగా కనీసం ఒక మహిళా ఉద్యోగి ఉండాలి. కాబట్టి వారిని మారుమూల ప్రాంతాలకు పంపకుండా ఉండటం సాధ్యం కాదు. అందుకే వుహిళా సిబ్బంది పరిస్థితిని అర్థం చేసుకుంటారని, ఐదేళ్లకొక్కసారి ఒక్క రోజు కలిగే ఈ అసౌకార్యాన్ని భరించి సహకరిస్తారని ఆశిస్తున్నాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement