హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికల ఘట్టం ముగిసింది. పది జిల్లాల్లో 17 లోక్ సభ, 119 అసెంబ్లీ నియోజక వర్గాలకు పోలింగ్ నిర్వహించారు. మే 16 న కౌంటింగ్ నిర్వహించనున్నారు. తెలంగాణలో దాదాపు 72 నుంచి 75 శాతం పోలింగ్ నమోదు అయినట్ల సమాచారం. సాయంత్రం ఐదు గంటలకల్లా పది శాసన సభ నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. ఇతర నియోజక వర్గాల్లో ఆరు గంటల వరకు పోలింగ్ జరిగింది. పోలింగ్ సమయం ముగిసేటప్పటికి క్యూలో ఉన్నవారందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తామని భన్వర్ లాల్ చెప్పారు. ఐదు గంటలకు వరకూ జిల్లాల వారీగా నమోదైన పోలింగ్ శాతం వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
నిజామాబాద్- 67 శాతం
కరీంనగర్ -67
మెదక్ -74
రంగారెడ్డి- 58
హైదరాబాద్-53
మహబూబ్‌నగర్- 69
నల్లగొండ -74
వరంగల్ -74
ఖమ్మం -75
ఆదిలాబాద్- 71
తెలంగాణలో 72-75 శాతం పోలింగ్
Published Wed, Apr 30 2014 8:44 PM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
Advertisement