అడగండి చెబుతా..
ఓటరు సందేహాలకు ఈసీ సమాధానాలు
ఎన్నికల సమయంలో ఎన్నెన్నో ప్రశ్నలు. ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు.. కార్డులో తప్పులు.. ఉద్యోగుల ఇబ్బందులు.. వేలిపై సిరా మరకలు.. ఇంకా ఎన్నో సందేహాలు.. ఇలాంటి వాటికి పరిష్కార మార్గాలను భన్వర్‌లాల్ పత్రికా ముఖంగా మీకు తెలియ జేస్తారు. మీ ప్రశ్నలు మాకు పంపండి
- ఎలక్షన్ సెల్, సాక్షి, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్,
లేదా ్election@sakshi.comకు మెయిల్ చెయ్యండి.
మేం ఓటరు లిస్టులో పేరు నమోదుకు దరఖాస్తు చేసుకున్నాము. మాకు ఇంతవరకూ ఓటర్ గుర్తింపు కార్డు రాలేదు. ఎన్నికల్లో ఓటు వేయడం ఎలాం?
- రామలింగాచారి, దేవరపల్లి లావణ్య, రవితేజ, ఫరూక్, పుట్ట లత, హైదరాబాద్
ఓటర్ గుర్తింపు కార్డులవిషయంలో ఆందోళన చెందాల్సిన పని లేదు. పోలింగ్‌కు వారం ముందే మా సిబ్బంది మీ ఇళ్లవద్దకు వచ్చి ఓటర్ స్లిప్పులు ఇస్తారు. ఆ సమయంలోనే మీకు ఓటర్ గుర్తింపు కార్డులు కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం. ఒక వేళ ఓటరు గుర్తింపు కార్డు లేకపోయినా మా సిబ్బంది ఇచ్చే ఓటర్ స్లిప్పులు తీసుకెళ్లి ఓటు వేయవచ్చు. ఒక వేళ స్లిప్పులు కూడా అందక పోతే మీకు సంబంధించిన రేషన్ కార్డు, డ్రైవింగ్ లెసైన్స్, ఆధార్ కార్డు లాంటి గుర్తింపు కార్డులు చూపి ఓటు వేయవచ్చు. కాకపోతే ఓటర్ల జాబితాలో మీ పేరు ఉండటం ముఖ్యం.