కృష్ణా జిల్లా అధికారులపై సీఈవో భన్వర్‌లాల్ ఫైర్
కృష్ణా జిల్లా అధికారులపై సీఈవో భన్వర్‌లాల్ ఫైర్
Published Wed, May 7 2014 4:25 PM | Last Updated on Tue, Aug 14 2018 4:24 PM
విజయవాడ: విజయవాడలో పట్టుబడ్డ టీడీపీ నేతల డబ్బు వ్యవహారంలో విచారణ జాప్యంపై కృష్ణ జిల్లా అధికారులపై సీఈవో భన్వర్‌లాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
3 కోట్ల రూపాయలు పట్టుబడినట్టు తన వద్ద పక్కా సమాచారం ఉందని అధికారులను భన్వర్ లాల్ నిలదీశారు. పట్టుబడిన డబ్బు వ్యవహారంపై మీరెందుకు విచారణ వేగవంతం చేయడంలేదని భన్వర్ లాల్ నిలదీశారు.
ఈ వ్యవహారంలో బాధ్యులైన నేతలను వదిలిపెట్టొద్దని, కేసు నమోదు చేయాలని భన్వర్‌లాల్ ఆదేశించారు. ఈ కేసులో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని భన్వర్ లాల్ హెచ్చరించారు. విజయవాడ సిద్ధార్థ అకాడమీ కేంద్రంగా కోట్ల రూపాయల డంప్ బయటపడిన సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement