ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చీరాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన ఆదివారమిక్కడ మాట్లాడుతూ.. ‘చంద్రబాబు మీద 17 కేసులు ఉన్నాయి. ఓటుకు నోటు కేసులో ఆయన ముద్దాయి. నాపై ఉన్న కేసులు ప్రజా ఉద్యమంలో జరిగినప్పుడు పెట్టినవి. చంద్రబాబు పిరికివాడు...అవకాశవాది. కేసీఆర్ కేసు పెడితే చంద్రబాబు ఆంధ్రాకు పారిపోయి వచ్చాడు.