మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మాట్లాడుతూ.. టీడీపీ ప్రజాధనాన్ని దోచుకునే ఓ సంస్థ అని విమర్శించారు. రాజధాని భూముల పేరుతో లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారని అన్నారు. అచ్చెన్నాయుడు, బొండా ఉమాలను అడ్డం పెట్టుకుని చంద్రబాబు కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. ఫోర్త్ ఎస్టేట్‌గా నిలువాల్సిన మీడియా విలువలను ఎల్లో మీడియా నాశనం చేసిందన్నారు. ఇంట్లో ఉన్న విద్యావంతులైన పిల్లల ద్వారా ప్రజలు రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవాలను తెలుసుకోవాలన్నారు. తెలుగుదేశం డ్రామా కంపెనీ మూసివేసే టైమ్ వచ్చిందని అభిప్రాయపడ్డారు.