
'ఈనెల 31 వరకు అనుసంధానం'
హైదరాబాద్: తెలంగాణలో 76 శాతం, ఏపీలో 84 శాతం ఓటరు గుర్తింపుకార్డులతో ఆధార్ కార్డు అనుసంధానం చేశామని ఎన్నికల ప్రత్యేకాధికారి భన్వర్ లాల్ తెలిపారు. రంగారెడ్డి, హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో ఆధార్ అనుసంధానం దాదాపు పూర్తయిందని చెప్పారు. ఏపీలో ప్రకాశం, కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి, వైఎస్సార్ జిల్లాల్లో వంద శాతం అనుసంధానం జరిగిందన్నారు. ఈ విషయంలో విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలు వెనుకబడి ఉన్నాయన్నారు.
ఆధార్, ఓటర్ కార్డు అనుసంధానం ఈనెల 31 వరకు కొనసాగిస్తామని ప్రకటించారు. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జూన్ లో జరుగుతాయని తెలిపారు. తెలంగాణలో 12, ఏపీ 13 స్థానాలు ఖాళీగా ఉన్నాయని భన్వర్ లాల్ వెల్లడించారు.