హైదరాబాద్ : రాష్ట్రంలో మొత్తం 6,24,32,064 మంది ఓటర్లుగా తేలారు. అందులో రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 50,14,064మంది ఓటర్లు ఉండగా, విజయ నగరం జిల్లాలో అతి తక్కువగా 16,88,509మంది ఓటర్లుగా నమోదయ్యారు. మొత్తం 69,014 పోలింగ్ స్టేషన్లను ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది.
రంగారెడ్డి జిల్లాలోనే ఎక్కువగా 4,469 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా, నిజామాబాద్ జిల్లాలో 2,005 అతి తక్కువగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్ లాల్ మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు.