లష్కర్ ఎన్నికలకు 20 వేల మంది సిబ్బంది: అనురాగ్ శర్మ
ఏప్రిల్ 30 తేదిన నగరంలో జరిగే ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు భారీ సంఖ్యలో భద్రతా సిబ్బందిని నియమించామని...
హైదరాబాద్: ఏప్రిల్ 30 తేదిన నగరంలో జరిగే ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు భారీ సంఖ్యలో భద్రతా సిబ్బందిని నియమించామని పోలీస్ కమిషనర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లో తొలి విడుతగా నగరంలో రెండు పార్లమెంట్ స్థానాలకు, 15 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.
శాంతియుత వాతావరణంలో ఎన్నికలను నిర్వహించేందుకు 20 వేల భద్రతా సిబ్బంది, 14 వేల సిటీ పోలీసులు, ఇంకా 37 కంపెనీల సెంట్రల్ పారా మిలిటరీ దళాలు, 8 కంపెనీల ఏపీఎస్పీ సిబ్బందిని నియమించినట్టు అనురాగ్ శర్మ తెలిపారు.
ఓటర్లు పూర్తి స్వేచ్చ, శాంతియుత వాతావరణం మధ్య ఓటు హక్కును వినియోగించుకుంటారనే విశ్వాసాన్ని అధికారులు వ్యక్తం చేశారు. 3442 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో 17 పార్లమెంట్ స్థానాలకు, 119 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 30 తేదిన ఎన్నికలు నిర్వహించనున్నారు.