కలెక్టరేట్,న్యూస్‌లైన్: ఈ నెల 16వ తేదీన చేపట్టనున్న ఓట్ల లెక్కింపునకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ జిల్లా ఎన్నికల అధికారులను, రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నివేదికలు జాప్యం లేకుం డా వెంటనే పంపించాలని సూచించారు. శుక్రవారం జిల్లా ఎన్నికల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మొదటి విడత జరిగిన ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన సమాచారాన్ని ఆయా పట్టికలలో పూర్తి వివరాలతో సమర్పించాలని సూచిం చారు.
మొదటి విడతగా పది జిల్లాల్లో జరిగిన పోలిం గ్‌కు సంబంధించి అన్ని వివరాల సమాచారాన్ని త్వర గా సమర్పించాలని అధికారులకు తెలియజేశారు. ఆ యా జిల్లాలో వినియోగించిన వెబ్ కెమెరాలను ఈనెల 7వ తేదీన జరగనున్న పోలింగ్ కోసం వెబ్ కెమెరాలను వారికి కేటాయించిన జిల్లాలకు పంపించాలని జిల్లా ఎన్నికల అధికారులకు సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పి.ఎస్.ప్రద్యుమ్న మా ట్లాడుతూ అన్ని నివేదికలు పంపిస్తున్నట్లు తెలిపారు. కౌంటింగ్ కోసం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అసిస్టెంట్ అధికారి, డీఆర్వో రాజశేఖర్, సాంఘిక సంక్షేమ శాఖ జేడీ కాలేబ్, ఎంసీఎంసీ నోడల్ అధికారి పవన్‌కుమార్, కలెక్టరేట్ పరిపాలనాధికారి రాజేశ్వర్ పాల్గొన్నారు.
ఓట్ల లెక్కింపునకు సిద్ధంకండి
Published Sat, May 3 2014 2:20 AM | Last Updated on Sat, Sep 2 2017 6:50 AM
Advertisement
Advertisement