
సాక్షి, హైదరాబాద్: నగరంలోని భరత్‌నగర్ బ్రిడ్జ్‌పై కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి బ్రిడ్జ్‌పై నుంచి కిందికి దూసుకుపోయింది. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున 2.45 గంటల సమయంతో జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని స్థానికులు సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరుపై దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులు బోరబండ పండిట్ నెహ్రూనగర్‌కి చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి గురైనవారు సోమవారం రాత్రి 10 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లారని వారి బంధువులు పోలీసులకు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment