ముంబై-గోవా హైవేపై ఫ్లై ఓవర్లు | flyovers on Mumbai-Goa highwa | Sakshi
Sakshi News home page

ముంబై-గోవా హైవేపై ఫ్లై ఓవర్లు

Published Sun, Dec 14 2014 10:08 PM | Last Updated on Sat, Sep 2 2017 6:10 PM

flyovers on Mumbai-Goa highwa

సాక్షి, ముంబై: ముంబై-పుణే నేషనల్ హైవేపై మరో 10 చోట్ల ఫ్లై ఓవర్‌లను నిర్మించడానికి అధికారులు నిర్ణయించారు. మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ (ఎమ్మెస్సార్డీసీ) ఈ హైవేపై ఎక్కువగా ట్రాఫిక్ జామ్‌లు చోటుచేసుకుంటున్న 10 జంక్షన్లను గుర్తించింది. దీంతో ఈ స్థలాలలో బ్రిడ్జిలను నిర్మించేందుకు ఎమ్మెస్సార్డీసీ యోచిస్తోంది. దీంతో వాహన దారులు త్వరగా తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చని ఎమ్మెస్సార్డీసీ అధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రాజెక్టును రూ.300 కోట్ల అంచనావ్యయంతో చేపట్టనున్నట్లు తెలుస్తోంది.ఈ సందర్భంగా ఎమ్మెస్సార్డీసీ చీఫ్ ఇంజినీర్ అరుణ్ డియోధర్  మాట్లాడుతూ.. పాత ముంబై-పుణే హైవేపై 10 రద్దీ గా ఉండే జంక్షన్లను గుర్తించామన్నారు. ఇక్కడ తరచూ ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తుతున్నాయన్నారు.

దీంతో వాహన చోదకులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా వాహన కదలికలు సులభంగా జరిగే విధంగా ఆయా ప్రాంతాల వద్ద బ్రిడ్జిలు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నామన్నారు. ఈ నిర్మాణ పనులు ప్రారంభం కాకముందే ఓ సూపర్ విజన్ ఇంజినీర్‌ను నియమించాలని భావిస్తున్నామన్నారు. దీని ద్వారా ఈ నిర్మాణ పనులు త్వరగా పూర్తి అవుతాయని ఆయన పేర్కొన్నారు. ఇందుకు గాను టెండర్లను కూడా ఆహ్వానించామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో హైవేపై ట్రాఫిక్ జామ్‌లు ప్రధాన సమస్యలుగా తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఘాట్ సెక్షన్లలో ఈ ట్రాఫిక్ జామ్ సమస్యలు వస్తున్నాయి. లోనావాలా, పుణే చేరురోవడానికి చాలా మంది వాహనదారులు ఎన్‌హెచ్-4 రహదారిని ఉపయోగిస్తున్నారు. ఇక్కడ తక్కువ టోల్ చెల్లించాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా, హైవేపై రద్దీ ఎక్కువగా ఉండే 14 స్థలాలను ఎమ్మెస్సార్డీసీ గుర్తించి, వాటిలో 10 స్థలాలను ఎంచుకుంది.

ఈ బ్రిడ్జిలు 300 నుంచి 500 మీటర్ల పొడవు ఉంటాయి. ఈ మార్గంలో ఉంటున్న చుట్టు పక్కల ప్రాంతాల వారి భద్రతను దృష్టిలో ఉంచుకొని వీటి నిర్మాణం చేపట్టనున్నారు. ఇక్కడ ఉంటున్న వారు హైవేను దాటాలంటే సిగ్నల్ కోసం వేచి ఉండాల్సి ఉంటుంది. సిగ్నల్స్ జంప్ చేసి వెళ్లే కార్ల నుంచి కూడా వీరు రిస్కులో పడతారు. దీంతో జంక్షన్లపై నుంచి ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టడంతో ఈ ప్రాంతాల వారు సురక్షితంగా బ్రిడ్జి కింది నుంచి రోడ్డు దాటవచ్చని అధికారి తెలిపారు. నేషనల్ హైవే-4 మీదుగా పుణే నుంచి ముంబై చేరుకోవాలంటే దాదాపు 4-5 గంటల సమయం పడుతోంది. ఈ నిర్మాణాలు పూర్తి కాగానే ప్రయాణ సమయం మూడు గంటలు పడుతుందని అధికారి తెలిపారు. అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి మూడు ఏళ్లు పడుతోందని అధికారి తెలిపారు.
 
గోవా హైవే వెడల్పునకు గ్రీన్‌సిగ్నల్
ముంబై-గోవా హైవేను వెడల్పు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. నవంబర్ చివరి వారంలో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ 20 కి.మీ. మేర ఈ హైవేను వెడల్పు చేసే ప్రతిపాదనను క్లియర్ చేసింది. ముంబై-గోవా మొదటి 84 కి.మీ మేర పన్వేల్-ఇందాపూర్ మధ్యలో రోడ్డును వెడల్పు చేసే ప్రతిపాదన ఏడాదిన్నర క్రితమే పూర్తి అయింది. కానీ మరో విడత 25 కి.మీ మేర ప్రతిపాదన గత మూడేళ్ల నుంచి పెండింగ్‌లో ఉంది. పర్యావరణం నుంచి ఈ ప్రతిపాదనకు అనుమతి లభించడంలో జాప్యం జరిగింది. అంతేకాకుండా భూసేకరణ విషయంలో  కూడా తీవ్ర ఇబ్బందులు తలెత్తాయని అధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు పర్యవరణం నుంచి అనుమతి లభించడం ఎంతో ముఖ్యమైందిగా పేర్కొన్నారు.

మిగితాది ఇందాపూర్-గోవా సరిహద్దు వరకు ఉన్న 350 కి.మీ వరకు టెండర్ల కోసం సిద్ధంగా ఉంది. ఇందుకు సంబంధించిన స్థల సేకరణ, అనుమతులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి అయిన వెంటనే పనులు ప్రారంభిస్తామని అధికారి తెలిపారు. ఈ పనులు ప్రారంభించేందుకు మరో ఏడాది పడుతుందని అధికారి తెలిపారు. అనంతరం  పనులు పూర్తి కావడానికి మరో మూడు ఏళ్లు పడుతోందన్నారు. ఈ గోవా హైవేను నాలుగు లేన్లతోపాటు డివైడర్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. అదేవిధంగా మార్గం ఇరువైపుల సురక్షితమైన సేఫ్టీ వాల్స్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ హైవేను వెడల్పు చేయడంలో ఎంత జాప్యం జరుగుతోందో అంత ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. ప్రమాదాలు జరిగినప్పుడల్లా ట్రాఫిక్‌ను పుణే-కొల్హాపూర్  మార్గం నుంచి గోవాకు దారి మళ్లించాల్సి ఉంటుంది.

2006 జనవరి నుంచి 2012 డిసెంబర్ వరకు గోవా హైవేపై 7,721 ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. అదేవిధంగా 1,731 మరణాలు సంభవించాయి. దీంతో ముంబై నుంచి సూరత్, నాసిక్, పుణేల మార్గాలను వెడల్పు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎంతో ముఖ్యమైన ముంబై-గోవా మార్గాన్ని వెడల్పు చేయడంలో అధికారులు ప్రదర్శిస్తున్న తీవ్ర జాప్యంపై నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్‌హెచ్-17 పై ఎలాంటి ట్రామే కేర్ సెంటర్ లేదు. అంతేకాకుండా అన్ని సదుపాయాలతో కూడుకొని ఉన్న అంబులెన్స్ కూడా లేదన్నారు. దీంతో ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను త్వరగా చికిత్స నిమిత్తం తరలించడంలో జాప్యం జరుగుతుండడంతో మరణా లు ఎక్కువగా సంభవిస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement