గురుగ్రామ్ : హర్యానాలోని గురుగ్రామ్‌లో శనివారం అర్థరాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి సోహ్నా రోడ్డులో 6 కిమీ మేర నిర్మిస్తున్న ఫ్లైఓవర్ ఆకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మాత్రమే గాయపడ్డారని.. వారిని ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఫ్లైఓవర్ శిధిలాలను తొలగించే పనులు జరుగుతున్నాయి. ఘటన జరిగిన సమయంలో రోడ్డుపై ట్రాఫిక్ లేని కారణంగా పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారని అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ అమన్ యాదవ్ తెలిపారు.
రాజీవ్ చౌక్ నుంచి గురుగ్రామ్‌లోని సోహ్నా వరకు 6కిమీ మేర ఈ ఫ్లైఓవర్‌ను రెండు వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టును ఓరియంటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ చేపట్టింది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఫ్లైఓవర్‌లోని ఎలివేటెడ్ రోడ్డులోని కొంత భాగం కూలిపోయిందని కంపెనీ ప్రాజెక్ట్ హెడ్ శైలేష్ సింగ్ తెలిపారు. కాగా ఈ ఫ్లైఓవర్ నిర్మాణ నాణ్యతపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment