సాక్షి, సిటీబ్యూరో: గతంలో అరుదుగా మాత్రమే నిర్మాణమయ్యే ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నాలుగైదేళ్లుగా వేగం పుంజుకున్నాయి. బహుశా ఎవరూ ఊహించని విధంగా ఎస్సార్‌డీపీ పథకంలో భాగంగా పనులు పూర్తవుతున్నాయి. ఈ పథకంలో ఆయా జంక్షన్లలో ట్రాఫిక్ చిక్కుల పరిష్కారం కోసం వివిధ ప్యాకేజీలుగా పనులు చేపట్టారు. ఫస్ట్‌ఫేజ్‌లో నాలుగో ప్యాకేజీలోని నాలుగు జంక్షన్లలో ట్రాఫిక్ పరిష్కారానికి చేపట్టిన ఆరు పనులు పూర్తవడంతో ఎస్సార్‌డీపీ పనుల్లో ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చు. వీటితో ఆయా ప్రాంతాల వారికి, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులకు ఎంతోసమయం కలిసివస్తోంది. ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌ల వివరాలు ఇవీ..
రాజీవ్‌గాంధీ జంక్షన్ ఫ్లైఓవర్..
మెజిస్టిక్ షాపింగ్‌మాల్ నుంచి మలేషియన్ టౌన్‌షిప్ వరకు టూ వే ఫ్లై ఓవర్ అందుబాటులోకి రావడంతో కూకట్‌పల్లి వైపు నుంచి ఉదయం హైటెక్ సిటీకి వెళ్లేవారికి, తిరిగి సాయంత్రం ఇళ్లకు చేరుకునేందుకు ట్రాఫిక్ చిక్కులు తగ్గాయి.
Comments
Please login to add a commentAdd a comment