Underpass construction
-
ప్రభుత్వం మారినా అదే తీరు.. పబ్లిక్ కి శాపంగా లింగంపల్లి అండర్ పాస్ బ్రిడ్జి..
-
Underpass: బంజారాహిల్స్ టు జూబ్లీహిల్స్!
మహానగరంలో ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు కొత్త ప్రభుత్వం రంగంలోకి దిగింది. ట్రాఫిక్ రద్దీ అత్యధికంగా ఉన్న జంక్షన్లలో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేంచాలని, ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్ జంక్షన్లలో తలెత్తుతున్న వాహన రద్దీని అదుపులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్‌పై జీహెచ్ఎంసీ, పోలీసులతో సమీక్ష నిర్వహించిన సీఎం నగరంలోనే అత్యధిక రద్దీతో రికార్డుల్లోకెక్కిన జూబ్లీహిల్స్ జంక్షన్‌పై దృష్టిపెట్టాలని సూచించారు. బంజారాహిల్స్: జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్‌రాస్, నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి సంబంధిత అధికారులతో కలిసి నాలుగు రోజుల క్రితం జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు పాటు జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–45, రోడ్డు నెంబర్–36తో పాటు జర్నలిస్ట్ కాలనీ చౌరస్తా, సీవీఆర్ న్యూస్ చౌరస్తా, అగ్రసేన్ చౌరస్తా, విరించి హాస్పటల్ చౌరస్తా, కేబీఆర్ పార్కు చౌరస్తాల్లో రెండు విడతలుగా పర్యటించారు. ► ట్రాఫిక్ ఎక్కడెక్కడ రద్దీగా ఉంటుందో పరిశీలించడమే కాకుండా అందుకు గల కారణాలపై ఆరా తీశారు. ఏమి చేస్తే బాగుంటుందనే దానిపై అప్పటికే ట్రాఫిక్‌పై అధ్యయనం చేసిన అధికారులతో చర్చించి డిజైన్లను పరిశీలించారు. అండర్‌పాస్‌లు.. ఫ్లైఓవర్లు... జీహెచ్ఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన సమన్వయ పర్యటనలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు చౌరస్తా నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు దాటి, రోడ్డు నెంబర్–45 బాలకృష్ణ ఇంటి చౌరస్తా వరకు వెళ్లడానికి అండర్‌పాస్ నిర్మించాలని నిర్ణయించారు. ► ఇందులో భాగంగా అడ్డుగా ఉన్న డ్రైనేజీ, మంచినీటి, వరదనీటి పైప్లైన్లను మళ్లించేందుకు ప్రణాళికలు రూపొందించాలని తీర్మానించారు. ► కేబీఆర్ పార్కులో ఒక్క చెట్టు కూడా నష్టపోకుండా గ్రీన్ ట్రిబ్యునల్ అథారిటీకి లోబడి 1.5 కిలోమీటర్ల మేర ఈ అండర్‌పాస్ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలని ఇంజినీర్లను ఆదేశించారు. దీని ద్వారా బాలకృష్ణ ఇంటివైపు, ఫిలింనగర్ వైపు, రోడ్డు నెంబర్–45 వైపు వాహనదారులు కేబీఆర్ పార్కు నుంచి ఎలాంటి ఆటంకా>లు లేకుండా తేలిగ్గా ముందుకుసాగనున్నారు. ► జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–45 బాలకృష్ణ ఇంటి చౌరస్తా నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు మీదుగా బంజారాహిల్స్ కేబీఆర్ పార్కు వరకు వన్‌వేలో వెళ్లేందుకు ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. సుమారు కిలోమీటరు మేర ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టనున్నారు. ► జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–45 కేబుల్ బ్రిడ్జి ఫ్లైఓవర్ నుంచి వాహనాలు దిగిన తర్వాత ఆ వెంటనే కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్ మీదుగా బంజారాహిల్స్ వైపు వాహనదారులు వెళ్లేందుకు అనువుగా ఈ నిర్మాణం చేపట్టనున్నారు. ఇప్పటికే అటు అండర్‌పాస్, ఇటు ఫ్లైఓవర్ నిర్మాణాల కోసం సంబంధిత ఇంజినీర్లు డిజైన్లు కూడా పూర్తిచేయగా, ఆ మ్యాప్‌లను జీహెచ్ఎంసీ, పోలీసు కమిషనర్లు పరిశీలించారు. ► జర్నలిస్ట్ కాలనీ చౌరస్తాలో ప్రముక పాత్రికేయుడి శిలా విగ్రహం రోడ్డు మధ్యలోకి రావడంతో ఆ విగ్రహాన్ని సెంట్రల్ మీడియన్‌లో ఏర్పాటు చేయాలని ఇప్పటికే జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ప్రతినిధులతో ఓ దఫా చర్చించారు. మరోసారి సంబంధిత ప్రతినిధులతో సంప్రదించి ఈ విగ్రహాన్ని మరింత సుందరంగా చౌరస్తా మధ్యలో నిర్మించాలని నిర్ణయించారు. ► దీని ద్వారా జర్నలిస్ట్ కాలనీ వైపు నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టుకు వెళ్లే వాహనదారులు మరింత తేలికగా ముందుకుసాగనున్నారు. ► కేబీఆర్ జంక్షన్, జూబ్లీహిల్స్ జంక్షన్, జర్నలిస్ట్‌కాలనీ జంక్షన్, జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–45 జంక్షన్, సీవీఆర్ న్యూస్ జంక్షన్, బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–12 అగ్రసేన్ జంక్షన్లలో ఇరుకుగా ఉన్న సెంట్రల్ మీడియన్లను కొంతమర తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. ► నాలుగువైపులా వాహనాలు తేలిగ్గా వెళ్లేందుకు వీలుగా ఈ సెంట్రల్ మీడియన్లను కట్ చేయనున్నారు. 20 సంవత్సరాలు క్రితం అప్పటి ట్రాఫిక్‌కు అనుగుణంగా ఈ చౌరస్తాలు రూపుదిద్దుకోగా, అప్పటి నుంచి ఇప్పటిదాకా చిన్న మార్పు కూడా చేయకుండా ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోగా, రోడ్లు, జంక్షన్ల విస్తరణ కూడా చేపట్టలేదు. ఇన్నాళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం జంక్షన్ల విస్తరణకు ముందుకురావడమే కాకుండా నిధులు కూడా మంజూరు చేయాలని నిర్ణయించింది. ► కేబీఆర్ పార్కు వైపు నుంచి జూబ్లీహిల్స్ చౌరస్తా మీదుగా ఫిలింనగర్ వెళ్లే జూబ్లీహిల్స్ జంక్షన్ మలుపు వద్ద భారీ హైటెన్షన్ స్తంభాలు ఫుట్‌పాత్‌పై అడ్డుగా ఉన్నాయి. ఇక్కడ ఫుట్‌పాత్ కూడా చాలా వెడల్పుగా ఉంది. ఫిలింనగర్ వైపు 2, 3 బస్టాపులు అనవసరంగా నిర్మించారు. ► హైటెన్షన్ స్తంభాలను తొలగించి ఫుట్‌పాత్ వెడల్పును తగ్గించి మూడు బస్òÙల్టర్లను తీసేయడం ద్వారా ఫిలింనగర్ వైపు ప్రీలెఫ్ట్‌లో వాహనదారులు తేలికగా వెళతారని నిర్ణయించారు. ► ఇక కేబీఆర్ పార్కు చుట్టూ ఉన్న పార్కింగ్ స్థలాల్లో మలీ్టలెవల్ పార్కింగ్ సౌకర్యాలు కలి్పంచే దిశలో కూడా అధికారులు చర్చించారు. -
సాహోరే.. వారధులు! పాతబస్తీకే మణిహారాలు
సాక్షి, హైదరాబాద్: ఇప్పటి వరకు ఐటీ కారిడార్లున్న, ఐటీ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు అధిక సంఖ్యలో ఉన్న శేరిలింగంపల్లి, కూకట్పల్లి జోన్లు.. ఐటీ తదితర సంస్థలున్న ఉప్పల్ జోన్, కోర్‌సిటీలోని ఖైరతాబాద్, సికింద్రాబాద్‌లలో ఎస్సార్డీపీ కింద పలు ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం.. ప్రస్తుతం పాతబస్తీ ప్రాంతమైన చార్మినార్ జోన్‌వైపు దృష్టి సారించింది. ఇటీవలే డాక్టర్ అబ్దుల్‌కలాం ఫ్లై ఓవర్ వినియోగంలోకి రాగా.. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వైపు నుంచి కోర్‌సిటీలోకి రాకపోకలు సాగించేవారికి ఉపకరించే రెండు ఫ్లైఓవర్లు త్వరలో పూర్తి కానున్నాయి. వీటిలో ఆరాంఘర్– జూపార్క్ ఫ్లై ఓవర్ వ్యూహాత్మక రహదారుల పథకం (ఎస్సార్డీపీ)లో భాగంగా జీహెచ్ఎంసీ ఇప్పటి వరకు నిర్మించిన అన్ని ఫ్లై ఓవర్లకంటే పెద్దది. ఇటీవలే ప్రారంభమైన షేక్‌పేట ఫ్లై ఓవర్ (పొడవు 2.71 కి.మీ.) కంటే కూడా ఇదే పెద్దది. దీని పొడవు దాదాపు 4 కి.మీ. బహదూర్‌పురా జంక్షన్ వద్ద మరో ఫ్లై ఓవర్ నిర్మిస్తున్నారు. ఈ రెండూ వినియోగంలోకి వస్తే విమానాశ్రయం వెళ్లే వారితోపాటు మహబూబ్‌నగర్ తదితర ప్రాంతాలకు వెళ్లే వారికి, జూపార్క్ సందర్శకులకు, పాతబస్తీ ప్రజలకు సమయం కలిసి వస్తుంది. రెండింటికీ అయ్యే ఖర్చు దాదాపు రూ. 706 కోట్లు. సీఎస్ సోమేశ్‌కుమార్ తనిఖీ ► రెండు ఫ్లై ఓవర్ల నిర్మాణాల్ని వేగవంతం చేసి, నిర్ణీత వ్యవధి కంటే ముందే పూర్తి చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. బహదూర్‌పురా జంక్షన్‌లోని నిర్మాణ పనులను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ► ఆరాంఘర్– జూపార్కు ఫ్లై ఓవర్ పనుల్ని కూడా వీలైనంత త్వరితంగా పూర్తిచేయాలనగా వచ్చే సంవత్సరం మార్చినాటికి పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. ఆస్తుల సేకరణలో ఎదురవుతున్న ఇబ్బందుల్ని సీఎస్ దృష్టికి తేగా.. ఫ్లై ఓవర్ మౌలిక డిజైనింగ్‌కు అంతరాయం కలుగకుండా సేకరించాల్సిన మొత్తం 163 ఆస్తుల్లో కొన్నింటిని మినహాయించాల్సిందిగా సూచించారు. ► సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. బహదూర్‌పురా జంక్షన్ ఫ్లై ఓవర్ ► అంచనా వ్యయం: రూ.69 కోట్లు ► పొడవు: 690 మీటర్లు ► లేన్లు: 6(రెండు వైపులా ప్రయాణం) ► వెడల్పు: 24 మీటర్లు ► ఇరవయ్యేళ్లకు పెరిగే ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టారు. బహదూర్‌పురా జంక్షన్ వద్ద ప్రస్తుతమున్న ట్రాఫిక్ చిక్కులు ఉండవు. సిగ్నల్ ఫ్రీగా సాగిపోవచ్చు. ► దాదాపు 70 శాతం పనులు పూర్తయిన ఈ ఫ్లైఓవర్ ఈ సంవత్సరం అందుబాటులోకి రానుంది. ఆరాంఘర్– జూపార్కు ఫ్లైఓవర్ ► అంచనా వ్యయం: రూ.636.80 కోట్లు ► పొడవు: 4.04 కి.మీ. ► లేన్లు: 6 (రెండు వైపులా ప్రయాణం) ► వెడల్పు: 24 మీటర్లు ► 2037 నాటికి రద్దీ సమయంలో 5210 వాహనాలను పరిగణనలోకి తీసుకొని ఈ ఫ్లైఓవర్‌ను నిర్మిస్తున్నారు. ► ఇది అందుబాటులోకి వస్తే ప్రస్తుతమున్న ట్రాఫిక్ సిగ్నళ్లు తాడ్బన్, దానమ్మహట్స్, హసన్‌నగర్ జంక్షన్ల వద్ద ఎక్కడా ఆగకుండా నేరుగా రయ్‌మని వెళ్లిపోవచ్చు. ► తద్వారా ప్రయాణ సమయం తగ్గడంతోపాటు లూబ్రికెంట్స్, ఇంధన వ్యయం తగ్గుతుంది. వాయు కాలుష్యం తగ్గి, ప్రజలకు ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. వచ్చే సంవత్సరం దీన్ని అందుబాటులోకి తేనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. -
బేఫికర్ జర్నీ
సాక్షి, సిటీబ్యూరో: గతంలో అరుదుగా మాత్రమే నిర్మాణమయ్యే ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నాలుగైదేళ్లుగా వేగం పుంజుకున్నాయి. బహుశా ఎవరూ ఊహించని విధంగా ఎస్సార్డీపీ పథకంలో భాగంగా పనులు పూర్తవుతున్నాయి. ఈ పథకంలో ఆయా జంక్షన్లలో ట్రాఫిక్ చిక్కుల పరిష్కారం కోసం వివిధ ప్యాకేజీలుగా పనులు చేపట్టారు. ఫస్ట్‌ఫేజ్‌లో నాలుగో ప్యాకేజీలోని నాలుగు జంక్షన్లలో ట్రాఫిక్ పరిష్కారానికి చేపట్టిన ఆరు పనులు పూర్తవడంతో ఎస్సార్డీపీ పనుల్లో ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చు. వీటితో ఆయా ప్రాంతాల వారికి, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులకు ఎంతోసమయం కలిసివస్తోంది. ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌ల వివరాలు ఇవీ.. రాజీవ్‌గాంధీ జంక్షన్ ఫ్లైఓవర్.. మెజిస్టిక్ షాపింగ్‌మాల్ నుంచి మలేషియన్ టౌన్షిప్ వరకు టూ వే ఫ్లై ఓవర్ అందుబాటులోకి రావడంతో కూకట్పల్లి వైపు నుంచి ఉదయం హైటెక్ సిటీకి వెళ్లేవారికి, తిరిగి సాయంత్రం ఇళ్లకు చేరుకునేందుకు ట్రాఫిక్ చిక్కులు తగ్గాయి. -
అంబర్పేట్ టు బోడుప్పల్ ఎక్స్‌ప్రెస్ వే
సాక్షి, సిటీబ్యూరో: ఎస్సార్డీపీ (వ్యూహాత్మక రహదారుల పథకం)లో భాగంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. నేషనల్ హైవే, జీహెచ్ఎంసీల భాగస్వామ్యంతో చేపట్టనున్న పనులు ఇంకొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ఫ్లైఓవర్ల నిర్మాణ పనులు జరిగేటప్పుడు సిటీజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దారి మళ్లింపులతో నరకం అనుభవిస్తున్నారు. ఫ్లైఓవర్ల పనులు పూర్తయ్యేందుకు కనీసం రెండేళ్ల సమయం పడుతుండడంతో సుదీర్ఘకాలం ట్రాఫిక్ తిప్పలు తప్పడం లేవు. ఈ నేపథ్యంలో ఫ్లైఓవర్ల పనుల సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు తప్పించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు అవసరమని భావించిన జీహెచ్ఎంసీ... ఆ దిశగా కసరత్తు ప్రారంభించింది. ఫ్లైఓవర్ పనులు పూర్తయ్యేంత వరకు ప్రజలు సాఫీగా ప్రయాణించేందుకు 100–150 అడుగుల మేర విశాలమైన రోడ్లను నిర్మించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉప్పల్, అంబర్పేట్ చేనెంబర్ వద్ద త్వరలో ప్రారంభం కానున్న ఫ్లైఓవర్ల పనుల్ని దృష్టిలో ఉంచుకొని... ఆ మార్గంలో ప్రత్యామ్నాయ రహదారిని నిర్మించేందుకు ఆలోచన చేసింది. ఇందుకుగాను మేయర్, అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి అంబర్పేట్ అలీకేఫ్ నుంచి బోడుప్పల్‌లోని ఏషియన్ సినీస్క్వేర్ మల్టీప్లెక్స్ వరకు 150అడుగుల వెడల్పుతో రహదారిని నిర్మించాలని నిర్ణయించారు. తద్వారా యాదాద్రి, వరంగల్ తదితర ప్రాంతాల నుంచి అంబర్పేట్ మీదుగా కోర్ సిటీలోకి ప్రవేశించేందుకు, తిరిగి వెళ్లేందుకు సదుపాయం కలుగనుంది. దీంతోపాటు మలి దశలో అంబర్పేట్ నుంచి ఎంజీబీఎస్ వరకు మూసీ వెంబడి సమాంతరంగా మరో రహదారిని నిర్మించాలని యోచిస్తున్నారు. తద్వారా అంబర్పేట్, మలక్‌పేట్, మూసారాంబాగ్ తదితర ప్రాంతాల వారికి సదుపాయంగా ఉంటుందని భావిస్తున్నారు. దీనికి ఆస్తుల సేకరణ వంటివి ఉండటంతో ప్రస్తుతానికి అలీకేఫ్ నుంచి ఏషియన్ సినీ స్క్వేర్ వరకు ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించాలని అనుకుంటున్నారు. ఈ మేరకు తగిన ప్రతిపాదనలు, సమగ్ర ప్రాజెక్టు నివేదికను వెంటనే రూపొందించాల్సిందిగా మేయర్ బొంతు రామ్మోహన్ అధికారులకు సూచించారు. అంబర్పేట్, ఉప్పల్ల వద్ద ఫ్లైఓవర్ల పనులు ప్రారంభమయ్యేలోగా ప్రత్యామ్నాయ రహదారి నిర్మాణాన్ని అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు. ఈ ప్రత్యామ్నాయ రహదారికి ఆస్తుల సేకరణ అవసరం లేకపోవడంతో వీలైనంత తొందనగా పనులు చేపట్టనున్నారు. అంబర్పేట్, ఉప్పల్ ఫ్లైఓవర్లకు సంబంధించి ఆస్తుల సేకరణ ప్రక్రియ ముమ్మరం చేశారు. మరోవైపు అలీకేఫ్ నుంచి జిందా తిలస్మాత్ వరకు 80అడుగుల వెడల్పుతో వైట్‌టాపింగ్ రోడ్డునిర్మించనున్నారు. అంబర్పేట్ చేనెంబర్ వద్ద రద్దీ సమయంలో గంట కు 15వేల వాహనాలు వెళ్తుండగా, ఉప్పల్ వద్ద దాదాపు 20వేల వాహనాలు వెళ్తున్నాయి. భవిష్యత్‌లో ఇవి మరింత పెరగనుండడంతో ట్రాఫిక్ రద్దీ పరిష్కారానికి ఈ ప్రాజెక్టులు చేపట్టారు. -
సరితావిహార్ అండర్‌పాస్ ప్రారంభం
సాక్షి, న్యూఢిల్లీ : ఎట్టకేలకు సరితావిహార్ అండర్‌పాస్ వాహనచోదకులకు అందుబాటులోకి వచ్చింది. నోయిడా, ఓఖ్లా మధ్య సరితావిహార్ వద్ద నిర్మించిన 1,090 మీటర్ల పొడవు అండర్‌పాస్‌ను కేంద్ర పట్టణాభివద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు శుక్రవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఢిల్లీ రోడ్లపైరద్దీని తగ్గించడం కోసం ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందని చెప్పారు.2010లో అండర్‌పాస్ నిర్మాణం పూర్తి కావలసి ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం దానిని జాప్యం చేసిందని, ఫలితంగా నిర్మాణ వ్యయం పెరిగిందని ఆయన చెప్పారు. ప్రజల సొమ్ము వృధా కావడం చూసిన తమ ప్రభుత్వం కొద్ది నెలల్లో అనేక సమావేశాలు జరిపి పనులు జరిగేలా చూసిందని మంత్రి చెప్పారు. రానున్న ఎన్నికలకు, అండర్‌పాస్ ప్రారంభోత్సవానికి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. తగ్గిన దూరాభారం ఈ అండర్‌పాస్ వల్ల నోయిడా, ఓఖ్లాల మధ్య ప్రయాణ దూరం కనీసం 8 కిమీలు తగ్గింది. మెట్రో నిర్మాణం కారణంగా ఆశ్రం చౌక్ వద్ద ఎదుర్యే ట్రాఫిక్ జామ్ సమస్యకు కూడా పరిష్కారం లభించింది. బదర్‌పుర్ నుంచి నోయిడాకు వెళ్లే వాహనాలు ఇక ఆశ్రమ్చౌక్కు రానవసరం లేదు. సరితావిహార్ నుంచి ఓఖ్లా వెళ్లడానికి ఇప్పటి వరకు 9 కిమీల దూరం ప్రయాణించవలసి వచ్చేది. ఈఅండర్పాస్ వల్ల ఈ దూరం ఒక కిమీలకు ప్రయాణసమయం 45 నిమిషాల నుంచి 5 నిమిషాలకు తగ్గింది. ఈ అండర్‌పాస్‌లో వచ్చి, వెళ్లేందుకు మూడేసి లేన్ల చొప్పున మొత్తం ఆరు లేన్లు ఉన్నాయి. 5.5 మీ ఎత్తున్న అండర్‌పాస్‌లో నీరు చేరకుండా ఉండడం కోసం మూడు పంపులను ఏర్పాటు చేసినట్లు డీడీఏ ఇంజనీరు చెప్పారు. జాప్యం మిలా.. 2008లో డీడీఏ, రైల్వే కలిసి సరితావిహార్ అండర్‌పాస్ నిర్మించాలని నిర్ణయించాయి. రూ.121 కోట్ల ఖర్చుతో అండర్‌పాస్ నిర్మాణం జరపాలని నిర్ణయించారు. కానీ పనులు మొదలు పెట్టడమే మూడేళ్ల ఆలస్యంగా జరిగింది. ముందనుకున్నట్లుగా 21 నెలల్లో 2013 నాటికి ప్రాజెక్టు పూర్తిచేయలేకపోయారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 242 కోట్ల రూపాయలైంది. ప్రారంభోత్సవం బీజేపీ ఘనత కాదు అండర్‌పాస్ ప్రారంభోత్సవాన్ని బీజేపీ తన ఘనతగా చెప్పుకోవడాన్ని ఓఖ్లా మాజీ ఎమ్మెల్యే ఆసిఫ్ మహ్మద్ ఖాన్ విమర్షించారు. ఓఖ్లాకు ప్రాతినిధ్యం వహిస్తోన్న తనను ప్రారంభోత్సవానికి ఆహ్వానించలేదని ఆయన ఆరోపించారు. అండర్‌పాస్ నిర్మాణానికి కృషి చేసిన తనను పక్కన బెట్టి తూర్పు ఢిల్లీ ఎంపీ మహేష్ గిరీ, దక్షిణ ఢిల్లీ ఎంపీ రమేష్ బిధూడీ ప్రారంభోత్సవ శిలా ఫలకం మీద తమ పేరు కూడా చెక్కించుకున్నారని ఆయన ఆరోపించారు.