మహానగరంలో ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు కొత్త ప్రభుత్వం రంగంలోకి దిగింది. ట్రాఫిక్ రద్దీ అత్యధికంగా ఉన్న జంక్షన్లలో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేంచాలని, ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్ జంక్షన్లలో తలెత్తుతున్న వాహన రద్దీని అదుపులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్‌పై జీహెచ్‌ఎంసీ, పోలీసులతో సమీక్ష నిర్వహించిన సీఎం నగరంలోనే అత్యధిక రద్దీతో రికార్డుల్లోకెక్కిన జూబ్లీహిల్స్ జంక్షన్‌పై దృష్టిపెట్టాలని సూచించారు.
బంజారాహిల్స్: జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్‌రాస్, నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి సంబంధిత అధికారులతో కలిసి నాలుగు రోజుల క్రితం జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు పాటు జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–45, రోడ్డు నెంబర్–36తో పాటు జర్నలిస్ట్ కాలనీ చౌరస్తా, సీవీఆర్ న్యూస్ చౌరస్తా, అగ్రసేన్ చౌరస్తా, విరించి హాస్పటల్ చౌరస్తా, కేబీఆర్ పార్కు చౌరస్తాల్లో రెండు విడతలుగా పర్యటించారు.
► ట్రాఫిక్ ఎక్కడెక్కడ రద్దీగా ఉంటుందో పరిశీలించడమే కాకుండా అందుకు గల కారణాలపై ఆరా తీశారు. ఏమి చేస్తే బాగుంటుందనే దానిపై అప్పటికే ట్రాఫిక్‌పై అధ్యయనం చేసిన అధికారులతో చర్చించి డిజైన్లను పరిశీలించారు.
అండర్‌పాస్‌లు.. ఫ్లైఓవర్లు...
జీహెచ్‌ఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన సమన్వయ పర్యటనలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు చౌరస్తా నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు దాటి, రోడ్డు నెంబర్–45 బాలకృష్ణ ఇంటి చౌరస్తా వరకు వెళ్లడానికి అండర్‌పాస్ నిర్మించాలని నిర్ణయించారు.
► ఇందులో భాగంగా అడ్డుగా ఉన్న డ్రైనేజీ, మంచినీటి, వరదనీటి పైప్‌లైన్లను మళ్లించేందుకు ప్రణాళికలు రూపొందించాలని
తీర్మానించారు.
► కేబీఆర్ పార్కులో ఒక్క చెట్టు కూడా నష్టపోకుండా గ్రీన్ ట్రిబ్యునల్ అథారిటీకి లోబడి 1.5 కిలోమీటర్ల మేర ఈ అండర్‌పాస్ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలని ఇంజినీర్లను ఆదేశించారు. దీని ద్వారా బాలకృష్ణ ఇంటివైపు, ఫిలింనగర్ వైపు, రోడ్డు నెంబర్–45 వైపు వాహనదారులు కేబీఆర్ పార్కు నుంచి ఎలాంటి ఆటంకా>లు లేకుండా తేలిగ్గా ముందుకుసాగనున్నారు.
► జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–45 బాలకృష్ణ ఇంటి చౌరస్తా నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు మీదుగా బంజారాహిల్స్ కేబీఆర్ పార్కు వరకు వన్‌వేలో వెళ్లేందుకు ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. సుమారు కిలోమీటరు మేర ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టనున్నారు.
► జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–45 కేబుల్ బ్రిడ్జి ఫ్లైఓవర్ నుంచి వాహనాలు దిగిన తర్వాత ఆ వెంటనే కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్ మీదుగా బంజారాహిల్స్ వైపు వాహనదారులు వెళ్లేందుకు అనువుగా ఈ నిర్మాణం చేపట్టనున్నారు. ఇప్పటికే అటు అండర్‌పాస్, ఇటు ఫ్లైఓవర్ నిర్మాణాల కోసం సంబంధిత ఇంజినీర్లు డిజైన్లు కూడా పూర్తిచేయగా, ఆ మ్యాప్‌లను జీహెచ్‌ఎంసీ, పోలీసు కమిషనర్లు పరిశీలించారు.
► జర్నలిస్ట్ కాలనీ చౌరస్తాలో ప్రముక పాత్రికేయుడి శిలా విగ్రహం రోడ్డు మధ్యలోకి రావడంతో ఆ విగ్రహాన్ని సెంట్రల్ మీడియన్‌లో ఏర్పాటు చేయాలని ఇప్పటికే జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ప్రతినిధులతో ఓ దఫా చర్చించారు. మరోసారి సంబంధిత ప్రతినిధులతో సంప్రదించి ఈ విగ్రహాన్ని మరింత సుందరంగా చౌరస్తా మధ్యలో నిర్మించాలని నిర్ణయించారు.
► దీని ద్వారా జర్నలిస్ట్ కాలనీ వైపు నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టుకు వెళ్లే వాహనదారులు మరింత తేలికగా ముందుకుసాగనున్నారు.
► కేబీఆర్ జంక్షన్, జూబ్లీహిల్స్ జంక్షన్, జర్నలిస్ట్‌కాలనీ జంక్షన్, జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–45 జంక్షన్, సీవీఆర్ న్యూస్ జంక్షన్, బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–12 అగ్రసేన్ జంక్షన్లలో ఇరుకుగా ఉన్న సెంట్రల్ మీడియన్లను కొంతమర తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు.
► నాలుగువైపులా వాహనాలు తేలిగ్గా వెళ్లేందుకు వీలుగా ఈ సెంట్రల్ మీడియన్లను కట్ చేయనున్నారు. 20 సంవత్సరాలు క్రితం అప్పటి ట్రాఫిక్‌కు అనుగుణంగా ఈ చౌరస్తాలు రూపుదిద్దుకోగా, అప్పటి నుంచి ఇప్పటిదాకా చిన్న మార్పు కూడా చేయకుండా ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోగా, రోడ్లు, జంక్షన్ల విస్తరణ కూడా చేపట్టలేదు. ఇన్నాళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం జంక్షన్ల విస్తరణకు ముందుకురావడమే కాకుండా నిధులు కూడా మంజూరు చేయాలని నిర్ణయించింది.
► కేబీఆర్ పార్కు వైపు నుంచి జూబ్లీహిల్స్ చౌరస్తా మీదుగా ఫిలింనగర్ వెళ్లే జూబ్లీహిల్స్ జంక్షన్ మలుపు వద్ద భారీ హైటెన్షన్ స్తంభాలు ఫుట్‌పాత్‌పై అడ్డుగా ఉన్నాయి. ఇక్కడ ఫుట్‌పాత్ కూడా చాలా వెడల్పుగా ఉంది. ఫిలింనగర్ వైపు 2, 3 బస్టాపులు అనవసరంగా నిర్మించారు.
► హైటెన్షన్ స్తంభాలను తొలగించి ఫుట్‌పాత్ వెడల్పును తగ్గించి మూడు బస్òÙల్టర్లను తీసేయడం ద్వారా ఫిలింనగర్ వైపు ప్రీలెఫ్ట్‌లో వాహనదారులు తేలికగా వెళతారని నిర్ణయించారు.
► ఇక కేబీఆర్ పార్కు చుట్టూ ఉన్న పార్కింగ్ స్థలాల్లో మలీ్టలెవల్ పార్కింగ్ సౌకర్యాలు కలి్పంచే దిశలో కూడా అధికారులు చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment