jubilee hills checkpost
-
హైదరాబాద్ లో BMW కారు బీభత్సం
-
Underpass: బంజారాహిల్స్ టు జూబ్లీహిల్స్!
మహానగరంలో ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు కొత్త ప్రభుత్వం రంగంలోకి దిగింది. ట్రాఫిక్ రద్దీ అత్యధికంగా ఉన్న జంక్షన్లలో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేంచాలని, ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్ జంక్షన్లలో తలెత్తుతున్న వాహన రద్దీని అదుపులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్‌పై జీహెచ్ఎంసీ, పోలీసులతో సమీక్ష నిర్వహించిన సీఎం నగరంలోనే అత్యధిక రద్దీతో రికార్డుల్లోకెక్కిన జూబ్లీహిల్స్ జంక్షన్‌పై దృష్టిపెట్టాలని సూచించారు. బంజారాహిల్స్: జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్‌రాస్, నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి సంబంధిత అధికారులతో కలిసి నాలుగు రోజుల క్రితం జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు పాటు జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–45, రోడ్డు నెంబర్–36తో పాటు జర్నలిస్ట్ కాలనీ చౌరస్తా, సీవీఆర్ న్యూస్ చౌరస్తా, అగ్రసేన్ చౌరస్తా, విరించి హాస్పటల్ చౌరస్తా, కేబీఆర్ పార్కు చౌరస్తాల్లో రెండు విడతలుగా పర్యటించారు. ► ట్రాఫిక్ ఎక్కడెక్కడ రద్దీగా ఉంటుందో పరిశీలించడమే కాకుండా అందుకు గల కారణాలపై ఆరా తీశారు. ఏమి చేస్తే బాగుంటుందనే దానిపై అప్పటికే ట్రాఫిక్‌పై అధ్యయనం చేసిన అధికారులతో చర్చించి డిజైన్లను పరిశీలించారు. అండర్‌పాస్‌లు.. ఫ్లైఓవర్లు... జీహెచ్ఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన సమన్వయ పర్యటనలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు చౌరస్తా నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు దాటి, రోడ్డు నెంబర్–45 బాలకృష్ణ ఇంటి చౌరస్తా వరకు వెళ్లడానికి అండర్‌పాస్ నిర్మించాలని నిర్ణయించారు. ► ఇందులో భాగంగా అడ్డుగా ఉన్న డ్రైనేజీ, మంచినీటి, వరదనీటి పైప్లైన్లను మళ్లించేందుకు ప్రణాళికలు రూపొందించాలని తీర్మానించారు. ► కేబీఆర్ పార్కులో ఒక్క చెట్టు కూడా నష్టపోకుండా గ్రీన్ ట్రిబ్యునల్ అథారిటీకి లోబడి 1.5 కిలోమీటర్ల మేర ఈ అండర్‌పాస్ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలని ఇంజినీర్లను ఆదేశించారు. దీని ద్వారా బాలకృష్ణ ఇంటివైపు, ఫిలింనగర్ వైపు, రోడ్డు నెంబర్–45 వైపు వాహనదారులు కేబీఆర్ పార్కు నుంచి ఎలాంటి ఆటంకా>లు లేకుండా తేలిగ్గా ముందుకుసాగనున్నారు. ► జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–45 బాలకృష్ణ ఇంటి చౌరస్తా నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు మీదుగా బంజారాహిల్స్ కేబీఆర్ పార్కు వరకు వన్‌వేలో వెళ్లేందుకు ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. సుమారు కిలోమీటరు మేర ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టనున్నారు. ► జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–45 కేబుల్ బ్రిడ్జి ఫ్లైఓవర్ నుంచి వాహనాలు దిగిన తర్వాత ఆ వెంటనే కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్ మీదుగా బంజారాహిల్స్ వైపు వాహనదారులు వెళ్లేందుకు అనువుగా ఈ నిర్మాణం చేపట్టనున్నారు. ఇప్పటికే అటు అండర్‌పాస్, ఇటు ఫ్లైఓవర్ నిర్మాణాల కోసం సంబంధిత ఇంజినీర్లు డిజైన్లు కూడా పూర్తిచేయగా, ఆ మ్యాప్‌లను జీహెచ్ఎంసీ, పోలీసు కమిషనర్లు పరిశీలించారు. ► జర్నలిస్ట్ కాలనీ చౌరస్తాలో ప్రముక పాత్రికేయుడి శిలా విగ్రహం రోడ్డు మధ్యలోకి రావడంతో ఆ విగ్రహాన్ని సెంట్రల్ మీడియన్‌లో ఏర్పాటు చేయాలని ఇప్పటికే జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ప్రతినిధులతో ఓ దఫా చర్చించారు. మరోసారి సంబంధిత ప్రతినిధులతో సంప్రదించి ఈ విగ్రహాన్ని మరింత సుందరంగా చౌరస్తా మధ్యలో నిర్మించాలని నిర్ణయించారు. ► దీని ద్వారా జర్నలిస్ట్ కాలనీ వైపు నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టుకు వెళ్లే వాహనదారులు మరింత తేలికగా ముందుకుసాగనున్నారు. ► కేబీఆర్ జంక్షన్, జూబ్లీహిల్స్ జంక్షన్, జర్నలిస్ట్‌కాలనీ జంక్షన్, జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–45 జంక్షన్, సీవీఆర్ న్యూస్ జంక్షన్, బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–12 అగ్రసేన్ జంక్షన్లలో ఇరుకుగా ఉన్న సెంట్రల్ మీడియన్లను కొంతమర తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. ► నాలుగువైపులా వాహనాలు తేలిగ్గా వెళ్లేందుకు వీలుగా ఈ సెంట్రల్ మీడియన్లను కట్ చేయనున్నారు. 20 సంవత్సరాలు క్రితం అప్పటి ట్రాఫిక్‌కు అనుగుణంగా ఈ చౌరస్తాలు రూపుదిద్దుకోగా, అప్పటి నుంచి ఇప్పటిదాకా చిన్న మార్పు కూడా చేయకుండా ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోగా, రోడ్లు, జంక్షన్ల విస్తరణ కూడా చేపట్టలేదు. ఇన్నాళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం జంక్షన్ల విస్తరణకు ముందుకురావడమే కాకుండా నిధులు కూడా మంజూరు చేయాలని నిర్ణయించింది. ► కేబీఆర్ పార్కు వైపు నుంచి జూబ్లీహిల్స్ చౌరస్తా మీదుగా ఫిలింనగర్ వెళ్లే జూబ్లీహిల్స్ జంక్షన్ మలుపు వద్ద భారీ హైటెన్షన్ స్తంభాలు ఫుట్‌పాత్‌పై అడ్డుగా ఉన్నాయి. ఇక్కడ ఫుట్‌పాత్ కూడా చాలా వెడల్పుగా ఉంది. ఫిలింనగర్ వైపు 2, 3 బస్టాపులు అనవసరంగా నిర్మించారు. ► హైటెన్షన్ స్తంభాలను తొలగించి ఫుట్‌పాత్ వెడల్పును తగ్గించి మూడు బస్òÙల్టర్లను తీసేయడం ద్వారా ఫిలింనగర్ వైపు ప్రీలెఫ్ట్‌లో వాహనదారులు తేలికగా వెళతారని నిర్ణయించారు. ► ఇక కేబీఆర్ పార్కు చుట్టూ ఉన్న పార్కింగ్ స్థలాల్లో మలీ్టలెవల్ పార్కింగ్ సౌకర్యాలు కలి్పంచే దిశలో కూడా అధికారులు చర్చించారు. -
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. మద్యం మత్తులో యువతులు!
హైదరాబాద్: జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వెళ్లి అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. మద్యం మత్తులో ఉన్న యువతులు కారు నడిపినట్లు తెలుస్తోంది. తాగి రోడ్డుపై షికారు చేస్తూ నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో కారు పాక్షికంగా ధ్వంసమైంది. అదృష్టవశాత్తు ఎవరికీ తీవ్రగాయాలు కాలేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. కారు నడిపిన వారిని విచారిస్తున్నారు. చదవండి: ఒక మర్రితో మరిన్ని..! చేవెళ్ల రోడ్డు విస్తరణతో 760 మర్రి చెట్లకు గండం -
బస్టాప్‌లో బస్సు ఆపొద్దంటూ బోర్డు.. పాపం ప్రయాణికులు..
హైదరాబాద్: బస్టాప్‌లు ఏర్పాటు చేసేదే బస్సులు ఆపేందుకు.. కానీ బస్టాప్‌లో బస్సులు ఆగడం వల్ల వెనక ట్రాఫిక్ నిలిచిపోతుందంటూ ట్రాఫిక్ పోలీసులు ఆ బస్టాప్‌లో బస్సులు ఆగొద్దంటూ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ పోలీసుల నిర్ణయం వల్ల ప్రయాణికులు, వాహనదారుల పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్న చందంగా మారింది. వివరాల్లోకి వెళ్తే... జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి అపోలో ఆస్పత్రి వైపు వెళ్లే రోడ్డులో బస్టాప్ ఉంది. ఈ బస్టాప్‌లో గత కొన్ని సంవత్సరాలుగా బస్సులు ఆగుతుంటాయి. వందల సంఖ్యలో ప్రయాణికులు ఇక్కడినుంచి రాకపోకలు సాగిస్తుంటారు. అయితే బస్టాప్‌లో బస్సులు ఆగడం వల్ల ట్రాఫిక్ నిలిచిపోతుందంటూ జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు ఈ బస్టాప్‌లో బస్సులు, ఆటోలు నిలపవద్దంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. దీంతో బస్సులు ఎక్కడ ఆపాలంటూ ఒక వైపు ఆర్టీసీ డ్రైవర్లు, మరోవైపు బస్సులు ఎక్కేందుకు వస్తున్న ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. కొరవడిన సమన్వయం... జూబ్లీహిల్స్ చెక్‌పోస్టులో సిగ్నళ్లకు దగ్గరగా ఉన్న బస్టాప్‌ల వద్ద సమస్య ఎదురైతే ట్రాఫిక్ పోలీసులు ముందుగా ఆయా బస్టాప్‌లను తొలగించి మరికొంత దూరంలో ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీకి సూచించాల్సిన అవసరం ఉంది. కానీ అలాంటి ప్రతిపాదన చేయకుండా సంబంధిత అధికారులు బస్టాప్‌లో బస్సులు ఆపొద్దంటూ బోర్డులు పెట్టడం ఇప్పుడు విమర్శలకు దారి తీస్తోంది. ఇంకాస్త దూరం వెళ్లాక బస్సులు ఆపేందుకు అనువైన స్థలం కూడా లేదు. ఇక్కడ ఇరుకైన రోడ్డులో నిత్యం వేలాది వాహనాలు ప్రయాణం చేస్తుంటాయి. నిత్యం ఫిలింనగర్, అపోలో ఆస్పత్రి వైపు వెళ్లే వందలాది మంది ఇక్కడ బస్సు సేవలను వినియోగించుకుంటుంటారు. రెండు శాఖల అధికారులు ఈ ప్రాంతంలో పర్యటించి ట్రాఫిక్ సమస్య ఉన్నట్లయితే వీటిని ఇక్కడి నుంచి తొలగించి ప్రయాణికులకు అనువైన స్థలంలో బస్టాప్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. (క్లిక్ చేయండి: ముందు బైక్... వెనకాల కాన్వాయ్.. అభిమానిని చూసి ఆగిన ఎంపీ) -
జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద కారు బీభత్సం
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద సోమవారం అర్థరాత్రి కారు బీభత్సం సృష్టించింది. ఓ వ్యక్తి కారును వేగంగా నడుపుతూ.. సిగ్నల్ వద్ద యూటర్న్ తీసుకోవడానికి ప్రయత్నించడంతో.. వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటన జరిగిన వెంటనే డ్రైవర్ కారును అక్కడే వదిలేసి పరారయ్యాడు. విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్రేన్ సహయంతో కారును తొలగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటనలో డ్రైవర్‌కు పెద్దగా గాయాలు కాలేదని తెలుస్తోంది. -
జూబ్లీ చెక్‌పోస్టు వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం..!
సాక్షి, హైదరాబాద్ : జూబ్లీ చెక్‌పోస్టు వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. సికింద్రాబాద్ నుంచి కొండాపూర్ వెళ్తున్న సిటీ బస్సు జూబ్లీ చెక్‌పోస్టు వద్ద అతివేగంగా వచ్చి ఓ స్కూటీని ఢీకొట్టింది. స్కూటీపై వెళ్తున్న ఇద్దరిలో ఒకరు తీవ్రగాయాలపాలై అక్కడిక్కడే ప్రాణాలు విడువగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రున్ని ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
జూబ్లీహిల్స్‌లో బైక్ రేసింగ్‌లు అడ్డుకున్న పోలీసులు
హైదరాబాద్ : నగరంలోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు సమీపంలో బైక్ రేసింగులు చేస్తున్న యువకులను ఆదివారం పోలీసులు అడ్డుకున్నారు. ఆ క్రమంలో పోలీసులపై సదరు యువకులు చిందులు తొక్కారు. దీంతో ఆగ్రహించిన పోలీసులు బైక్ రేసింగులకు పాల్పడుతున్న 16 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే 16 బైకులతోపాటు రెండు కార్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని... పోలీస్ స్టేషన్‌కు తరించారు. యువకుల తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్‌కు పోలీసులు పిలిపించారు. వారి సమక్షంలో యువకులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. -
అర్ధరాత్రి బైక్ రేసింగ్‌లు... పోలీసుల దాడులు
హైదరాబాద్ : అర్ధరాత్రి బైక్ రేసింగ్‌లకు పాల్పడుతున్న యువకులకు బంజారాహిల్స్ పోలీసులు చెక్ పెట్టారు. శనివారం అర్ధరాత్రి పలువురు యువకులు జూబ్లిహిల్స్ చెక్ పోస్ట్ ప్రాంతంలో రేసింగ్‌లు నిర్వహిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు దాడులకు దిగారు. 25 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం 25 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. ఆ తర్వాత వారిని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. సదరు యువకులు తల్లిదండ్రులను స్టేషన్‌కి పిలిపించి... వారి... సమక్షంలో యువకులకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. -
చెక్‌పోస్ట్ వద్ద కారులో మంటలు
-
'బడా' బాబుల బైక్ రేసులకు పోలీసుల బ్రేకులు
-
బైక్ రేసులు... వీఐపీల పుత్రరత్నాలు అరెస్ట్
జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ ప్రాంతంలో అర్థరాత్రి తప్ప తాగి బైక్ రేసింగ్‌లకు పాల్పడుతున్న 15 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ యువకుల వద్ద నుంచి 8 అత్యంత ఖరీదైన బైకులతోపాటు, భారీ మొత్తంలో నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం యువకులను అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. యువకులను పోలీసులు విచారించగా పలు అసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బైక్ రేసింగ్‌లకు పాల్పడుతున్న యువకులంతా నగరానికి చెందిన ప్రముఖ విఐపీల కుమారులని తేలడంతో పోలీసులు సదరు యువకుల తల్లితండ్రులకు సమాచారం అందించారు. దాంతో వీఐపీలంతా జూబ్లీహిల్స్ స్టేషన్‌కు తరలి వచ్చారు. తల్లితండ్రుల సమక్షంలో యువకులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. బైక్ రేసింగ్‌లపై నిషేదం ఉన్నా యువకులు ఇలాంటి చర్యలకు పాల్పడటంతో పోలీసులు యువకులపై కేసు నమోదు చేశారు.